నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 7 ఎపిసోడ్ లో నా చెల్లిగా ఎలా పుట్టావ్ జగదీశ్వరి అంటూ వరదరాజులు క్యారెక్టర్ లో ఉన్న క్రాంతి రెచ్చిపోతాడు. అన్నయ్య రఘురాం చాలా మంచోడు. తనంటే నాకు ప్రాణమని జగదీశ్వరి క్యారెక్టర్ లో ఉన్న చంద్రకళ చెప్తుంది. శవాల మీద నడిచైనా పరువు నిలబెట్టుకుంటానని రఘురాం లేరా అని కాలర్ పట్టుకుంటాడు వరదరాజులు.
తాళి కట్టిన విరాట్

అన్నయ్య కాలర్ వదులు. నా భర్త మీద చేయి వేస్తే ఊరుకోనని జగదీశ్వరి క్యారెక్టర్ లో ఉన్న చంద్రకళ చెప్తుంది. నేను బతికి ఉండగా ఈ పెళ్లి నువ్వు ఆపలేవని శ్యామల అంటుంది. శ్యామల డామినెన్స్ చేస్తుందని మధ్యలో కామాక్షిగా శ్రుతి వస్తే క్రాంతి తోసేస్తాడు. ఈ ఇంట్లో ఏనాటికైనా ప్రేమకు చోటు ఉంటుందని శ్యామల చెప్తుంది. విరాట్ తాళి తీసుకుని చంద్రకళ మెడలో కడతాడు.
గుర్తొచ్చిన గతం
జగదీశ్వరి ఆ తాళి తీసేయ్ అని క్రాంతి పైపైకి వెళ్తాడు. అప్పుడే ఒరే వరదరాజులు జగదీశ్వరి ఇప్పుడు నా భార్య అని రఘురాం అడ్డుకోవడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నా పెళ్లి ఎలా జరిగిందో నాకు గుర్తుకొచ్చిందని రఘురాం అంటాడు. ఈ ఐడియా ఇచ్చింది నేనేనని చంద్ర చెప్తుంది. జగదీశ్వరి థ్యాంక్స్ చెప్తుంది. మనం ఎదురీదిన సముద్రం ఒకటే అత్తయ్య అని చంద్ర అంటుంది.
ప్రేమ కావాలని
రఘురాం, జగదీశ్వరి దండలు మార్చుకుంటారు. నా వల్ల ఎన్ని బాధలు పడ్డా చేయి విడవకుండా తోడుగా ఉన్నావు. నేనే కాళ్ల మీద పడాలని భార్యతో రఘురాం అంటాడు. పరిస్థితుల వల్ల కష్టాలు ఎదుర్కున్నాం. కానీ మీ వల్ల కాదు. జన్మజన్మలకు మీ ప్రేమ కావాలని జగదీశ్వరి అంటుంది. మీ పెళ్లి చూడలేకపోయామన్న లోటు ఈ రోజుతో తీరిపోయిందని విరాట్, చంద్రతో రఘురాం అంటాడు.
జల్ రాజ్, శ్రుతి కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. ఇప్పటికైనా లైఫ్ ను సీరియస్ తీసుకుని మీ కాళ్ల మీద నిలబడి బతకడం అలవాటు చేసుకోండని రఘురాం అంటాడు. ప్రేమను, నిజాయతీని ఎప్పుడూ సపోర్ట్ చేస్తాం. మోసాన్ని సహించమని జగదీశ్వరి చెప్తుంది. కొత్త పెళ్లి దంపతుల్లా రఘురాం, జగదీశ్వరి ఆటలాడుతారు. అందరు కలిసి భోజనం చేస్తారు.
శ్యామలకు థ్యాంక్స్
{{/usCountry}}జల్ రాజ్, శ్రుతి కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. ఇప్పటికైనా లైఫ్ ను సీరియస్ తీసుకుని మీ కాళ్ల మీద నిలబడి బతకడం అలవాటు చేసుకోండని రఘురాం అంటాడు. ప్రేమను, నిజాయతీని ఎప్పుడూ సపోర్ట్ చేస్తాం. మోసాన్ని సహించమని జగదీశ్వరి చెప్తుంది. కొత్త పెళ్లి దంపతుల్లా రఘురాం, జగదీశ్వరి ఆటలాడుతారు. అందరు కలిసి భోజనం చేస్తారు.
శ్యామలకు థ్యాంక్స్
{{/usCountry}}శ్రుతి, రాజ్ వెళ్లిపోతారు. థ్యాంక్స్ పిన్నిగారు. మీ సహకారం వల్ల అందరి సమక్షంలో మా పెళ్లి జరిగింది. ఆ రోజు అత్తయ్య, మామయ్యలకు అండగా నిలబడి ఒక్కటి చేశారు. ఆ తర్వాత నాకు అండగా నిలబడి ఆయనకు దగ్గర చేశారు. ఈ రోజు తాళి కట్టించారు. మీ ఆశీర్వాదం ఫలించి మేం ఒక్కటవుతాం. మా ప్రేమ గెలుస్తుందని శ్యామలతో అంటుంది చంద్ర.
ఏంటో ఈ అమ్మాయి ప్రతి విషయాన్ని తనకు అనుగుణంగా అనుకుని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తుంది. నేను అంత ఈజీగా పడిపోనని శ్యామల అనుకుంటుంది. గదిలో విరాట్ ను సంతోషంతో ముద్దు పెడుతుంది చంద్ర. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.