...
...
Next Story

Ninnu Kori March 10th Episode: నిన్ను కోరి- విరాట్ జీవితంలోకి మాయ- 10 రోజుల గడువు- దుబాయ్‌లో ల్యాండ్ అమ్మిన పురుషోత్తం!

Ninnu Kori Serial March 10th Episode: నిన్ను కోరి సీరియల్ మార్చి 10 ఎపిసోడ్‌లో జల్‌రాజ్ ట్రావెల్ ఎజెన్సీని రఘురాం, జగదీశ్వరిలతో ఓపెన్ చేయిస్తాడు. విరాట్ ల్యాండ్ డాక్యుమెంట్ మిస్ అయిందని, అది తిరిగి పొందడానికి అమ్మిన వ్యక్తి సైన్ కావాలని క్రాంతి చెబుతాడు. దాంతో అతని దగ్గరికి విరాట్ వెళ్తాడు.

Published on: Mar 10, 2026, 09:31:22 IST
Advertisement

Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్, చంద్రకళ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే క్రాంతి వస్తాడు. క్రాంతి, విరాట్ చంద్రకళకు పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుతారు. తర్వాత ల్యాండ్ ఇష్యూలో లింక్‌డ్ డాక్యుమెంట్ మిస్ అయిందని క్రాంతి చెబుతాడు.

అమ్మిన వారి సంతకం కావాలి

నిన్ను కోరి సీరియల్ మార్చి 10 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ మార్చి 10 ఎపిసోడ్‌

ఆ మాటలు విన్న శాలిని ఆ డాక్యుమెంట్ తానే దొంగలించినట్లు గుర్తు చేసుకుంటుంది. ఆ డాక్యుమెంట్‌ను మళ్లీ తీసుకోవచ్చటా. కానీ, దానికి అమ్మిన వారి సైన్ కావాలట అని క్రాంతి చెబుతాడు. అదేముంది ఆయన మాదాపూర్‌లో ఉంటాడు. వెళ్లి సైన్ చేయించుకోవచ్చు అని విరాట్ అంటాడు. దాంతో క్రాంతి వెళ్లిపోతాడు.

అంత కష్టపడి డాక్యుమెంట్ దొంగలిస్తే మల్లీ రీగేయిన్ చేయొచ్చాంటారేంటీ. అది పూర్తయ్యాకా చూద్దాం అని శాలిని వెళ్లిపోతుంది. జల్‌రాజు ట్రావెల్ బిజినెస్ పెడుతున్నాడు. రేపే ఓపెనింగ్. అందరిని రమ్మన్నాడు అని చంద్రకళ చెబుతుంది. మరుసటి రోజు ఉదయం ట్రావెల్ బిజినెస్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతుంటాయి.

జల్‌రాజ్‌కు ఎవరు డబ్బు ఇస్తున్నారో తెలిస్తే ఆపేదాన్ని అని శ్రుతి అనుకుంటుంది. రాజ్ గురించి గొప్పగా చెబుతుంది తల్లి సరోజా. శ్రుతి సెటైర్లు వేస్తుంది. ఎంత ట్రై చేసిన నీ అప్పులు తీర్చనివ్వను అని శ్రుతి అనుకుంటుంది. ఇంతలో రఘురాం ఫ్యామిలీ వస్తుంది. జగదీశ్వరి, రఘురాంతో రిబ్బన్ కట్ చేయిస్తాడు జల్‌రాజ్. లోపల జ్యోతి ప్రజ్వలన చేస్తారు.

దుబాయ్ వెళ్లారు

మరోవైపు తనకు ల్యాండ్ అమ్మిన వ్యక్తి పురుషోత్తం దగ్గరికి విరాట్ వెళ్తాడు. ఆయన దుబాయ్ వెళ్లారని చెబుతాడు మేనేజర్. తన విషయం గురించి విరాట్ చెబుతాడు. అయితే రెండు మూడు రోజులు పడుతుంది. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఆయన కాల్ చేస్తే చెబుతాను అని అతను అని నెంబర్ తీసుకుంటాడు. దాంతో విరాట్ వెళ్లిపోతాడు. ఇంతలో విరాట్‌కు మేనేజర్ కాల్ చేసి కస్టమర్స్ అంతా మనీ రిటర్న్ అడుగుతున్నారని, విషయం అందరికి తెలిసిపోయిందని అంటాడు.

ఆ అమ్మాయి వెనుక వెహికిల్స్ వస్తుంటాయి. ఓ పెద్ద వ్యాన్ రావడంతో వెళ్లి విరాట్ ఆ అమ్మాయిని లాగుతాడు. నన్ను చావనివ్వు అని ఆమె అంటే లాగిపెట్టి కొడతాడు విరాట్. మాయ.. ఏంటీ నువ్వు ఇలా అని గుర్తుపడతాడు విరాట్. మరోవైపు విరాట్ కోసం ఎదురుచూస్తుంది చంద్రకళ. శ్యామల, కామాక్షి దాని గురించి గొడవ పడతారు. ఇంతలో విరాట్ ఇంటికి మాయను తీసుకొస్తాడు.

మాయను పరిచయం చేసిన విరాట్

అది చూసి అంతా షాక్ అవుతారు. తనపేరు మాయ అని, కొన్నిరోజులు మన ఇంట్లోనే ఉంటుందని చెబుతాడు విరాట్. మాయను కామాక్షి తీసుకెళ్లి గది చూపిస్తుంది. మాయ చనిపోడానికి ట్రై చేసిందని, చూసి కాపాడి తీసుకొచ్చానని విరాట్ చెబుతాడు. ఆ అమ్మాయి బాధ ఏంటో కనుక్కుని పరిష్కరించు అని జగదీశ్వరి చెబుతుంది. మాయ బాధ్యత నాది అని చంద్రకళ చెబుతుంది.

మరోవైపు ట్రావెల్ బిజినెస్ గురించి కస్టమర్స్‌తో మాట్లాడుతాడు. ఇదంతా వీడికి ఎప్పుడు తెలిసింది అని శ్రుతి అంటే.. తెలుసుకున్నాడే, వాడి పేరులోనే రాజు ఉంది అని సరోజ అంటుంది. మరోవైపు విరాట్, చంద్రకళ ముద్దు పెట్టుకోబోతుంటే మాయ మధ్యలో వస్తుంది. దాంతో ఆగిపోతారు. అలా విరాట్ జీవితంలోకి వచ్చిన మాయ అడ్డుపడుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks