Gunde Ninda Gudi Gantalu Today Episode: అత్తపై శ్రుతి అరుపులు- తలకిందులైన బాలు డ్రామా- గృహ హింస కేసు- మళ్లీ కాలేజీకి శివ
Gunde Ninda Gudi Gantalu Serial March 6th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 5 ఎపిసోడ్‌లో శివను మళ్లీ కాలేజీలోకి పంపించేందుకు ప్రిన్సిపాల్‌ను కలిసేందుకు బాలు, మీనా వెళ్తారు. కానీ, కలవడం కుదరదు. దాంతో బాలు మందు బాటిల్‌తో డ్రామా చేస్తాడు. కానీ, అది రివర్స్ అయి బాలును పోలీసులు తీసుకెళ్లిపోతారు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతికి వచ్చిన పార్సల్‌ను ప్రభావతి ఓపెన్ చేస్తుంది. శ్రుతి బాధపడుతుందని మీనా అంటే.. ప్రతిదాంట్లో వేలు పెడతావ్. నీకెంటీ కడుపు మంట అని తిట్టి పంపిస్తుంది ప్రభావతి.

అత్తపై శ్రుతి అరుపులు
పార్సల్‌లో హెడ్ ఫోన్స్ ఉంటుంది. దాని గురించి మీనా చెప్పిన వినిపించుకోదు. హెడ్ సెట్ పెట్టుకుని నాకు చాలా బాగుందని మురిసిపోతుంది. ఇంతలో శ్రుతి వచ్చి తనకు వచ్చిన పార్సల్‌ను పర్మిషన్ లేకుండా ఎలా ఓపెన్ చేస్తారని నిలదీస్తుంది. క్యూరియాసిటీతో చూసిందని రవి అంటాడు. అలా అన్ని చూస్తారా అని శ్రుతి కోప్పడుతుంది.
నువ్వు నా కోడలివేగా. మన ఇంటికే వచ్చింది కదా అని ఓపెన్ చేశానని ప్రభావతి అంటుంది. నా వస్తువులు ఎవరు తీసినా నాకు నచ్చదు అని శ్రుతి అంటే తెలియక తీసిందని రవి అంటాడు. సారీ ఆంటీ మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు. నా వస్తువులు ఎవరు ముట్టుకున్నా నాకు నచ్చదని కోప్పడి వెళ్లిపోతుంది శ్రుతి. ఇప్పుడు నీకు చల్లగా ఉందని మీనాను తిడుతుంది ప్రభావతి.
రవిని ప్రభావతి బయటకు తీసుకెళ్లి శ్రుతి అలా తిట్టడం ఏంటీ. మీద పడి కరిచేస్తుంటే ఏం చేస్తున్నావని నిలదీస్తుంది. అసలు ఇది నా ఇల్లు దాని ఇల్లా. అత్తయ్య అని గౌరవం ఉందా దానికి. ఇలాగే గారాబం చేస్తే బాలు గాడిలా తయారవుతావ్. మీనా వాడిని కొంగున కట్టేసుకుంది. నువ్వు కూడా అలా అవ్వకు అని ప్రభావతి అనేసి వెళ్లిపోతుంది. ఆ మాటలు మీనా వింటుంది.
కాలేజీకి బాలు మీనా
అది చూసిన రవి తల్లి మాటలు పట్టించుకోకంటాడు. ఆమె మాటలు పట్టించుకుంటే బతకడం కష్టమని మీనా అంటుంది. రవి వెళ్లిపోతాడు. ఇంతలో బాలు కాల్ చేసి గుణ గాడు తప్పించుకు తిరుగుతున్నాడని, నువ్వు కాలేజీకి వచ్చేయమని చెబుతాడు. కాలేజీకి బాలు, మీనా ఇద్దరు వెళ్తారు. గుణ గాడిని పట్టుకోవాలంటే టైమ్ పట్టేలా ఉంది, ఎల్లుండి నుంచే శివకు పరీక్షలు కదా, ప్రిన్సిపాల్‌తో మాట్లాడదామని బాలు అంటాడు.
ఇద్దరు కాలేజీలో నడుస్తూ తామిద్దరం చదువుకుంటే ఎంత బాగుండేదో అని మాట్లాడుకుంటారు. బాలు, మీనాను ప్యూన్ కలిసి ప్రిన్సిపాల్‌తో శివ గురించి మాట్లాడాలని చెబుతారు. అపాయింట్‌మెంట్ ఉండాలని ప్యూన్ అంటాడు. మీరు మంచివాళ్లలా ఉన్నారు. ఇవాళే కలవాలి అని బాలు అనడంతో ప్యూన్ సరేనంటాడు. సర్‌తో మాట్లాడి వస్తానని ప్యూన్ వచ్చి ఆయన ఒప్పుకోవట్లేదంటాడు.
తన తండ్రి గురించి మీనా ఎమోషనల్‌గా చెబుతుంది. కానీ, మళ్లీ నేను వెళ్తే మెడపట్టి గెంటేస్తారు అని ప్యూన్ వెళ్లిపోతాడు. ప్రిన్సిపాల్ ఎందుకు కలవాలనుకోవట్లేదు అని బాలు, మీనా అనుకుంటారు. ఇంతలో ప్రిన్సిపాల్ బయటకు వస్తే కలవాలని బాలు, మీనా వెళ్తే ప్యూన్ అడ్డుకుంటాడు. ప్యూన్‌కు డబ్బిచ్చి శివ భవిష్యత్తు చూడమని, ఇంకోసారి మాట్లాడమని బాలు అంటాడు.
ప్రిన్సిపాల్ కూతురు స్టోరీ
ప్రిన్సిపాల్‌కు చిరాకు ఎక్కువ. ఇంతకుముందు సర్ అందరితో బాగుండేవారు. కానీ, ఆయనకు ఓ కూతురు ఉండేది. చాలా కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. అయితే అతనికి మందు అలవాటు ఉండేది. ఇప్పటికీ తాగుతున్నాడు. దాంతో తన కూతురు పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి ఇలా అయ్యారని ప్యూన్ తిరిగి డబ్బు ఇస్తాడు. ప్రిన్సిపాల్ అడ్రస్‌ను బాలు అడుగితే ప్యూన్ చెబుతాడు.
మరోవైపు మనోజ్ షాపులో సేల్స్ మేన్ వచ్చి తన అత్తకూతురు పెద్దమనిషి అయిందని, డబ్బు కావాలని అడుగుతాడు. నువ్వెప్పుడు అయిన ఒక్క ఐటమ్ అమ్మావా అని మనోజ్ తిడతాడు. మీ వాస్తు అలా ఉంటే నేనేం చేయను అని అతను అంటాడు. దాంతో చేతిలో డబ్బు పెట్టి వెళ్లమంటాడు మనోజ్. తర్వాత ఇదివరకు వచ్చిన ఒకతను లాటరీ గెలిచానని, కోట్లు వచ్చాయని, ట్యాక్స్ పోగా కోటి రూపాయలు మిగిలాయని అతను చెబుతాడు.
నేను నమ్మాను, గెలిచాను, మీరు మాత్రం అలాగే ఉండిపోయారు అని అతను అంటాడు. ఇప్పుడు కొనండి అని మనోజ్ అంటాడు. అప్పుడు నన్ను నమ్మి ఉంటే ఇప్పుడు 20 లక్షలు సేల్ చేసేవాన్ని, లక్ష టిప్పు ఇచ్చేవాన్ని, ఇప్పుడు పక్క షాపులో కొంటానని అతను అంటాడు. దాంతో అతన్ని తిట్టి పంపించేస్తాడు మనోజ్. అలా మనోజ్‌కు 21 లక్షలు నష్టం అవుతుంది.
మనోజ్‌కు బాంబే డీల్
ఇంతలో మనోజ్ పార్క్ ఫ్రెండ్ వస్తే జరిగింది చెబుతాడు. బాంబే డీల్ గురించి చెప్పి, నీ బిజినెస్ రాకెట్‌లో దూసుకుపోతుందని, వాళ్లతో తాను మాట్లాడతానని ఫ్రెండ్ చెబుతాడు. దానికి మనోజ్ సంతోషిస్తాడు. మరోవైపు రాత్రి బాలు వచ్చి ఇంట్లో అందరూ పడుకున్నారా అడుగుతాడు. తర్వాత మందు బాటిల్ తీసి దాని చరిత్ర గురించి చెబుతాడు బాలు.
మీరు మళ్లీ ఇలా చెడిపోతారని అనుకోలేదని మీనా అంటుంది. రేపు ఇది పగలు తాగుతాను, నిన్ను కొడతాను, నీ తమ్ముడు వస్తే వాన్ని కొడతాను, ఇదంతా ఆ ప్రిన్సిపాల్ ముందు జరుగుతుంది అని బాలు తన ప్లాన్ చెబుతాడు. మరుసటి రోజు ఉదయం ప్రిన్సిపాల్ ఎదుట బాగా తాగి మీనాను కొడుతున్నట్లు నటిస్తాడు. అదంతా ప్రిన్సిపాల్ చూస్తాడు.
ఆ శివ గాడిని పిలువు. నువ్వు నీ చెల్లి కలిసి అంటున్నారని నీ తమ్ముడి బ్యాగులో మందు బాటిల్ పెడితే.. వాడు తాగేసి నాకు తెలియదంటాడా, పైగా ప్రిన్సిపాల్ తీసుకున్నాడని చెబుతాడా అని బాలు అంటాడు. దాంతో శివ చెప్పింది నిజమని ప్రిన్సిపాల్ నమ్ముతాడు. ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. నా వల్ల ఇంత పొరపాటు జరిగిందా అని ప్రిన్సిపాల్ అంటాడు.
ప్రిన్సిపాల్ ముందు డ్రామా
నా తమ్ముడి బ్యాగులో మందు బాటిల్ పెడతావా. బాలుగా పాపిష్టోడా, శివ చేయి విరగ్గొట్టావ్, మూడు నెలలు హాస్పిటల్‌లో ఉన్నాడు, నా పుస్తెల తాడు కూడా అమ్మేశావ్ అంటూ బాలును మీనా తిడుతుంది. అదంతా విన్న ప్రిన్సిపాల్ బాలు సచ్చినోడు ఇంత చేశాడా అనుకుంటాడు. ఇంతలో శివ వచ్చి ఏంటిదంతా అని అడుగుతాడు. నీ బ్యాగులో పెట్టిన మందు బాటిల్ ఎక్కడరా అని బాలు అంటాడు.
ఏంటీ అది నువ్వు పెట్టావా అని శివ షాక్ అవుతాడు. ఇంతలో శివను పిలుస్తాడు ప్రిన్సిపాల్. తన తమ్ముడు ఏ తప్పు చేయలేదని మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. దాంతో ప్రిన్సిపాల్ కరిగిపోతాడు. నువ్వు రేపటి నుంచి కాలేజీకి వచ్చి బాగా చదువుకుని ఈ దరిద్రుడి నుంచి మీ అక్కకు విడాకులు ఇప్పించు అని ప్రిన్సిపాల్ చెబుతాడు. శివ, మీనా కృతజ్ఞతలు చెబుతారు.
ఇక నుంచి వాడి బాధ్యత మీరు తీసుకోవాలని మీనా అంటుంది. మీ ఆయనతో తాగుడు మానిపించే సెంటర్ గురించి చెబుతాను అని ప్రిన్సిపాల్ అంటాడు. మీ అందరిని కొట్టేస్తాను, కొరికేస్తాను అని బాలు అంటాడు. ఇంతలో పోలీసులు వస్తారు. అది చూసి బాలు, మీనా షాక్ అవుతారు. సీఐ గారు ఫోన్ చేసింది నేనే ప్రిన్సిపాల్ చెబుతాడు. ఈ ఒక్కసారికి వదిలేయండని మీనా అంటుంది.
బాలుపై గృహ హింస కేసు
పోలీస్ స్టేషన్‌లో వేసి గృహ హింస కేసు పెడతానని సీఐ అంటుంది. ప్రిన్సిపాల్ వెళ్లిపోతాడు. పద స్టేషన్‌కు వెళ్దాం పదా అని సీఐ అంటే.. అంతా తలకిందులు అయిందే అని బాలు అనుకుంటాడు. బాలు ప్లాన్ బెడిసి కొడుతుంది. పోలీసులు తీసుకెళ్లిపోతారు.
బాగా అయిందని శివ అంటాడు. ఇదంతా నీవల్లేరా అని కాలేజీలో తిరిగి చేర్పించేందుకు తాము వేసిన డ్రామా అని, తప్పు తనమీద వేసుకున్నారని మీనా చెబుతుంది. నిజమా అని శివ అంటాడు. అయ్యో ఇప్పుడు ఆయన్ను కొడతారో ఏమో అని మీనా భయపడుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












