Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో అంతా కంగారుపడుతుంటే రఘురాం పక్కింటి వాళ్లు తీసుకొస్తారు. మీ ఇల్లు అనుకుని మా ఇంటి డోర్ కొట్టారని, జాగ్రత్తగా చూసుకోండని చెప్పి వెళ్లిపోతారు పక్కింటివాళ్లు. తనకు రోడ్డు మీద జరిగింది గుర్తు చేసుకుని రోడ్డు మీదకు ఎందుకు వెళ్లాను అని ఆలోచిస్తాడు రఘురాం.
ఏదో ప్రమాదం పొంచి ఉంది

బయట ఏదో జరిగింది, గుర్తు చేసుకోండని జగదీశ్వరి అంటే.. గుర్తు రావట్లేదని రఘురాం చెబుతాడు. రఘురాంకు అంతా కోడలు, చెల్లి ప్రేమగా వడ్డిస్తారు. రఘురాం మూడు ముద్దలు తిని చేయి కడిగేస్తాడు. తినాలనిపించడం లేదని చెబుతాడు. రఘురాంను గదిలోకి తీసుకెళ్తుంది జగదీశ్వరి. నాకు టెన్షన్‌గా ఉంది. కానీ, కారణం గుర్తు రావట్లేదు. చాలా భయంగా ఉందని, ఎవరికో ఏదో ప్రమాదం పొంచి ఉందని భయం కలుగుతుందని రఘురాం అంటాడు.
ఎవ్వరికి ఏ సమస్య లేదు. మీరే అనవసరంగా భయపడుతున్నారు అని జగదీశ్వరి అంటుంది. నాకు ఎవరో ఏదో చెప్పారు, ఏదో గుర్తు వస్తుంది. మళ్లీ గుర్తు రావట్లేదు అని డాక్టర్ మాట్లాడింది గుర్తు చేసుకుంటాడు రఘురాం. రెస్ట్ తీసుకోమని చెప్పి చంద్రకళ వెళ్లిపోతుంది. మాయ ఏమైందని అడిగితే రఘురాం సమస్య గురించి చెబుతుంది. విరాట్‌కు ఏమైనా.. అని కాల్ చేసి చెప్పు అని మాయ అంటుంది.
అనవసరంగా టెన్షన్ పెట్టకు. నువ్వు కూడా బావకు కాల్ చేయకు అని చెప్పేసి వెళ్లిపోతుంది చంద్రకళ. జగదీశ్వరి ట్యాబ్లెట్స్ ఇస్తే రఘురాం వేసుకుంటాడు. పొద్దున్నే కదండి డాక్టర్ గారెని కలిశాం. అంతా బాగుందని చెప్పారు. నా వేలికి అయిన గాయమైన గుర్తుందా అని చూపిస్తుంది జగదీశ్వరి. అది చూసిన రఘరాం డాక్టర్ చెప్పింది గుర్తు చేసుకుంటాడు.
జగదీశ్వరికి లివర్ క్యాన్సర్
జగదీశ్వరికి లివర్ క్యాన్సర్ అని, కాపాడే స్టేజ్ కూడా దాటిపోయిందని డాక్టర్ చెప్పిందు గుర్తు చేసుకుంటాడు రఘురాం. రఘురాంను క్షేమంగా ఉండాలని అంటుంది జగదీశ్వరి. నేను కాదు నువ్వు బాగుండాలని రఘురాం అంటే.. నాకేంటంటి, నేను చాలా బాగున్నాను. సుమంగళిగానే పోతాను అని జగదీశ్వరి అంటుంది. అలా ఎందుకు అంటున్నావని రఘురాం అంటాడు.
{{/usCountry}}జగదీశ్వరికి లివర్ క్యాన్సర్ అని, కాపాడే స్టేజ్ కూడా దాటిపోయిందని డాక్టర్ చెప్పిందు గుర్తు చేసుకుంటాడు రఘురాం. రఘురాంను క్షేమంగా ఉండాలని అంటుంది జగదీశ్వరి. నేను కాదు నువ్వు బాగుండాలని రఘురాం అంటే.. నాకేంటంటి, నేను చాలా బాగున్నాను. సుమంగళిగానే పోతాను అని జగదీశ్వరి అంటుంది. అలా ఎందుకు అంటున్నావని రఘురాం అంటాడు.
{{/usCountry}}మీరెందుకు నాకేదో అయిపోయినట్లు మాట్లాడుతున్నారు. మన మనిమనవళ్లతో కూడా ఆడుకునేవరకు మనిద్దరం నిక్షేపంగా ఉంటామని జగదీశ్వరి అంటుంది. మరోవైపు జల్ రాజ్ కోసం చికెన్ వండి తీసుకొస్తుంది తల్లి. శ్రుతి సైలెంట్‌గా ఉందని చెబుతుంది. ఇంతలో శ్రుతి వస్తుంది. ఇద్దరం కలిసి తిందామని రాజ్ అంటే.. వద్దని శ్రుతి అంటుంది.
మీ సంగతి, చంద్రకళ సంగతి చెబుతాను అంటుంది శ్రుతి. ఇంతలో శ్రుతి పెట్టుకున్న ఫుడ్ ఆర్డర్ వస్తుంది. ఫ్యామిలీ ప్యాక్ బిర్యాని ఆర్డర్ చేసుకున్నా, డబ్బులు ఇచ్చేయ్ అని వెళ్లిపోతుంది శ్రుతి. నువ్వు వండింది దానికి సరిపోదు. అందుకే ఆర్డర్ పెట్టుకుంది. అది బాధపడే రకం కాదు బాధపెట్టే రకం అని జల్‌రాజ్ అంటాడు. మరోవైపు రాత్రి లేచి నాకు దేవుడు అన్యాయం చేస్తున్నాడు. నువ్వు ఎక్కువ కాలం బతకవు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు రఘురాం.
ఎలా గుర్తు పెట్టుకోవాలి
జగదీశ్వరిని ఎలా కాపాడాలి. ఈ విషయాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. దీనికి దారి వెతకాలి. జగదీశ్వరి బాగుండాలి, వందేళ్లు జీవించాలి అని బుక్‌లో రాస్తాడు రఘురాం. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ విషయం తెలిస్తే సంతోషం పోతుంది. ఎవరికి చెప్పలేను. ఎలా గుర్తు పెట్టుకోవాలి అని మదనపడతాడు రఘురాం. చేతి మీద రాసుకుంటే ప్రతి క్షణం గుర్తుంటుంది అని రాసుకుంటాడు.
ముందు డాక్టర్‌తో మాట్లాడి ఇంట్లోవాళ్లకు చెప్పాలి. ఈ విషయంపై నేను చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు రఘురాం. మరుసటి రోజు ఉదయం జగదీశ్వరి పూజ చేసి అందరికి హారతి ఇస్తుంది. విరాట్ పని గురించి మాట్లాడుకుంటారు. పురుషోత్తం కనిపించట్లేదట అని క్రాంతి చెబుతాడు. కనిపించనప్పుడు ఎందుకు. బావ గారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని శాలిని అంటుంది.
తర్వాత విరాట్ గురించి తల్లి సునందకు ఫోన్‌లో చెబుతుంది. పురుషోత్తం కోసం పిచ్చోడిలా తిరుగుతున్నాడట. కానీ, అది జరగదుగా మమ్మీ అని శాలిని సంతోషంగా అంటుంది. నీలిమతో మరో కొత్త నాటకం ఆడిస్తానని అదేంటో చెబుతుంది తల్లి సునంద. ఈ ప్లాన్ ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తానని శాలిని అంటుంది. ఆ మాటలు విన్న మాయ శాలినిని ఫాలో అవుతుంది.
మాయను కాపాడిన రాజ్
ఈవిడ ఏదో పెద్ద ప్లాన్ వేసింది, ఫాలో అవడం మంచిది అని అలాగే ఫాలో శాలినిని ఫాలో అవుతుంది మాయ. దారిలో ఒకడు మాయకు అడ్డుపడి ఏడిపిస్తుంటే.. జల్ రాజ్ వచ్చి వాడిని కొడతాడు. మాయను కాపాడుతాడు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.