నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 15 ఎపిసోడ్ లో తండ్రి ఒరిజినల్ రిపోర్ట్స్ ను డాక్టర్ కు చూపిస్తాడు విరాట్. ఈ రిపోర్ట్ ప్రకారం మీ నాన్న తలకు తగిలిన గాయం మామూలుది కాదు. దెబ్బ తగిలిన చోట నరాలు చిట్లిపోయాయి. అది యాక్సిడెంటల్ గా పడిపోవడం వల్ల తగిలిన దెబ్బ కాదు. ఎవరో తల మీద కొట్టి ఉంటారని డాక్టర్ చెప్తుంది. ఆ మాటలు విన్న శ్యామల ఇది కచ్చితంగా చంద్ర చేసిన పని అనుకుంటుంది.
చంద్ర షాక్

ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని విరాట్ డాక్టర్ ను రిక్వెస్ట్ చేస్తాడు. అందుకు డాక్టర్ ఒప్పుకొంటుంది. మెడిసిన్ పని చేయడం లేదు వేరేవి రాసిస్తానని డాక్టర్ అబద్ధం చెబుతుంది. ఇంటికి వెళ్లాక చంద్రకళతో మాట్లాడతాడు విరాట్. నాన్న పడిపోవడానికి ముందు ఇంకా ఎవరైనా గదిలోకి వెళ్లారా? అని అడుగుతాడు విరాట్. చూడలేదని చంద్ర చెబుతుంది. నాన్నను ఎవరో తల మీద బలంగా కొట్టారని చెెప్తాడు. చంద్ర షాక్ అవుతుంది.
శ్యామల ఫైర్
నన్ను అనుమానిస్తున్నావా బావ అని అడుగుతుంది చంద్రకళ. నేను అనుమానించడం లేదని విరాట్ అంటాడు. ఇంకెవరు చేసి ఉంటారని చంద్ర అడిగితే, నువ్వే అని శ్యామల మధ్యలోకి వస్తుంది. తండ్రిపై మమకారం కంటే భార్యపై ప్రేమ ఎక్కువైంది. అబ్బా ఏం మందు పెట్టావే చంద్ర. ఎవరు చేశారనే విషయంలో నాకు డౌట్ లేదని చంద్రను లాక్కెళ్లి హాల్లో పడేస్తుంది శ్యామల. అందరినీ పిలుస్తుంది.
విరాట్ ను కొట్టిన జగదీశ్వరి
చంద్ర ఇదంతా చేసింది. అన్నయ్యకు స్పృహ వచ్చినప్పుడు ఆయన తల మీద గట్టిగా కొట్టారు. ఈ చంద్రే అన్నయ్యను చంపాలని చూసిందని శ్యామల అంటుంది. క్రాంతి, శాలిని కలిసి చంద్ర అలా చేసి ఉండదని అంటారు. విరాట్ కు డాక్టర్ చెప్పడం నేను విన్నానని శ్యామల చెప్తుంది. విరాట్ అత్తయ్య చెప్పింది నిజమా? అని జగదీశ్వరి అడుగుతుంది. చంద్ర తప్పు చేయదు అత్త అని విరాట్ అనగానే జగదీశ్వరి చెంప మీద కొడుతుంది.
దోషి తేలాలి
నిజం దాచినందుకు కొట్టానని జగదీశ్వరి అంటుంది. చంద్ర నేరం చేయడం మీరు చూశారా? మీరే చేసి ఉండొచ్చు కదా. శ్రుతి లేదా శాలిని చేసి ఉండొచ్చు కదా. ఎవరు ఎవరిని వెనకేసుకు రావడం లేదు. దోషి తేలిన రోజు మూల్యం చెల్లించాల్సిందేనని విరాట్ అంటాడు. అన్నయ్య మాట్లాడితే తన తప్పు బయటపడుతుందని చంద్రనే చేసిందని శ్యామల మళ్లీ అంటుంది.
జగదీశ్వరి వార్నింగ్
{{/usCountry}}నిజం దాచినందుకు కొట్టానని జగదీశ్వరి అంటుంది. చంద్ర నేరం చేయడం మీరు చూశారా? మీరే చేసి ఉండొచ్చు కదా. శ్రుతి లేదా శాలిని చేసి ఉండొచ్చు కదా. ఎవరు ఎవరిని వెనకేసుకు రావడం లేదు. దోషి తేలిన రోజు మూల్యం చెల్లించాల్సిందేనని విరాట్ అంటాడు. అన్నయ్య మాట్లాడితే తన తప్పు బయటపడుతుందని చంద్రనే చేసిందని శ్యామల మళ్లీ అంటుంది.
జగదీశ్వరి వార్నింగ్
{{/usCountry}}చంద్రను బయటకు గెంటేయాల్సిందేనని శ్రుతి, శ్యామల అంటారు. చంద్ర చంపాలనుకుంటే చలనం రాకముందే చేయొచ్చు కదా అని శాలిని అడుగుతుంది. నా భర్తను చంపాలని చూసినవాళ్లను తల, మొండెం వేరు చేసి గుమ్మానికి వేలాడదీస్తా. నిజం తెలిసే వరకు ఎవరూ బయటకు వెళ్లడానికి వీల్లేదని జగదీశ్వరి వార్నింగ్ ఇస్తుంది.
నాకెందుకో ఆ పని చేసింది చంద్ర కాదు నువ్వే అని నా డౌట్ అని శ్రుతితో కామాక్షి అంటుంది. తగిలిన చోట మళ్లీ తగిలితే గతం గుర్తొస్తుందని నా మీద ప్రయోగం కూడా చేశావు కదా అని కామాక్షి చెప్తుంది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే చంద్ర చేసిందని అనిపించడం లేదని కామాక్షి అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.