నిన్ను కోరి సీరియల్ లో ఈ రోజు అంటే అక్టోబర్ 20 ఎపిసోడ్ లో శాలిని ప్రెగ్నెన్సీ న్యూస్ తో ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు. చంద్రకళ చెప్పినా వినకుండా విరాట్ కోపంగా ఇంటికి వస్తాడు. క్రాంతి వెళ్లి విరాట్ ను హగ్ చేసుకుంటాడు. నువ్వు పెద్దనాన్నవి, వదిన నువ్వు పెద్దమ్మవి కాబోతున్నావని క్రాంతి చెప్తాడు. ఈ శుభవార్త వల్ల ఇంట్లో వాతావరణమే మారిపోయిందని జగదీశ్వరి అంటుంది.
విరాట్ తో మాట్లాడిన తల్లి

ఈ వార్త విన్నాక ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఇంటికి దూరమైనా సంతోషాన్ని శాలిని కడుపులో పడ్డ బిడ్డ తీసుకొచ్చిందని విరాట్ తో జగదీశ్వరి అంటుంది. అవును వదినా విరాట్ తో మాట్లాడట్లేదనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావని శ్యామల అంటుంది. కొడుకు మీద తల్లి ఎన్నాళ్లని కోపంగా ఉంటుంది? తల్లిగా వాడి బాధను తగ్గించకుండా పంతంతో నేనే ఇంకా పెంచుతున్నానని జగదీశ్వరి ఎమోషనల్ అవుతుంది. విరాట్ కూడా ఏడ్చేస్తాడు.
ప్రెగ్నెంట్ కావాలేమో
వీడి కాపురం కూడా చక్కబడితే నా సగం దిగులు తీరిపోతుందని జగదీశ్వరి అంటుంది. అమ్మను ఆనందంతో హత్తుకుంటాడు విరాట్. నువ్వు శాలినికి కంగ్రాట్స్ చెప్పవా అని విరాట్ ను శ్రుతి అడుగుతుంది. కంగ్రాట్స్ శాలిని అని చెప్పేసి విరాట్ వెళ్లిపోతాడు. నన్ను కూడా జాగ్రత్తగా చూడాలంటే నేను కూడా ప్రెగ్నెంట్ కావాలేమోనని శ్రుతి అనగానే కామాక్షి షాక్ అవుతుంది.
శివుణ్ని కాదు
నీ మౌనం వల్ల ఇల్లంతా సంతోషంగా నిండిపోయిందని గదిలోని విరాట్ దగ్గరకు వెళ్లి అంటుంది చంద్రకళ. కానీ నేను సంతోషంగా లేను చంద్ర. నా తండ్రిని చంపాలని చూసిన మనిషికి ఈ ఇంట్లో పట్టం కట్టడం భరించలేకపోతున్నా. నేరాన్ని దాచి నేను నేరం చేస్తున్నా చంద్ర. ఈ విషాన్ని గొంతులో దాచడానికి నేను శివుణ్ని కాదు మామూలు మనిషిని. నీ అంత మంచి మనసు శాలినిక ఎందుకు లేదని విరాట్ అంటాడు.
నిజం తెలియకుండా
పుట్టుకతోనే ఎవరూ చెడ్డవాళ్లు కాదు బావ. మారడానికి ఒక్క సంఘటన చాలు. శాలిని మంచిగా మారడానికి ఒక్క సంఘటన చాలు అదే ప్రెగ్నెన్సీ అని చంద్ర అంటుంది. మార్పు వస్తే మంచిదే కానీ ఇంకా దారుణాలు చేస్తే ఊరుకోనని విరాట్ అంటాడు. చంద్రను బాధపెట్టినందుకు సారీ చెప్తాడు విరాట్. ఆ నిజం అత్తయ్యకు తెలియనివ్వకూడదని బావకు చెప్తుంది చంద్ర.
{{/usCountry}}పుట్టుకతోనే ఎవరూ చెడ్డవాళ్లు కాదు బావ. మారడానికి ఒక్క సంఘటన చాలు. శాలిని మంచిగా మారడానికి ఒక్క సంఘటన చాలు అదే ప్రెగ్నెన్సీ అని చంద్ర అంటుంది. మార్పు వస్తే మంచిదే కానీ ఇంకా దారుణాలు చేస్తే ఊరుకోనని విరాట్ అంటాడు. చంద్రను బాధపెట్టినందుకు సారీ చెప్తాడు విరాట్. ఆ నిజం అత్తయ్యకు తెలియనివ్వకూడదని బావకు చెప్తుంది చంద్ర.
{{/usCountry}}ఈ పూజ నేనే వంట చేస్తానని జగదీశ్వరి చకచకా వండేస్తుంది. మరోవైపు ఈ రోజుతో నాకు ఇంట్లో నూకలు చెల్లిపోయాయని అనిపించింది. కానీ డాక్టర్ వచ్చి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో బతికిపోయానని శాలిని అనుకుంటుంది. క్రాంతి వచ్చి బెడ్ మీద నుంచి కాలు కిందపెట్టడానికి వీల్లేదని అంటాడు. భార్యపై ప్రేమ కురిపిస్తాడు. కానీ ముందు నువ్వు, బావ కలిసి భోజనం చేయండని శాలిని డ్రామా ఆడటంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.