నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 27 ఎపిసోడ్ లో గుడిలో స్వామిజీని కలుస్తుంది చంద్రకళ. ఆ స్వామిజీ చంద్ర తలరాతను చదువుతాడు. నీ ఇంటి పెద్ద దిక్కు కోలుకుంటే తప్ప నీ జీవితం నిలబడేలా లేదు అవునా? నీ జీవితంలో జరిగిందంతా ఆ లయకారుడు కళ్లకు కట్టినట్లు చూపించాడని స్వామిజీ అనడంతో చంద్ర షాక్ అవుతుంది.
స్వామిజీ పరిష్కారం

కర్మ ఫలం ప్రకారమే జీవితం ముందుకు సాగుతుంది. నీ సమస్య తీరే దారి చూపించడానికే నిన్ను ఆ స్వామి నా దగ్గరకు రప్పించాడని స్వామిజీ అంటాడు. ఏం చేయాలో చెప్పమని చంద్రకళ అడుగుతుంది. కఠోర దీక్ష చేయాలి. శివుణ్ని సేవించాలి. మహా శివుడికి అభిషేకం చేయాలి. పొర్లు దండాలు పెట్టాలి. ఆ క్రతువు ఆటంకం లేకుండా పూర్తి చేయాలి. మధ్యలో ఆగిపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు సిద్ధమేనా అని స్వామిజీ అడుగుతాడు. దేనికైనా సిద్ధమే అని చంద్రకళ అంటుంది. ఉదయం గుడికి రమ్మంటాడు స్వామిజీ.
జగదీశ్వరి కన్నీళ్లు
రాత్రి చంద్ర కోసం ఎదురు చూస్తుంటాడు విరాట్. విరాట్, చంద్ర డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంటే క్రాంతి చేయి కడిగేస్తాడు. కడుపుతో ఉన్న భార్యతో కన్నీళ్లు పెట్టించిన మనిషి ఎదురుగా ప్రశాంతంగా భోజనం చేయలేను. నన్ను క్షమించు అమ్మ. నా బాధను ఆపుకోలేక అలా చేశానని క్రాంతి వెళ్లిపోతాడు. విరాట్ కూడా తినకుండా వెళ్లిపోతాడు. జగదీశ్వరి కూడా తినకుండా చేయి కడిగేస్తుంది. శాలిని, శ్యామల కూడా తినరు. ఏడుస్తున్న జగదీశ్వరిని శ్యామల ఓదార్చుతుంది.
ద్వేషం పెంచుకున్నారని
చిన్నప్పుడు వాళ్లు ఒకే కంచంలో తినేవాళ్లు. పెద్దయిన తర్వాత కూడా ఒకరికొకరు అర్థం చేసుకుని నడుచుకున్నారు. కానీ ఇప్పుడు ద్వేషం పెంచుకుంటున్నారు. ఎవరి పంతం మీద వాళ్లు ఉంటే ఏమని చెప్తాను. నేను ఆయన్ని చూసి ఏడవాలా?వీళ్లను చూసి ఏడవాలా? అని జగదీశ్వరి బాధ పడుతుంది. బంధాలు, అనుబంధాలు బీటలు వారుతున్నాయి. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలాంటి బాధను అనుభవించాల్సి వస్తుందని జగదీశ్వరి ఎమోషనల్ అవుతుంది.
విశ్వరూపం
{{/usCountry}}చిన్నప్పుడు వాళ్లు ఒకే కంచంలో తినేవాళ్లు. పెద్దయిన తర్వాత కూడా ఒకరికొకరు అర్థం చేసుకుని నడుచుకున్నారు. కానీ ఇప్పుడు ద్వేషం పెంచుకుంటున్నారు. ఎవరి పంతం మీద వాళ్లు ఉంటే ఏమని చెప్తాను. నేను ఆయన్ని చూసి ఏడవాలా?వీళ్లను చూసి ఏడవాలా? అని జగదీశ్వరి బాధ పడుతుంది. బంధాలు, అనుబంధాలు బీటలు వారుతున్నాయి. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలాంటి బాధను అనుభవించాల్సి వస్తుందని జగదీశ్వరి ఎమోషనల్ అవుతుంది.
విశ్వరూపం
{{/usCountry}}ఇంట్లో జరుగుతున్న అన్నింటికీ కారణం చంద్రకళనే అని శ్యామల నిందిస్తుంది. ఈ కుటుంబాన్ని ముక్కలు చేయమని మీ వాళ్లు ఇక్కడికి పంపించారా? అందరి జీవితాలు బలి తీసుకుంటేనే కానీ నీ పగ తీరదా? నీ పగ కోసం ఓ తల్లిని తీవ్రమైన మనస్తాపానికి గురి చేస్తున్నావు. నీ బుద్ధి నాకు బాగా తెలుసు. విరాట్ ను మాయలో వేసుకున్నావు. విరాట్ కూడా ఇల్లు దాటితే నా విశ్వరూపం ఏంటో చూస్తావని వార్నింగ్ ఇస్తుంది శ్యామల.
తప్పు చేసింది శాలిని
మీ అన్నయ్య నీకు అంత కానివాడు అయిపోయాడా? అని క్రాంతిని అడుగుతుంది చంద్ర. అతను నీచంగా చూస్తున్నాడు. నా భార్యను మోసగత్తె, హంతకురాలు అని నిందిస్తే ఎలా వదిన అని అడుగుతాడు క్రాంతి. మీ అన్నయ్య ప్రవర్తనకు కారణం నీకు ఇప్పుడు అర్థం కాదు. త్వరలోనే అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయని చంద్ర అంటుంది.
శాలిని తప్పు చేసింది క్రాంతి. అదే నిజం. పరిస్థితులు చేజారిపోయి ఇంట్లోవాళ్లకు మనశ్శాంతి లేకుండా పోతుంది. మామయ్యను కొట్టింది శాలిని అని చంద్ర చెప్పడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.