...
...
Next Story

Ninnu Kori September 11 Episode: నిన్ను కోరి- సామ్రాట్‌గా మారిన విరాట్- గతం మర్చిపోయిన విరాట్- చంద్రకు డాక్టర్ వార్నింగ్

Ninnu Kori Serial September 11th Episode: నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 11వ ఎపిసోడ్‌‌లో హాస్పిటల్ ఐసీయూలో విరాట్ బ్యాండేజ్ తీయగానే సామ్రాట్ రూపం ప్రత్యక్షమవుతుంది. శస్త్రచికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడినా, జ్ఞాపకశక్తి కోల్పోయి భార్య చంద్రకళను ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తాడు. దాంతో చంద్ర షాక్ అవుతుంది.

Published on: Sep 11, 2026, 08:46:20 IST
Advertisement

Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ బయట చంద్రకళ తీవ్ర ఆందోళనతో దేవుడిని ప్రార్థిస్తుండగా, మదన్ ఆమెకు తోడుగా నిలబడతాడు. సుదీర్ఘ శస్త్రచికిత్స అనంతరం డాక్టర్లు బయటకు వచ్చి ఆపరేషన్ విజయవంతమైందని ప్రకటిస్తారు.

విరాట్ ముఖం మారిపోతుందనే భయం

నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 11 ఎపిసోడ్
నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 11 ఎపిసోడ్

ఆ వార్తతో చంద్రకళ తెగ సంబరపడిపోతుంది. అయితే, ప్లాస్టిక్ సర్జరీ వల్ల విరాట్ ముఖ రూపం మారిపోతుందనే భయం ఆమెను వెంటాడుతుంది. అతని రూపం మారినా, స్పృహలోకి వచ్చాక తనను ఆప్యాయంగా "చంద్ర" అని పిలిస్తే ఆ పిలుపే తనకు కొండంత ఊరటనిస్తుందని భావిస్తుంది.

నా ప్రేమకు చావు లేదు

మరోవైపు మదన్ ఫోన్‌లో విరాట్‌లా నటిస్తూ రఘురామ్‌తో మాట్లాడతాడు. విరాట్ ఎక్కడ బతికాడో అనే ఆందోళనతో శాలిని తీవ్ర టెన్షన్‌కు గురవుతుంది. విరాట్‌తో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటుంది చంద్రకళ. "నా ప్రేమ అనంతం, దానికి చావు లేదు... నీ కోసం ఇంకో రూపంలో తిరిగి వస్తాను" అని విరాట్ గతంలో అన్న మాటలు ఆమె మనసులో మెదులుతాయి.

విరాట్ కాదు సామ్రాట్

ఐసీయూలోకి మార్చిన తర్వాత డాక్టర్లు విరాట్ ముఖానికి ఉన్న బ్యాండేజ్‌లను తొలగిస్తారు. బ్యాండేజ్ విప్పాక అక్కడ ఉన్నది విరాట్ ముఖం కాదు.. సామ్రాట్ రూపం. విరాట్ రూపం మారినా తన భర్త ప్రాణాలతో ఉన్నాడనే సంతోషంతో చంద్రకళ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

ఎవరు నువ్వ.. చంద్రకళకు షాక్

కానీ, విరాట్ కళ్లు తెరిచి తీవ్ర అయోమయంతో చంద్రకళ వైపు చూస్తాడు. బావ అంటూ చంద్రకళ ఆప్యాయంగా దగ్గరికి వెళ్తుంటే "ఎవరు నువ్వు?" అని ప్రశ్నిస్తాడు విరాట్. ప్రాణాలతో ఎదురుగా ఉన్న భర్త తనను గుర్తుపట్టకపోవడంతో చంద్రకళ తీవ్ర మనోవేదనతో అక్కడే కూలిపోతుంది.

వైద్యుల సూచనలు – చంద్రకళ నిర్ణయం

ఇప్పుడు అతనిపై ఒత్తిడి తెచ్చి పాత విషయాలు గుర్తుచేస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని, పాత ఫోటోల్లో ఉన్న ముఖానికి, ఇప్పటి అతని ముఖానికి తేడా ఉండటం వల్ల అతనికి మరింత గందరగోళం, మానసిక అలజడి ఏర్పడుతుందని చంద్రకళకు డాక్టర్ వార్నింగ్ ఇస్తాడు.

చంద్రకళను ఓదార్చిన మదన్

కొన్ని రోజుల పాటు అతనిని ఒక "వైట్ పేపర్" (తెల్ల కాగితం)లా భావించి, చాలా సెన్సిటివ్‌గా హ్యాండిల్ చేస్తూ చిన్న చిన్న విషయాలతో నెమ్మదిగా గత జ్ఞాపకాలను గుర్తుచేయాలని చంద్రకళకు డాక్టర్ చెబుతాడు. దీంతో మదన్ చంద్రకళను ఓదారుస్తూ గుండె రాయి చేసుకోవాలని, అతనికి ఇప్పుడు నువ్వు తప్ప మరెవరూ లేరని ధైర్యం చెప్తాడు.

కంటికిరెప్పలా చూసుకోవాలని

దాంతో చంద్ర కన్నీళ్లు తుడుచుకుని, విరాట్‌ను ఒక చిన్న పసిపాపలా కంటికి రెప్పలా చూసుకోవాలని నిశ్చయించుకుంటుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks