...
...
Next Story

Ninnu Kori Today Episode: నిన్ను కోరి.. చంద్ర టెన్షన్- ఎంగేజ్మెంట్ ఆపేందుకు కామాక్షి, శృతి ప్లాన్- స్వీట్ లో మత్తు మందు

Ninnu Kori Today Episode: నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 2 ఎపిసోడ్ లో మదన్ తో ఎంగేజ్మెంట్ కు చంద్రకళ రెడీ అవుతుంది. అయితే ఈ నిశ్చితార్థం ఆపేందుకు కామాక్షి, శృతి కలిసి ప్లాన్ ల మీద ప్లాన్ లు వేస్తారు. మరోవైపు మదన్ ను చంపేస్తానని విరాట్ కోపంతో ఊగిపోతాడు.

Published on: Sep 2, 2026, 09:07:02 IST
Advertisement

Ninnu Kori Today Episode: నిన్ను కోరి సీరియల్‌లో చంద్రకళ, మదన్ నిశ్చితార్థపు ఎపిసోడ్స్ మరింత మలుపులతో, రకరకాల ప్లాన్‌లతో ఆసక్తికరంగా సాగుతున్నాయి. మరి నిన్ను కోరి టుడే సెప్టెంబర్ 2 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం.

చంద్రకళ టెన్షన్

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

మదన్ తో ఎంగేజ్మెంట్ కోసం చంద్రకళ రెడీ అవుతుంటుంది. చంద్ర అద్దం ముందు కూర్చుంటుంది. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా, లోపల మాత్రం విపరీతమైన టెన్షన్‌తో ఉంటుంది. "శృతి, కామాక్షి అత్తయ్య వాళ్ల ప్లాన్‌లో సక్సెస్ అవుతారా? ఆ మదన్‌ని కరెక్ట్ టైమ్‌కి ఆపుతారా లేదా?" అని చంద్ర తీవ్రంగా కంగారు పడుతుంటుంది.

కామాక్షి, శృతి ప్లాన్స్

చంద్రకళ, మదన్ ఎంగేజ్మెంట్ ఆపేందుకు కామాక్షి, ఆమె కూతురు శృతి కలిసి ప్లాన్స్ వేస్తారు.

* మొదటి ప్లాన్: మదన్ తాగే జ్యూస్‌లో శృతి మత్తు మందు కలుపుతుంది. కానీ ఆ గ్లాస్ మదన్‌కి ఇద్దామని వెళ్తుండగా, అటుగా వచ్చిన మాయ ఆ గ్లాస్ తీసుకుని వేరే గెస్ట్‌కి ఇచ్చేస్తుంది. దాంతో కామాక్షి వాళ్ళ ఫస్ట్ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది.

* రెండవ ప్లాన్: ఎంగేజ్‌మెంట్ ఉంగరం దాచేద్దామని శృతి వెళితే, మందర ఆ రింగ్ బాక్స్‌ని ఒక బ్యాంక్ లాకర్‌ని పట్టుకుంటున్నట్లు గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది. ఉంగరం దొంగిలించే ఛాన్స్ లేక శృతి వెనక్కి వస్తుంది.

* మూడవ ప్లాన్: ఎలాగైనా మదన్‌ని ఆసుపత్రి పాలు చేయాలని కామాక్షి కార్పెట్ కింద మార్బుల్స్ వేస్తుంది. కానీ మదన్ రాకుండా, మందర ఆ మెట్లు దిగుతూ జారిపడుతుంది. సరిగ్గా అదే సమయంలో మాయ వెంటనే మందరను పట్టుకుని రక్షిస్తుంది. ఈ ప్లాన్ కూడా పూర్తిగా ఫ్లాప్ అవుతుంది.

విరాట్ కోపం

మరోవైపు తన భార్యతోనే ఎంగేజ్మెంట్ కు రెడీ అయిన మదన్ ను చంపేయాలని విరాట్ కోపంతో ఊగిపోతుంటాడు. విరాట్ చూపులకి భయం వేసి మదన్ పక్కకి వెళ్తుంటే, విరాట్ ఏమో అటాక్ చేద్దామని ఫాలో అవుతాడు. అది గమనించిన క్రాంతి.. వెంటనే విరాట్ దగ్గరికి వెళ్లి అతన్ని కన్విన్స్ చేసి అక్కడినుంచి లాక్కెళ్లిపోతాడు.

రెచ్చగొట్టేలా రఘురామ్

విరాట్ ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్లిపోయి.. "ఇక నా వల్ల కాదు నాన్నా, మాయని పంపడం కాదు, వాడిని ఇప్పుడే చంపేస్తా" అని కోపంగా వెళ్లిపోబోతుంటే... రఘురామ్ కంగారుగా "వద్దురా బాబు, ఆగు" అని బతిమాలుతుంటాడు.

స్వీట్ లో మందు

ఎంగేజ్మెంట్ ముహూర్తం దగ్గరపడుతుంటుంది. మాయ, మందరలు మదన్‌ని తీసుకురావడానికి వెళ్లే గ్యాప్‌లో.. కామాక్షి, శృతి తెలివిగా మదన్ రూమ్‌లోకి దూరుతారు.

"మా తరపున పెళ్ళికొడుక్కి స్వీట్ బాబు" అని బలవంతంగా మత్తుమందు కలిపిన స్వీట్ అతని నోట్లో కుక్కుతారు. దాంతో మదన్ నెమ్మదిగా కళ్లు తిరిగి కింద పడిపోతాడు.

మరి ఈసారైనా కామాక్షి, శృతుల ప్లాన్ వర్కౌట్ అయ్యి మదన్ నిశ్చితార్థానికి రాకుండా ఆగుతాడా? లేదా? అనేది నిన్ను కోరి సీరియల్ తదుపరి ఎపిసోడ్‌లో చూడాలి!

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe