Ninnu Kori September 9 Episode: నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 9 ఎపిసోడ్ లో స్టోరీని మలుపు తిప్పే ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. హాస్పిటల్‌లో చావుబతుకుల మధ్య పోరాడుతున్న విరాట్ ను చూసి మదన్, చంద్రకళ బాధపడతారు. అప్పుడే మదన్ కు ఓ సంచలన ఐడియా వస్తుంది. విరాట్ ను ఎలాగైనా కాపాడాలని అనుకుంటాడు.
అనాథ శవం

హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్న విరాట్ ను కాపాడేందుకు మదన్ తెగ ఆలోచిస్తుంటాడు. అప్పుడే ఓ ఆలోచన వస్తుంది. వారం రోజులుగా మార్చురీలో ఓ గుర్తింపు లేని అనాథ శవం ఉందని మదన్ కు తెలుస్తుంది. ఆ శవాన్ని మున్సిపాలిటీకి అప్పగించి, దహనం చేయించబోతున్నారని కూడా సమాచారం అందుతుంది.
మదన్ ఎంక్వైరీ
అనాథ శవం గురించి తెలుసుకున్న వెంటనే మదన్ వెళ్లి డాక్టర్లను కలుస్తాడు. ప్లాస్టిక్ సర్జరీతో ఆ అనాథ శవం ముఖాన్ని విరాట్ శరీరానికి పెట్టొచ్చా అని డాక్టర్లను మదన్ అడుగుతాడు. ఫస్ట్ షాకైన డాక్టర్లు, ఆ తర్వాత అసలు విషయం చెప్తాడు. మెడికల్ సైన్స్ పరంగా, టెక్నికల్ గా చూసుకుంటే ఫేస్ స్వాప్ సాధ్యమే అని చెప్తారు. కానీ అందుకు భార్య పర్మిషన్ కచ్చితంగా ఉండాలంటారు.
కన్నీళ్లతో చంద్ర నిర్ణయం
విరాట్ కు ప్లాస్టిక్ సర్జరీ, ఫేస్ స్వాప్ గురించి చంద్రకు మదన్ చెప్తాడు. ఇది విని చంద్ర భయపడుతుంది. కానీ.. "ఏ రూపంలో ఉన్నా విరాట్ బతికి ఉండడమే ముఖ్యం" అని మదన్ ధైర్యం చెప్తాడు.
అదే సమయంలో ఇంటి నుంచి జగదీశ్వరి ఫోన్ చేసి విరాట్ గురించి అడుగుతుంది. చంద్రకళ ఏమో తన బాధను దాచుకుని అబద్ధం చెప్తుంది. "మాయ దొరికాకే విరాట్ ఇంటికి వస్తానన్నాడు" అని జడదీశ్వరికి చంద్ర అబద్ధం చెబుతుంది. ఇంట్లోని పరిస్థితులు, భర్తను ఎలాగైనా కాపాడుకోవాలనే తపనతో చంద్ర ప్లాస్టిక్ సర్జరీకి అంగీకరిస్తుంది.
సీక్రెట్ సర్జరీ
{{/usCountry}}అదే సమయంలో ఇంటి నుంచి జగదీశ్వరి ఫోన్ చేసి విరాట్ గురించి అడుగుతుంది. చంద్రకళ ఏమో తన బాధను దాచుకుని అబద్ధం చెప్తుంది. "మాయ దొరికాకే విరాట్ ఇంటికి వస్తానన్నాడు" అని జడదీశ్వరికి చంద్ర అబద్ధం చెబుతుంది. ఇంట్లోని పరిస్థితులు, భర్తను ఎలాగైనా కాపాడుకోవాలనే తపనతో చంద్ర ప్లాస్టిక్ సర్జరీకి అంగీకరిస్తుంది.
సీక్రెట్ సర్జరీ
{{/usCountry}}ప్లాస్టిక్ సర్జరీకి చంద్ర ఓకే చెప్పడంతో మదన్ వెళ్లి డాక్టర్లను కలుస్తాడు. సర్జరీ కోసం డాక్టర్లను రిక్వెస్ట్ చేస్తాడు. విరాట్-చంద్రల బంధం గురించి, వాళ్ల మధ్య ఉన్న ప్రేమ గురించి చెప్పి డాక్టర్లను ఒప్పిస్తాడు. అయితే ఎలాంటి హాస్పిటల్ రికార్డులు లేకుండా, రహస్యంగా సర్జరీ చేయడానికి డాక్టర్లు ఒప్పుకుంటారు.
సీనియర్ సర్జన్ ఫీజులకు ఎక్కువ ఖర్చవుతుందని డాక్టర్లు చెప్తారు. అయినా మదన్ వెనకాడడు. మున్సిపాలిటీ సిబ్బందికి డబ్బులు లంచంగా ఇచ్చి, సర్జరీ సమయం వరకు ఆ శవాన్ని మార్చురీలోనే భద్రపరిచేలా ఏర్పాట్లు చేస్తాడు. ఇలా విరాట్ ఫేస్ మార్చే సర్జరీ కోసం మదన్ అన్ని రకలుగా సపోర్ట్ చేస్తాడు.
సైకో శాలిని
చంద్ర ఇంటికి రాగానే విరాట్ ఎక్కడ అని అందరూ అడుగుతారు. అయితే మాయను వెతుక్కుంటూ విరాట్ వెళ్లాడని అబద్ధం చెప్పి అందరినీ చంద్ర నమ్మిస్తుంది. మరోవైపు విరాట్ కు యాక్సిడెంట్ చేయించిన శాలిని సైకో ఆనందం పొందుతుంది. విరాట్ ఛాప్టర్ క్లోజ్ అని రాక్షసానందంతో నవ్వుతుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.