Alias Rukmini: వరుస బాక్సాఫీస్ ఫలితాలతో ఇబ్బంది పడుతున్న యంగ్ హీరో నితిన్, తన తదుపరి చిత్రం 'అలియాస్ రుక్మిణి' (Alias Rukmini) తో బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తుండటంతో మొదటి నుంచి దీనిపై ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
అలియాస్ రుక్మిణి రిలీజ్ డేట్

బాక్సాఫీస్ వద్ద గట్టి విజయం కోసం చూస్తున్న నితిన్.. ఈ సారి ఒక వినూత్నమైన కాన్సెప్ట్ డ్రామాతో ముందుకు వస్తున్నారు. 'అలియాస్ రుక్మిణి' చిత్రాన్ని డిసెంబర్ 4, 2026న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారిక పోస్టర్ ద్వారా ఇవాళ (అక్టోబర్ 9) అనౌన్స్ చేశారు.
పోస్టర్ వైరల్
ఇవాళ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ అలియాస్ రుక్మిణి సినిమా విడుదల తేదీ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో నితిన్ సగటు మధ్యతరగతి యువకుడిలా కనిపించి ఆకట్టుకున్నారు. సాధారణంగా గ్లామరస్ లేదా కమర్షియల్ మాస్ పాత్రలు చేసే నితిన్.. ఇందులో పక్కింటి అబ్బాయిలా కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది.
ప్రొడ్యూసర్ నాని
అలియాస్ రుక్మిణి ప్రాజెక్ట్‌కి ప్రధాన ఆకర్షణ నేచురల్ స్టార్ నాని. నటుడిగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కంటెంట్-డ్రివెన్ సినిమాలను ప్రోత్సహించే నాని, ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. మురళీకాంత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని దీప్తి గంటాతో కలిసి నాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రుక్మిణి ఎవరు?
అయితే, ఈ సినిమాలో టైటిల్ రోల్ అయిన 'రుక్మిణి' పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని చిత్రబృందం అత్యంత రహస్యంగా ఉంచింది. అయితే అక్టోబర్ 13న రుక్మిణి ఎవరో రిలీజ్ చేస్తామని తాజాగా ప్రకటించారు.
విజయ్ బుల్గానిన్ అందిస్తున్న సంగీతం ఈ సినిమా ప్రమోషన్లలో కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోందని, త్వరలోనే వరుస ప్రమోషనల్ అప్డేట్స్ ఇస్తామని మేకర్స్ వెల్లడించారు.
రాత మారేనా?
{{/usCountry}}విజయ్ బుల్గానిన్ అందిస్తున్న సంగీతం ఈ సినిమా ప్రమోషన్లలో కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోందని, త్వరలోనే వరుస ప్రమోషనల్ అప్డేట్స్ ఇస్తామని మేకర్స్ వెల్లడించారు.
రాత మారేనా?
{{/usCountry}}ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద సరైన బ్రేక్ లేక ఇబ్బంది పడుతున్న నితిన్‌కు 'అలియాస్ రుక్మిణి' ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్ కానుంది. నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారంటే ఆ కథలో కంటెంట్, ఇమోషన్స్ బలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు ప్రాథమికంగానే అంచనా వేస్తాయి.
నాని బ్యానర్‌లో వచ్చిన 'హిట్' ఫ్రాంచైజ్, 'కోర్ట్' వంటి సినిమాలు ప్రొడక్షన్ వాల్యూస్, కథా బలంతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. నితిన్ మార్కెట్‌కు నాని జడ్జిమెంట్ తోడవ్వడం ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌కి విపరీతంగా ప్లస్ కానుంది.
రూట్ మార్చిన నితిన్
నితిన్ కెరీర్‌లో 'ఇష్క్', 'అ ఆ', 'భీష్మ' వంటి పెద్ద హిట్లు ఆయన్ను లవర్ బాయ్ లేదా పక్కింటి అబ్బాయి పాత్రల్లో చూసినప్పుడే వచ్చాయి. లార్జర్ దాన్ లైఫ్ మాస్ పాత్రల కంటే ఈ 'మిడిల్ క్లాస్ రుక్మిణి' కాన్సెప్ట్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు వేగంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
4 సినిమాలు
అయితే బాక్సాఫీస్ దగ్గర అలియాస్ రుక్మిణికి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అదే డిసెంబర్ 4న నాగ చైతన్య ‘వృషకర్మ’, విష్వక్ సేన్ ‘లెగసీ’, ‘దుల్కర్ సల్మాన్ ‘శ్రీశ్రీ’ రిలీజ్ కాబోతున్నాయి. అంటే ఒకే రోజు నాలుగు సినిమాలు రాబోతున్నాయన్నమాట. మరి వీటిలో చివరకు ఏవి అదే రోజున ఆడియన్స్ ముందుకు వస్తాయో వేచి చూడాల్సిందే.