Alias Rukmini NIthiin: టైమ్ మెషిన్ లో వెళ్లొచ్చారా మాస్టారు? నితిన్ లుక్ చూసి షాక్ అయిన అలియాస్ రుక్మిణి హీరోయిన్!
Alias Rukmini NIthiin: అలియాస్ రుక్మిణి సినిమా నుంచి హీరో నితిన్ క్యారెక్టర్ అయిన కృష్ణ యంగర్ లుక్ ను ఇవాళ పరిచయం చేశారు. పూర్తిగా గడ్డం తీసేసి కేవలం మీసాతో యువకుడిలా నితిన్ మారిపోయారు. ఆ లుక్ తో హీరోయిన్ ఆఫియాకు సర్ ప్రైజ్ చేశారు. నితిన్ ను అలా చూడగానే హీరోయిన్ షాక్ అయింది.
Alias Rukmini NIthiin: హీరో నితిన్ (Nithiin) ఎప్పుడూ తనదైన స్టైల్, ఎనర్జిటిక్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్.. ఈసారి నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ లో ఒక విభిన్నమైన కథతో మన ముందుకు రాబోతున్నారు. నాని సొంత బ్యానర్ 'యునానిమస్ ప్రొడక్షన్స్' లో నితిన్ హీరోగా దర్శకుడు మురళీ కాంత్ దేవాసోత్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'అలియాస్ రుక్మిణి'.

కుర్రాడిలా నితిన్
అలియాస్ రుక్మిణి మూవీ నుంచి ఇవాళ (నవంబర్ 7) హీరో నితిన్ కు సంబంధించిన ఓ క్రియేటివ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో నితిన్ పదో తరగతి మ్యాథ్స్ మాస్టర్ 'కృష్ణ' అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ క్యారెక్టర్ కు సంబంధించిన యంగర్ లుక్ ను ఇవాళ మేకర్స్ పరిచయం చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఈ లుక్ లో నితిన్ పూర్తిగా గడ్డం తీసేసి, కేవలం మీసాతో యంగ్ కుర్రాడిలా మారిపోయాడు. తన కమ్ బ్యాక్ కోసం ఈ సినిమాపై నితిన్ ఎంత ప్రత్యేక శ్రద్ధ పెట్టాడో ఈ మేకోవర్ చూస్తే అర్థమవుతుంది. దాదాపు దశాబ్దం క్రితం తన పాత సినిమాల్లో ఎలా ఉండేవాడో.. అచ్చు గుద్దినట్లు అలానే ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు.
టైమ్ మెషిన్ లో వెళ్లొచ్చారా?
ఈ సరికొత్త యంగర్ లుక్ కు సంబంధించిన వీడియోలో ఒక క్యూట్ ఎలిమెంట్ కూడా ఉంది. ఈ క్యారెక్టర్ గెటప్ తో ఉన్న నితిన్.. సడెన్ గా వెళ్లి అలియాస్ రుక్మిణి హీరోయిన్ ఆఫియా సయ్యద్ కు సర్ ప్రైజ్ ఇస్తారు. నితిన్ ను అలా ఆ రూపంలో చూడగానే హీరోయిన్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతుంది.
"ఏంటి అలా మారిపోయారు? టైమ్ మెషిన్ లోకి ఏమైనా వెళ్లొచ్చారా?" అంటూ ఆమె షాక్ అవ్వడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలియాస్ రుక్మిణి మూవీ డిసెంబర్ 4న రిలీజ్ కానుంది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్
ప్రస్తుతం నితిన్ కొత్త లుక్ కు సంబంధించిన ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లలో బాగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ లుక్ ను తెగ షేర్ చేస్తున్నారు. "మన మాస్ మాస్టారు మళ్లీ కుర్రాడైపోయాడు" అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 'బేబీ' మూవీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
బౌండరీస్ లేని బోల్డ్ అండ్ ఎమోషనల్ స్టోరీతో వస్తున్న ఈ సినిమా నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ అవుతుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. నాని జడ్జిమెంట్, మురళీ కాంత్ టేకింగ్ పక్కాగా వర్కవుట్ అవుతాయని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. మరి ఈ కృష్ణ మాస్టారు వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


