Nivetha Thomas: కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నా.. ఇది భయం కాదు: నివేదా థామస్ పోస్ట్ వైరల్
Nivetha Thomas: స్టార్ హీరోయిన్ నివేదా థామస్ లేటెస్ట్ ఎక్స్ పోస్టు తెగ వైరల్ గా మారింది. కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లు ఆమె వెల్లడించారు. స్టోరీ ఓరియెంటెడ్ సినిమాలు ఎంచుకుంటూ, ఫీమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న నివేదా థామస్ పోస్టు వెనుక కారణమేంటో చూసేయండి.
Nivetha Thomas: కథా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనదైన ప్రత్యేక శైలిని సంపాదించుకున్న నటి నివేదా థామస్. తన సరికొత్త ప్రాజెక్ట్ షూటింగ్ మొదలవుతున్న సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సరికొత్త సెట్‌లోకి అడుగుపెడుతున్న వేళ మనసులో కలిగే ఉత్సాహం, కాస్త నెర్వస్‌నెస్‌ను వ్యక్తపరుస్తూ ఆమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది.

నివేదా థామస్ పోస్ట్
నివేదా థామస్ ఇవాళ (అక్టోబర్ 10) చేసిన ఓ ఎక్స్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో ఆమె.. "అంతా సిద్ధమైంది! ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నా. ఇది నాకు బాగా తెలిసిన ప్రపంచమే అయినప్పటికీ, ఇది నాకెంతో అవసరమైంది. తనదైన శైలిలో ఎంతో సహజమైంది.
కొత్త సెట్‌లో మొదటి రోజు సమీపిస్తున్న వేళ నాలో ఒక రకమైన నెర్వస్ ఎనర్జీ కలుగుతోంది. ఇది భయం కాదు, ప్రారంభించాలనే అసలైన ఉత్సాహం. ఒక అమ్మాయి సినిమా షూటింగ్ కోసం బయల్దేరింది" అంటూ రాసుకొచ్చారు.
శ్రీమతి సినిమా
ఈ సందర్భంగా నివేదా థామస్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘శ్రీమతి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. 'స్కైలాబ్' ఫేమ్ విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాను 'హనుమాన్' నిర్మాతలు కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జీ5 తెలుగు ఒరిజినల్‌గా నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటిలోని అనుబంధాలు, భావోద్వేగాలను ప్రతిబింబించేలా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్‌కు ఇప్పటికే అద్భుతమైన స్పందన లభించింది.
35 చిన్న కథ కాదు
‘35 - చిన్న కథ కాదు’ చిత్రంతో నివేదా థామస్ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఘన విజయాన్ని అందుకున్నారు. చదువు కోసం తపించే కొడుకుకు అండగా నిలిచే మధ్యతరగతి తల్లిగా ఆమె నటన విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులను తెచ్చిపెట్టింది. ఆ విజయ పరంపర అనంతరం ఆమె లీడ్ రోల్‌లో నటిస్తున్న సినిమా కావడంతో ‘శ్రీమతి’ ప్రాజెక్ట్‌పై పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
గతంలో కూడా నివేదా కథల ఎంపికలో ఎప్పుడూ విభిన్నమైన మార్గాన్నే ఎంచుకున్నారు. 'జెంటిల్‌మన్' సినిమాతో టాలీవుడ్‌లో బలమైన ముద్ర వేసిన ఆమె, ఆ తర్వాత 'నిన్ను కోరి', 'బ్రోచేవారెవరురా', 'వకీల్ సాబ్' వంటి చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలతో మెప్పించారు. కేవలం రొటీన్ గ్లామర్ పాత్రలకు పరిమితం కాకుండా కథను భుజాలపై మోసే పాత్రలను ఎంచుకుంటూ సాగుతున్న ఆమె కెరీర్‌లో ‘శ్రీమతి’ మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


