...
...
Next Story

OTT Malayalam: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మలయాళం మూవీ.. 320 కోట్ల సినిమా.. మమితా బైజు రొమాంటిక్ డ్రామా.. ఎప్పుడంటే?

OTT Malayalam: ఓటీటీలో కొత్త మలయాళ సినిమాల రిలీజ్ కోసం ఎదురు చూసే తెలుగు ఫ్యాన్స్ అలర్ట్. మీకు అదిరిపోయే మలయాళ ఒరిజినల్ ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు ఓ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చేస్తోంది. రీసెంట్ టైమ్స్ లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ పై లేటెస్ట్ అనౌన్స్ మెంట్ వైరల్ గా మారింది.

Published on: Sep 27, 2026, 13:36:58 IST
Advertisement

OTT Malayalam: మలయాళ సినీ చరిత్రలోనే రూ.320 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్-టైమ్ రికార్డులు తిరగరాసిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' (Bethlehem Kudumba Unit). ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ అరంగేట్రానికి ముహూర్తం ఖరారైంది.

బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ ఓటీటీ

ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మలయాళం మూవీ.. 320 కోట్ల సినిమా.. మమితా బైజు రొమాంటిక్ డ్రామా.. ఎప్పుడంటే? (x)
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మలయాళం మూవీ.. 320 కోట్ల సినిమా.. మమితా బైజు రొమాంటిక్ డ్రామా.. ఎప్పుడంటే? (x)

నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’. గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ కానుంది.

థియేటర్లలో రికార్డుల మోత మోగించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

మలయాళ ఆల్-టైమ్ రికార్డుల వేట

భావనా స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించిన 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.325 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి మలయాళ చిత్ర పరిశ్రమలోనే ఆల్-టైమ్ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.

'ప్రేమలు' ఫేమ్ గిరీష్ ఏడీ మార్క్ ఫన్ నరేషన్, నివిన్ పౌలీ టైమింగ్, మమితా బైజూ పర్ఫార్మెన్స్‌కు తోడు విష్ణు విజయ్ అందించిన సంగీతం అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది.

స్టోరీ ఇదే

అయితే ఆష్లే పక్కనే జస్టిన్ (నివిన్ పౌలీ) ఉంటాడు. అతను లవ్ బ్రేకప్ కావడంతో పెళ్లి వద్దనుకుంటాడు. కానీ జస్టిన్ మంచితనం చూసి ఆష్లే ప్రేమలో పడుతుంది. జస్టిన్ కూడా ఆమెను లవ్ చేస్తాడు. అయితే వీళ్లిద్దరి మధ్య 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంటుంది. ఈ ప్రేమ విషయం వీళ్ల కుటుంబంలో తెలుస్తుంది.

మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆష్లే, నివిన్ పౌలీ పెళ్లి జరిగిందా లేదా? అనేది బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ మూవీలో చూడాల్సిందే.

ఓటీిటీ రిలీజ్ పై అంచనాలు

భారీ బడ్జెట్ యాక్షన్ వండర్స్ బిగ్ స్క్రీన్ ను ఏలుతున్న నేటి ప్యాన్ ఇండియా కాలంలో ఒక సాధారణ రొమాంటిక్ కామెడీ చిత్రం రూ.320 కోట్ల మార్కును దాటడం విశేషం. కథలో సహజత్వం, కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎమోషన్స్ ఉంటే ప్రేక్షకులు రిపీటెడ్ ఆడియన్స్‌గా థియేటర్లకు వస్తారని ఈ బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ సినిమా నిరూపించింది.

సెప్టెంబర్ మొదటివారంలో తెలుగులోనూ థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమా.. అక్టోబర్ 2న జియోహాట్‌స్టార్‌లో డిజిటల్ ప్రీమియర్ కాబోతుంది. థియేటర్‌లో మిస్ అయిన ఓటీటీ ప్రియులకు ఇది కచ్చితమైన వీకెండ్ వాచ్‌గా మారడమే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త వ్యూవర్‌షిప్ రికార్డులను నమోదు చేసే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks