...
...
Next Story

Nora Fatehi: అంతా డైరెక్టరే చేశాడు.. మా ఫొటోలు కాదు.. వాళ్లవి వాడండి.. అప్పుడే బుద్ధి వస్తుంది: ఆ బూతు పాటపై నోరా ఫతేహి

Nora Fatehi: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సర్కే చునర్ పాటపై అందులో డ్యాన్స్ చేసిన నోరా ఫతేహి స్పందించింది. ఇవి వివాదాస్పదం అవుతుందని తాను అప్పుడే చెప్పానని, అయినా డైరెక్టర్ వినలేదని ఆమె అనడం విశేషం.

Published on: Mar 18, 2026, 16:34:36 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

కన్నడ పాన్ ఇండియా సినిమా 'కేడీ ద డెవిల్' (KD: The Devil) లోని 'సర్కే చునర్' (Sarke Chunar) ఐటెమ్ సాంగ్ రేపిన వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఆ పాటలో వాడిన పచ్చి బూతులపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏకంగా పార్లమెంట్‌లో కూడా దీనిపై చర్చ జరగడం, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఆ పాటను బ్యాన్ చేస్తామని హామీ ఇవ్వడం లాంటివి జరిగాయి.

Nora Fatehi: అంతా డైరెక్టరే చేశాడు.. మా ఫొటోలు కాదు.. వాళ్లవి వాడండి.. అప్పుడే బుద్ధి వస్తుంది: ఆ బూతు పాటపై నోరా ఫతేహి
Nora Fatehi: అంతా డైరెక్టరే చేశాడు.. మా ఫొటోలు కాదు.. వాళ్లవి వాడండి.. అప్పుడే బుద్ధి వస్తుంది: ఆ బూతు పాటపై నోరా ఫతేహి

ఈ రచ్చ మొత్తం ముదిరిపోవడంతో ఫైనల్‌గా బాలీవుడ్ బ్యూటీ, డ్యాన్సర్ నోరా ఫతేహి ఈ ఇష్యూపై నోరు విప్పింది. అసలు ఆ హిందీ వెర్షన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. అంతా ఆ డైరెక్టర్ ప్రేమ్ చేశాడని అనడం గమనార్హం.

ఆ బూతు పాటను నేను ఎంకరేజ్ చేయను

బుధవారం (మార్చి 18) మధ్యాహ్నం నోరా ఫతేహి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఈ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చింది. ఆ బూతు పాటను బ్యాన్ చేయించిన జనాలకు ఆమె థ్యాంక్స్ చెప్పడం విశేషం.

"ఇలాంటి అశ్లీలమైన పాటను నేను సపోర్ట్ చేస్తున్నానని ఎవరైనా అనుకుంటే అది నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ పాటపై ఇంతలా నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. మీ ప్రజర్ వల్లే మేకర్స్ లక్కీగా ఆ పాటను డిలీట్ చేసేశారు" అని నోరా తన క్యాప్షన్‌లో రాసుకొచ్చింది.

అంతేకాకుండా, ఆ పాటను షేర్ చేయడం ఆపేయాలని ఫ్యాన్స్‌ను కోరింది. "దయచేసి ఆ సాంగ్‌ను ఎవరూ షేర్ చేయకండి. మీరు అలా చేస్తే, అనవసరంగా దానికి మరింత ప్రచారం కల్పించినట్లు అవుతుంది" అని ఆమె సూచించింది.

నా క్యారెక్టర్‌ను టార్గెట్ చేయకండి

అసలు ఈ పాటకు, తనకు ఎలాంటి సంబంధం లేదని నోరా క్లారిటీ ఇచ్చింది. తాను ఒరిజినల్ కన్నడ వెర్షన్‌కు మాత్రమే సైన్ చేశానని, దాన్ని హిందీలో రిలీజ్ చేస్తున్నట్లు తనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఆమె చెప్పింది.

"హిందీ వెర్షన్‌లో నా ఇమేజ్‌ను వాడుకోవడానికి వాళ్లు నా పర్మిషన్ తీసుకోలేదు. అసలు ఆ హిందీ పాట గురించి నాకు ఏమాత్రం ఐడియా లేదు. నేను దానికి డ్యాన్స్ చేయలేదు."

"ఏదేమైనా ఫ్యూచర్‌లో ఇలాంటి సిట్యువేషన్స్ రాకుండా నేను, నా టీమ్ మరింత జాగ్రత్తగా ఉంటాం" అని నోరా వివరణ ఇచ్చింది. అంతేకాదు ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు వాటికి బాధ్యులైన డైరెక్టర్ల ఫొటోలు వాడాలని, వాటితో ఎలాంటి సంబంధం లేని తమవి కాదని చెప్పింది. అలా చేస్తేనే అలాంటి ఫిల్మ్ మేకర్స్ కు బుద్ధి వస్తుందని చెప్పింది.

అసలు వివాదం ఏంటి?

'కేడీ ద డెవిల్' సినిమాలో సంజయ్ దత్, నోరాలపై చిత్రీకరించిన ఈ 'సర్కే చునర్' సాంగ్ నిజానికి కన్నడ పాట. దీన్ని లిరిసిస్ట్ రకీబ్ ఆలం హిందీలోకి ట్రాన్స్‌లేట్ చేశాడు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించాడు. డైరెక్టర్ బలవంతం వల్లే హిందీలో బూతులు వాడానని రీసెంట్‌గా చెప్పిన విషయం తెలిసిందే. డబుల్ మీనింగ్ డైలాగులతో ఉన్న ఈ పాటపై సోషల్ మీడియాలో జనాలు, రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడంతో మేకర్స్ ఆ వీడియోను అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe