OTT Views: ఈ తెలుగు కోర్టు రూమ్ థ్రిల్లర్ సిరీస్ జోరు మామూలుగా లేదు-ఓటీటీలో ఫాస్టెస్ట్ 50 మిలియన్ రికార్డు-మీరు చూశారా?

OTT Views: ఓటీటీలో తెలుగు లీగల్ డ్రామా సిరీస్ అదరగొడుతోంది. ఈ కోర్టు రూమ్ థ్రిల్లర్ జోరు మామూలుగా లేదు. ఏకంగా ఫాస్టెస్ట్ 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డును ఈ సిరీస్ ఖాతాలో వేసుకుంది. తెలుగు జనాలు ఓటీటీలో దీన్ని ఎగబడి చూస్తున్నారు. మరి మీరు చూశారా? 

Published on: Aug 6, 2026, 10:25:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Views: టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ మేకా (Srikanth Meka) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త లీగల్ డ్రామా వెబ్ సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’ (Objection My Lord). ఈ కోర్టు రూమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో సంచలన వ్యూయర్‌షిప్ రికార్డులతో దూసుకుపోతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) లో ప్రసారమవుతున్న ఈ సిరీస్ విడుదలైన కొద్ది రోజుల్లోనే డిజిటల్ రికార్డులను తిరగరాసింది.

ఈ తెలుగు కోర్టు రూమ్ థ్రిల్లర్ సిరీస్ జోరు మామూలుగా లేదు-ఓటీటీలో ఫాస్టెస్ట్ 50 మిలియన్ రికార్డు-మీరు చూశారా? (x)
ఈ తెలుగు కోర్టు రూమ్ థ్రిల్లర్ సిరీస్ జోరు మామూలుగా లేదు-ఓటీటీలో ఫాస్టెస్ట్ 50 మిలియన్ రికార్డు-మీరు చూశారా? (x)

50 మిలియన్ స్ట్రీమింగ్

దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ (Santosh Ayyappan) తెరకెక్కించిన ఈ ఏడు ఎపిసోడ్ల లీగల్ డ్రామా అబ్జెక్షన్ మై లార్డ్ జులై 31, 2026న ఓటీటీలోకి వచ్చింది. జీ5 ప్లాట్‌ఫామ్‌లోనే అత్యంత వేగంగా 50 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ (50 Million+ Streaming Minutes) డిజిటల్ వ్యూయర్‌షిప్ సాధించిన తెలుగు వెబ్ సిరీస్‌గా ‘అబ్జెక్షన్ మై లార్డ్’ చరిత్ర సృష్టించింది. కోర్ట్‌రూమ్ డ్రామాలను ఇష్టపడే తెలుగు ఓటీటీ వీక్షకులు ఈ సిరీస్‌ను విశేషంగా ఆదరిస్తున్నారు.

లాయర్ పాత్రలో

సీనియర్ హీరో శ్రీకాంత్ ఈ అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ తోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో శ్రీకాంత్ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో అదరగొట్టాడు. తన యాక్టింగ్ తో విజిల్స్ వేయిస్తున్నాడు. ముకేష్ రిషి, అనన్య శర్మ, స్నేహల్ కామత్, సమీర్ తదితరులు ఇతర కీలక పాత్రలలో కనిపించారు. ప్రతి ఒక్కరూ యాక్టింగ్ లో సత్తాచాటడంతో సిరీస్ కు మంచి వ్యూయర్ షిప్ లభిస్తోంది.

తెలుగు రీమేక్

డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజ్‌కుమార్ అకేళ్ల ఈ అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్‌ను నిర్మించారు. తమిళంలో సంచలన విజయం సాధించిన ‘సట్టముమ్ నీదియుమ్’ వెబ్ సిరీస్‌కి ఇది అధికారిక తెలుగు రీమేక్ కావడం విశేషం. అయినా తెలుగు ఆడియన్స్ కు తగ్గట్లుగా మార్పులు చేసి, గ్రిప్పింగ్ గా ఈ సిరీస్ తెరకెక్కించారు.

సక్సెస్ సీక్రెట్ ఏంటి?

సాధారణంగా తెలుగు ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్లు లేదా హారర్ కంటెంట్‌కు ఎక్కువ వ్యూయర్‌షిప్ వస్తుంటుంది. అయితే 'అబ్జెక్షన్ మై లార్డ్' సాధించిన ఈ 50 మిలియన్ మినిట్స్ రికార్డు.. గ్రిప్పింగ్ కోర్ట్‌రూమ్ లీగల్ డ్రామాలకు కూడా తెలుగులో విపరీతమైన ఆదరణ ఉందని నిరూపిస్తోంది.

సీనియర్ నటుడు శ్రీకాంత్ సీరియస్ రోల్స్‌లో డిజిటల్ స్పేస్‌ను ఎంచుకోవడం ఆయన కెరీర్‌కు మైలేజ్ ఇవ్వడమే కాకుండా, తమిళ రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగినట్లు వేగవంతమైన స్క్రీన్‌ప్లేతో సంతోష్ అయ్యప్పన్ తెరకెక్కించడం వల్లనే ఈ రికార్డ్ వ్యూస్‌ సాధించడం సాధ్యమైంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More