OTT Bold: ప్రైమ్ వీడియోలో కొత్త రొమాంటిక్ డ్రామా.. ఇవాళ ఓటీటీలోకి బోల్డ్ సీన్లతో క్రేజీ సిరీస్

OTT Bold: ఓటీటీలోకి మరో బోల్డ్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. రొమాంటిక్ సీన్లతో కూడిన ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ రచయిత్రి ఎల్ కెన్నెడీ బెస్ట్ సెల్లింగ్ నవల 'ఆఫ్ క్యాంపస్' ఇప్పుడు వెబ్ సిరీస్‌గా వస్తోంది. ఈ సిరీస్ విశేషాలు మీకోసం.

Published on: May 13, 2026, 09:06:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Bold: ప్రస్తుతం డిజిటల్ తెరపై నవలల ఆధారంగా రూపొందుతున్న వెబ్ సిరీస్‌లకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే 'ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రిటీ', 'మాక్స్టన్ హాల్', 'బ్రిడ్జర్టన్' వంటి సిరీస్‌లు గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అదే బాటలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన రొమాంటిక్ అండ్ బోల్డ్ డ్రామా 'ఆఫ్ క్యాంపస్' (Off Campus) ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

ఓటీటీలోకి బోల్డ్ వెబ్ సిరీస్ (x/offcampusonpv)
ఓటీటీలోకి బోల్డ్ వెబ్ సిరీస్ (x/offcampusonpv)

ఆఫ్ క్యాంపస్ ఓటీటీ

ప్రముఖ రచయిత్రి ఎల్ కెన్నెడీ రాసిన అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఆఫ్ క్యాంపస్’ అనే నవలల సిరీస్ ఆధారంగా ఈ ‘ఆఫ్ క్యాంపస్’ అనే వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఈ సిరీస్ సీజన్ 1 ఈ రోజు (మే 13) ఓటీటీలోకి వస్తుంది. ఇండియన్ టైమ్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సీజన్ 1 అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది.

బోల్డ్ సిరీస్

ఆఫ్ క్యాంపస్ సిరీస్ ట్రైలర్ చూస్తేనే దీన్ని ఎంత బోల్డ్ గా తెరకెక్కించారో అర్థమవుతోంది. లీడ్ క్యారెక్టర్ల మధ్య రొమాంటిక్, సెక్స్ సీన్లు ఎక్కువే ఉన్నాయి. ఆఫ్ క్యాంపస్ సీజన్ 1లోని 8 ఎపిసోడ్లు ఇవాళే స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ సిరీస్ లో ఎల్లా బ్రైట్, బెల్మాంట్ కెమెలి, మికా అబ్దాల్లా ప్రధాన పాత్రలు పోషించారు.

కథా నేపథ్యం ఏమిటి?

ఈ సిరీస్ ప్రధానంగా మూడు క్యారెక్టర్ల మధ్య తిరుగుతుంది. తన క్లాస్ లోని ఓ అబ్బాయిని ఆ అమ్మాయి ప్రేమిస్తుంది. అయితే ఆ అబ్బాయికి దగ్గర కావడం కోసం మరో అబ్బాయితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు డ్రామా ఆడుతుంది. కానీ వీళ్లు ఇద్దరు దగ్గర అవుతారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఆఫ్ క్యాంపస్ వెబ్ సిరీస్ సీజన్ 1 స్టోరీ. ఇందులో ఐస్ హాకీ టీమ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయని చెప్తున్నారు.

తొలి సీజన్ విశేషాలు

'ఆఫ్ క్యాంపస్' మొదటి సీజన్‌ను హన్నా, గారెట్ అనే ఇద్దరు వ్యక్తుల ప్రేమకథ ఆధారంగా తెరకెక్కించారు. ఒకరు నిశ్శబ్దంగా ఉండే సాంగ్ రైటర్ అయితే, మరొకరు బ్రైయర్ యూనివర్సిటీ స్టార్ హాకీ ప్లేయర్. భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనే 'ఆపోజిట్స్ అట్రాక్ట్' కాన్సెప్ట్‌తో ఈ సీజన్ సాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం లూయిసా లెవీ ఈ అడాప్టేషన్‌ను సృష్టించారు. రెండో సీజన్‌లో మరో జంట కథపై దృష్టి సారించనున్నారు.

అప్పుడే విమర్శలు

ఈ సిరీస్ తారాగణం విషయంలో సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పుస్తకంలోని పాత్రలకు, ఎంపిక చేసిన నటీనటులకు పొంతన లేదంటూ కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో హన్నా వెల్స్‌గా ఎల్లా బ్రైట్, గారెట్ గ్రాహమ్‌గా బెల్మాంట్ కెమెలి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

వీరితో పాటు మికా అబ్దల్లా (అల్లీ హేయిస్), ఆంటోనియో సిప్రియానో (జాన్ లోగాన్), జాలెన్ థామస్ బ్రూక్స్ (జాన్ టక్కర్), జోష్ హ్యూస్టన్ (జస్టిన్ కోల్), స్టీఫెన్ కాలిన్ (డీన్ డి లారెన్టిస్) కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఫిలిప్ గ్రాహమ్‌గా స్టీవ్ హోవీ, బ్యూ మాక్స్‌వెల్‌గా ఖోబ్ క్లార్క్ నటిస్తున్నారు.

రెండో సీజన్ కూడా

ప్రైమ్ వీడియో ఈ సిరీస్‌పై ఎంత నమ్మకంతో ఉందంటే, మొదటి సీజన్ విడుదల కాకముందే రెండో సీజన్‌ను కూడా ప్రకటించేసింది. దీన్ని ఒక సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీగా మార్చాలని ప్లాన్ చేస్తోంది. 'ఆఫ్ క్యాంపస్' సీజన్ 1 లోని అన్ని ఎపిసోడ్‌లు మే 13, 2026న ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. ఆఫ్ క్యాంపస్ సిరీస్ ఏ నవల ఆధారంగా రూపొందింది?

ఇది రచయిత్రి ఎల్ కెన్నెడీ రాసిన బెస్ట్ సెల్లింగ్ బుక్ సిరీస్ 'ఆఫ్ క్యాంపస్' ఆధారంగా తెరకెక్కింది.

2. ఈ సిరీస్ ఎక్కడ, ఎప్పుడు విడుదలవుతుంది?

ఈ సిరీస్ మే 13, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వస్తుంది.

3. మొదటి సీజన్ కథ ఎవరి గురించి ఉంటుంది?

మొదటి సీజన్ హన్నా వెల్స్, గారెట్ గ్రాహమ్ అనే ఇద్దరు ప్రేమికుల కథ ఆధారంగా సాగుతుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More