...
...
Next Story

OTT Today: ఈరోజు ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ డ్రామా.. కేవలం వాళ్లకు మాత్రమే..

పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటించిన 'ఓం శాంతి శాంతి:' డిజిటల్ ప్రియులను పలకరించేందుకు సిద్ధమైంది. మలయాళ సూపర్ హిట్ 'జయ జయ జయ జయ హే'కి రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ ఈరోజు అంటే మంగళవారం (మార్చి 3) నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: Mar 3, 2026, 14:45:00 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న తాజా మూవీ 'ఓం శాంతి శాంతి:'. మలయాళంలో సంచలన విజయం సాధించిన 'జయ జయ జయ జయ హే' సినిమాకు ఇది అధికారిక తెలుగు రీమేక్. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది.

ఆహా గోల్డ్ మెంబర్స్‌కు మాత్రమే..

OTT Today: ఈరోజు ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ డ్రామా.. కేవలం వాళ్లకు మాత్రమే..
OTT Today: ఈరోజు ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ డ్రామా.. కేవలం వాళ్లకు మాత్రమే..

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (aha) ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. బుధవారం (మార్చి 4) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుండగా.. ఆహా గోల్డ్ మెంబర్స్ కు మాత్రం మంగళవారం (మార్చి 3) నుంచి అందుబాటులోకి వచ్చింది.

ఈ విషయాన్ని తరుణ్, ఈషా జోడీ ఫన్నీగా ఓ వీడియోతో చెప్పింది. అంతేకాదు ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ పై 30 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్లు ఈ జోడీ వెల్లడించింది.

ఓం శాంతి శాంతి శాంతి: స్టోరీ ఇదే

ఒక మధ్యతరగతి యువతి, పాతకాలపు ఆలోచనలు ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ చిత్ర ప్రధానాంశం. భర్త, అతని కుటుంబం నుండి ఎదురయ్యే అణచివేతను, గృహహింసను ఆమె ఎలా ఎదిరించింది? ఒక గృహిణిగా తన ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం ప్రేక్షకులకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో భర్తకు ఆమె బుద్ధి చెప్పే తీరు సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది.

రియల్ లైఫ్ జోడీ

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ ప్రేమలో పడ్డారనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. వెండితెరపై వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ అటు నటనతో పాటు ఇటు దర్శకత్వ బాధ్యతలతోనూ బిజీగా గడుపుతున్నాడు.

మలయాళంలో బేసిల్ జోసెఫ్ లీడ్ రోల్లో నటించాడు. అక్కడ మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కామెడీకి ఓ సీరియస్ మెసేజ్ ను జోడించి మూవీని తీసిన విధానం బాగా ఆకట్టుకుంది. అయితే తెలుగులో మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరి ఓటీటీలో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe