ఆన్‌లైన్‌లో వేధిస్తున్నారు.. దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు: పోలీసులకు ఈషా రెబ్బ ఫిర్యాదు

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ సోషల్ మీడియా వేధింపులపై పోలీసులను ఆశ్రయించింది. తన సినిమా ప్రమోషన్ల సమయంలో ఒక మీమ్ పేజీలో తన పట్ల అత్యంత అసభ్యకరంగా, లైంగికంగా వేధించేలా కామెంట్స్ పెట్టారంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది.

Published on: Feb 4, 2026, 21:43:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై, ముఖ్యంగా హీరోయిన్లు, ఇతర నటీమణులపై జరుగుతున్న ఆన్‌లైన్ దాడులు, వేధింపులు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. తాజాగా తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బకు ఇటువంటి చేదు అనుభవం ఎదురైంది. తన పట్ల ఆన్‌లైన్‌లో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆమె హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.

ఆన్‌లైన్‌లో వేధిస్తున్నారు.. దారుణమై కామెంట్స్ చేస్తున్నారు: పోలీసులకు ఈషా రెబ్బ ఫిర్యాదు
ఆన్‌లైన్‌లో వేధిస్తున్నారు.. దారుణమై కామెంట్స్ చేస్తున్నారు: పోలీసులకు ఈషా రెబ్బ ఫిర్యాదు

అసలేం జరిగింది?

ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థ సమాచారం ప్రకారం.. ఈషా రెబ్బ ఇటీవల తన సినిమా ఓం శాంతి శాంతి శాంతి: ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఒక సోషల్ మీడియా/మీమ్ పేజీలో ఒక వ్యక్తి తన పట్ల అత్యంత జుగుప్సాకరమైన, లైంగిక వేధింపులకు గురిచేసేలా, పరువు నష్టం కలిగించేలా ఒక కామెంట్ పోస్ట్ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

మానసిక క్షోభ.. ఆత్మగౌరవం దెబ్బతీసేలా..

సదరు వ్యక్తి ఉపయోగించిన భాష చాలా అభ్యంతరకరంగా ఉందని, ఇది తనను మానసికంగా తీవ్ర వేదనకు గురిచేసిందని ఈషా ఆవేదన వ్యక్తం చేసింది. ఒక మహిళగా తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, బహిరంగంగా తనను అవమానించడమే లక్ష్యంగా ఇదంతా జరిగినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పింది. ఈ ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని ఆమె తెలిపింది.

ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఈషా రెబ్బ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఓం శాంతి శాంతి శాంతి: సినిమా విశేషాలు

ఈషా రెబ్బ ఇటీవల 'ఓం శాంతి శాంతి శాంతి:' అనే తెలుగు మూవీలో నటించింది. మలయాళంలో దర్శన రాజేంద్రన్, బేసిల్ జోసెఫ్ నటించిన సూపర్ హిట్ మూవీ 'జయ జయ జయ జయ హే'కు ఇది అధికారిక రీమేక్. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈషా రెబ్బ సరసన తరుణ్ భాస్కర్ హీరోగా నటించాడు. ఈ సినిమా ప్రమోషన్ల నేపథ్యంలోనే ఈషా వేధింపులకు గురైంది.

ఇక తరుణ్ భాస్కర్ తో పెళ్లి అంటూ కూడా ఈషా రెబ్బ ఈ మధ్య వార్తల్లో నిలిచింది. ఈ వార్తలను ఈ ఇద్దరూ ఇప్పటి వరకూ కన్ఫమ్ చేయలేదు. అయితే సరైన సమయం వచ్చినప్పుడు చెబుతానని తరుణ్ చెప్పగా.. అలాంటిదేమీ లేదని ఈషా అనడం విశేషం.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More