Samantha: సమంతాకు షాక్.. ఫస్ట్ ర్యాంకు నుంచి ఔట్.. ఇండియాలో నంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే?

Samantha: టాప్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుకు షాక్ తగిలింది. కొంత కాలంగా ఇండియాలో నంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న సమంత్ ఆ టాప్ ర్యాంకు కోల్పోయింది. మరి ఇప్పుడు మన దేశంలో టాప్ హీరోయిన్ ఎవరో ఇక్కడ చూసేయండి. 

Published on: May 23, 2026, 20:10:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Samantha: హీరోయిన్ సమంత రూత్ ప్రభుకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇక రెండో పెళ్లి వార్తలతో ఆమె పేరు మరింత మార్మోగింది. కానీ ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ కు షాక్ తగిలింది. ఇండియాలో నంబర్ వన్ హీరోయిన్ ర్యాంకును ఈ భామ కోల్పోయింది.

సమంతకు షాకిచ్చిన బాలీవుడ్ బ్యూటీ (instagram)
సమంతకు షాకిచ్చిన బాలీవుడ్ బ్యూటీ (instagram)

టాప్ హీరోయిన్లు

భారతీయ సినీ రంగంలో ఏ నటీనటులకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలుసుకోవడానికి ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఒర్మాక్స్ మీడియా ప్రతి నెలా ప్రత్యేక సర్వేలను నిర్వహిస్తుంది. థియేటర్లలో వినోదాన్ని పంచే వెండితెర తారలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై సందడి చేసే నటీమణుల ప్రజాదరణ, వారిపై ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ ఆధారంగా ఈ నివేదికలను సిద్ధం చేస్తారు.

సమంతకు షాక్

తాజాగా ఒర్మాక్స్ 'స్టార్స్ ఇండియా లవ్స్' తాజా ర్యాంకింగ్స్ లిస్ట్ ను ప్రకటించింది. ఇందులో సమంతకు షాక్ తగిలింది. ఈ రీసెంట్ సర్వేలో సమంతను వెనక్కి నెట్టి బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇండియాలోనే నంబర్ వన్ హీరోయిన్ గా అలియా నిలిచింది.

​ఈ తాజా సర్వేలో బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్ ఇండియాలోనే మోస్ట్ పాపులర్ ఫీమేల్ ఫిల్మ్ స్టార్‌గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తన విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న అలియా, ఈ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.

రెండో ప్లేస్ కు

​ఇక టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఈ జాబితాలో రెండో స్థానానికి పడిపోయింది. గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ టాప్ నటి దీపికా పదుకొణె ఈ సర్వేలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ లిస్ట్ లో రష్మిక మందన్న, సాయి పల్లవి, నయనతార, శ్రీలీల లాంటి హీరోయిన్లు కూడా ఉన్నారు.

​ప్రతి నెలా సేకరించే డేటా ఆధారంగా ఒర్మాక్స్ మీడియా ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటిస్తుంది. దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు, అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను వీక్షించే సినీ ప్రియుల సెంటిమెంట్, వారి స్పందనలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు.

టాప్ 10 హీరోయిన్ల లిస్ట్

  1. ​అలియా భట్

​ 2. సమంత రూత్ ప్రభు

​ 3. దీపికా పదుకొణె

​ 4. రష్మిక మందన్న

​ 5. కాజల్ అగర్వాల్

​ 6. సాయి పల్లవి

​ 7. నయనతార

​ 8. శ్రీలీల

​ 9. కృతి సనన్

​ 10. త్రిష కృష్ణన్

​ఈ జాబితాను పరిశీలిస్తే ఉత్తరాది నటీమణులతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన కథానాయికల హవా కూడా దేశవ్యాప్తంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More