Malayalam OTT: జర్నలిస్ట్ మిస్సింగ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. షాకిచ్చే క్లైమాక్స్!

Malayalam OTT: ఓటీటీ ఆడియన్స్ కు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు మరో మలయాళ థ్రిల్లర్ రెడీ అయింది. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘ఒరు అన్వేషణథింతె తుడక్కం’ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ ఇవాళ అనౌన్స్ చేశారు. 

Published on: Oct 11, 2026, 19:15:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Malayalam OTT: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఒరు అన్వేషణథింతె తుడక్కం' (Oru Anveshanathinte Thudakkam). ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. సస్పెన్స్, క్రైమ్ కథలను ఇష్టపడే సినీ ప్రియులను ఈ చిత్రం ఆకట్టుకోనుంది.

జర్నలిస్ట్ మిస్సింగ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. షాకిచ్చే క్లైమాక్స్!
జర్నలిస్ట్ మిస్సింగ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. షాకిచ్చే క్లైమాక్స్!

ఒరు అన్వేషణథింతె తుడక్కం ఓటీటీ

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ లో ఈ ఒరు అన్వేషణథింతె తుడక్కం సినిమా అక్టోబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో చూడలేకపోయిన వారు అలాగే మంచి మలయాళ థ్రిల్లర్లను ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జర్నలిస్ట్ మిస్సింగ్

ఈ ఒరు అన్వేషణథింతె తుడక్కం సినిమా కథ మొత్తం ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మిస్సింగ్ చుట్టూ తిరుగుతుంది. జీవన్ థామస్ అనే జర్నలిస్ట్ హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో మీడియా, పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతుంది. ఈ కేసును ఛేదించే బాధ్యతను క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక పోలీస్ బృందం తీసుకుంటుంది.

సంచలన నిజాలు

జర్నలిస్ట్ మిస్సింగ్ కేసు దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ అనూహ్యమైన మలుపులు, సంచలన నిజాలు వెలుగులోకి వస్తాయి. అసలు జీవన్ కిడ్నాప్ అయ్యాడా లేక హత్యకు గురయ్యాడా అనే ప్రశ్నలతో కథ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. రాజకీయ నేపథ్యం, కుటుంబ రహస్యాలు, ద్రోహాల కలయికతో సినిమాలోని మిస్టరీ మరింత ముదురుతుంది.

షాకిచ్చే క్లైమాక్స్

దర్శకుడు ఎం.ఎ. నిషాద్ ఈ సినిమాలో వాస్తవ కేసుల ఆధారంగా పోలీసు పరిశోధన తీరును స్క్రీన్‌పై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. జీవన్ అదృశ్యం వెనుక ఉన్న అసలు కారణం ఎవరు అనే క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని రీతిలో ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇస్తుంది. ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా దర్శకుడు కథను నడిపించారు. దీంతో ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

మస్ట్ వాచ్

ఈ ఒరు అన్వేషణథింతె తుడక్కం చిత్రంలో షైన్ టామ్ చాకో, వాణీ విశ్వనాథ్, సముద్రఖని, ముఖేష్, స్వాసిక విజయ్, శివదా, దుర్గా కృష్ణ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు ఎం.ఎ. నిషాద్ స్వయంగా ఇన్వెస్టిగేషన్ అధికారిగా కీలక పాత్రలో మెప్పించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. జయచంద్రన్ సంగీతాన్ని అందించగా, బెంజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కేవీ అబ్దుల్ నాజర్ దీనిని నిర్మించారు. మలయాళ థ్రిల్లర్లను ఇష్టపడే ఓటీటీ ఆడియన్స్ కు ఈ మూవీ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More