...
...
Next Story

Oscar Film OTT: బాబోయ్ ఇన్ని ట్విస్టులా.. బెస్ట్ మూవీగా ఆస్కార్ గెలిచిన థ్రిల్లర్ చూశారా.. ఈ ఓటీటీలోనే స్ట్రీమింగ్!

Oscar Film OTT: ఆస్కార్స్ 2026లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ మూవీ అదరగొట్టింది. ఏకంగా ఆరు విభాగాల్లో పురస్కారాలు సొంతం చేసుకుంది. ఇందులో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ కూడా ఉన్నాయి. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లతో కూడిన ఈ మూవీని ఓటీటీలో చూసేయండి.

Published on: Mar 16, 2026, 10:10:54 IST
Advertisement

ఆస్కార్స్ 2026 ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సారి అకాడమీ అవార్డుల్లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ మూవీ సత్తాచాటింది. ఏకంగా ఆరు విభాగాల్లో విజేతగా నిలిచింది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ పురస్కారాలూ అందుకుంది. లియోనార్డ్ డికాప్రియో హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్లో ట్విస్ట్ లు అదిరిపోయాయి. దీని ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ లుక్కేయండి.

వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఓటీటీ

ఆస్కార్ అవార్డు గెలిచిన మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ (x/onebattlemovie)
ఆస్కార్ అవార్డు గెలిచిన మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ (x/onebattlemovie)

ఆస్కార్స్ 2026లో ఆధిపత్యం ప్రదర్శించిన మూవీ ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’. దీనికి పాల్ థామస్ అండర్సన్ డైరెక్టర్. ఇందులో లియానార్డో డికాప్రియో, సీన్ పెన్, బెనిసియో, రెగీనా, టెయానా తదితరులు నటించారు. ఈ మూవీ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

బ్లాక్ బస్టర్

‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సెప్టెంబర్ 26, 2025న రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1750 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాను వార్నర్ బ్రదర్స్ నిర్మించింది.

ఓటీటీ రిలీజ్

ఆస్కార్స్ 2026లో బెస్ట్ మూవీగా నిలిచిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 26, 2026న జియోహాట్‌స్టార్‌లో రిలీజైంది. ఇండియాలో ఈ ఓటీటీలో మూవీని చూడొచ్చు.

మరోవైపు విదేశాల్లో హెచ్బీవో మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ ప్లాట్ ఫామ్ లో అత్యధిక మంది చూసిన మూవీగా నిలిచింది.

వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ స్టోరీ

ఒక బాంబ్ బ్లాస్ట్ సమయంలో పర్ఫిడియాను మిలిటరీ ఆఫీసర్ స్టీవెన్ (సీన్ పెన్) పట్టుకుంటాడు. ఆమెను వదిలేయాలంటే తనతో సెక్స్ చేయాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు. అందుకు పర్ఫిడియా ఒప్పుకుంటుంది. అంతే కాకుండా విప్లవకారుల వివరాలను స్టీవెన్ కు ఇస్తుంది.

కూతురిని చంపాలని

పాట్, తన కూతురు చార్లీన్ ను వదిలేసి పర్ఫిడియా ఎక్కడికో వెళ్లిపోతుంది. చార్లీన్ పేరును విల్లాగా పాట్ మారుస్తాడు. పాట్ తన పేరును బాబ్ గా మార్చుకుని సీక్రెట్ గా జీవిస్తుంటాడు. పెద్ద ఆఫీసర్ గా ఎదిగిన స్టీవెన్ తనకు అడ్డుగా ఉందని భావించి విల్లాను చంపాలని అనుకుంటాడు.

విల్లా తన కూతురు అని డీఎన్ఏ టెస్టు ద్వారా స్టీవెన్ కన్ఫామ్ చేసుకుంటాడు. మరోవైపు విప్లవకారులు విల్లాను కాపాడి తల్లి పర్ఫిడియా చేసిన మోసం గురించి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? విల్లాను స్టీవెన్ చంపాడా? విల్లా కోసం పాట్ ఏం చేశాడు? అనేది వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ది అనదర్ లో చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks