OTT Horror Thriller: భూతాలు, దెయ్యాలు, భయంకరమైన బంగ్లాలు ఏమీ లేకుండానే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'గెట్ అవుట్' (Get Out) ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో సంచలనం సృష్టిస్తోంది. 7.9 ఐఎమ్‌డీబీ (IMDb) రేటింగ్‌తో ఓటీటీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ గ్లోబల్ క్లాసిక్ మూవీని స్టార్ డైరెక్టర్ జార్డన్ పీల్ తెరకెక్కించారు.
బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 2500 కోట్ల సునామీ

కేవలం 4.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 45 కోట్లు) అత్యల్ప బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా.. వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రూ. 2500 కోట్లకు పైగా ($259.9M) గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ సాధించిన హారర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
సాధారణంగా హారర్ జానర్ సినిమాలకు ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు రావడం చాలా అరుదు. కానీ ఈ సినిమాకు 'బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే' విభాగంలో అకాడమీ ఆస్కార్ అవార్డు లభించింది. భయంకరమైన రాక్షసులు, ఆత్మలు లేకుండా కేవలం మానసిక భయంతోనే ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టవచ్చని డైరెక్టర్ జార్డన్ పీల్ ప్రపంచానికి నిరూపించారు.
గెట్ అవుట్.. అసలు కథేంటి? ఎందుకు చూడాలి?
క్రిస్ (డానియల్ కలుయా) అనే యంగ్ బ్లాక్ ఫోటోగ్రాఫర్, తన వైట్ గర్ల్‌ఫ్రెండ్ రోజ్ (అలిసన్ విలియమ్స్) తల్లిదండ్రులను కలవడానికి ఆమె హోమ్‌టౌన్‌కు వెళ్తాడు. అక్కడ రోజ్ ఫ్యామిలీ మెంబర్స్ క్రిస్‌ను ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారు.
అయితే రాను రాను అక్కడ పనిచేసే సిబ్బంది ప్రవర్తన, అక్కడి వాతావరణం క్రిస్‌కు చాలా వింతగా, అనుమానాస్పదంగా అనిపించడం మొదలవుతుంది. ఆ వింత ప్రవర్తన వెనుక ఉన్న భయానకమైన నిజాన్ని క్రిస్ ఎలా కనిపెట్టాడనేదే ఈ మూవీ అసలు కథ.
మైండ్ బ్లాక్ చేసే కాన్సెప్ట్.. హారర్ సినిమాల్లో భిన్నమైనది
ఈ గెట్ అవుట్ సినిమాలో ఊహించని దెయ్యాలు, రక్తపాతాలు ఉండవు. హిప్నోసిస్ (Hypnosis) ద్వారా ఒక మనిషి మైండ్‌ను తన కంట్రోల్లోకి తెచ్చుకుని, అతన్ని ఆలోచించలేని నిస్సహాయ స్థితికి ('The Sunken Place') నెట్టేసే కాన్సెప్ట్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది.
{{/usCountry}}ఈ గెట్ అవుట్ సినిమాలో ఊహించని దెయ్యాలు, రక్తపాతాలు ఉండవు. హిప్నోసిస్ (Hypnosis) ద్వారా ఒక మనిషి మైండ్‌ను తన కంట్రోల్లోకి తెచ్చుకుని, అతన్ని ఆలోచించలేని నిస్సహాయ స్థితికి ('The Sunken Place') నెట్టేసే కాన్సెప్ట్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది.
{{/usCountry}}పైకి ఎంతో మంచిగా, సామాజికంగా ఎంతో పురోగతి సాధిస్తున్నట్లుగా కనిపించే మనుషుల మైండ్‌సెట్ వెనుక ఉన్న డార్క్ సైడ్‌ను ఈ సినిమాలో అత్యంత ప్రతిభావంతంగా చూపించారు. లీడ్ రోల్ చేసిన డానియల్ కలుయా యాక్టింగ్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.
కథలో చిన్న చిన్న డీటైలింగ్స్‌ను డైరెక్టింగ్ టీమ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసింది. మొదటిసారి చూసినప్పుడు అర్థం కాని ఎన్నో ట్విస్ట్‌లు, సెకండ్ టైమ్ చూస్తున్నప్పుడు క్లియర్‌గా అర్థమవుతాయి. వీకెండ్‌లో మైండ్ రేసింగ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే జియోహాట్‌స్టార్‌లో ఉన్న ఈ సినిమాను మిస్ కాకుండా చూసేయండి.