OTT Malayalam Releases: ఈ వారం ఓటీటీ స్పేస్‌లో మలయాళ సినిమాల హవా నడుస్తోంది. యాక్షన్, సైబర్ క్రైమ్ థ్రిల్లర్, హారర్ కామెడీ, రూరల్ ఫాంటసీలతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్క్రీన్లను ముంచెత్తడానికి రెడీ అయ్యాయి. జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్, జియోహాట్‌స్టార్ లాంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్న ఈ వీకెండ్ మలయాళం ఓటీటీ మూవీస్ పూర్తి వివరాలు ఇవే.
ఆరు మస్ట్ వాచ్ మలయాళం మూవీస్, సిరీస్

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మలయాళ చిత్రాలు ఎప్పుడూ ప్రత్యేకం. తక్కువ బడ్జెట్‌తో రియలిస్టిక్ డ్రామాలు ప్రెజెంట్ చేస్తూ కంటెంట్ లవర్స్‌ను ఆకట్టుకోవడంలో వీరు ముందుంటారు.
ప్రతివారం లాగే ఈ సెప్టెంబర్ రెండో వారంలోనూ దాదాపు అరడజనుకు పైగా క్రేజీ ప్రాజెక్ట్‌లు బాక్స్ ఆఫీస్ సందడి ముగించుకుని, నేరుగా లేదా డిజిటల్ ప్రీమియర్‌గా మన ముందుకు వచ్చేశాయి.
జోజు జార్జ్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'వరవు'
మాస్ అండ్ ఇంటెన్స్ రోల్స్‌తో మెప్పించే జోజు జార్జ్ నటించిన కొత్త చిత్రం 'వరవు' (Varavu) జీ5 వేదికగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. డైరెక్టర్ షాజీ కైలాస్ మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్, రివేంజ్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
జైలు నుంచి విడుదలైన ఒక ఎస్టేట్ ప్లాంటర్ తన పాత శత్రువులపై పగ తీర్చుకోవడానికి సొంత ఊరికి రావడం, ఈ క్రమంలో కుటుంబంలో తలెత్తే ఘర్షణలు ఈ కథకు ప్రధాన ఆకర్షణ. వాణి విశ్వనాథ్, మురళీ గోపి, అర్జున్ అశోకన్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా యాక్షన్ మూవీ లవర్స్‌కు మంచి ఛాయిస్.
సైబర్ క్రైమ్ థ్రిల్లర్ 'అచ్యుత అవతారం', హారర్ కామెడీ 'మహారాజా హాస్టల్'
అమెజాన్ ప్రైమ్ వీడియోలో సైబర్ మోసాల నేపథ్యంలో వచ్చిన 'అచ్యుత అవతారం' సినిమా మంచి ఆదరణ పొందుతోంది. కాసర్గోడ్ గ్రామీణ నేపథ్యంలో డిజిటల్ నేరాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి దర్శకుడు పునీత్ ఈ థ్రిల్లర్‌ను చెక్కారు. విశేషమేమిటంటే ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
{{/usCountry}}అమెజాన్ ప్రైమ్ వీడియోలో సైబర్ మోసాల నేపథ్యంలో వచ్చిన 'అచ్యుత అవతారం' సినిమా మంచి ఆదరణ పొందుతోంది. కాసర్గోడ్ గ్రామీణ నేపథ్యంలో డిజిటల్ నేరాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి దర్శకుడు పునీత్ ఈ థ్రిల్లర్‌ను చెక్కారు. విశేషమేమిటంటే ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
{{/usCountry}}హాస్టల్ లైఫ్, ఫ్రెండ్‌షిప్, దెయ్యాల భయాన్ని ఫన్నీగా చూపించే హారర్ కామెడీ 'మహారాజా హాస్టల్' కూడా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. అఖిల్ ఎన్ఆర్డీ, శరత్ బాబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా తెలుగు డబ్బింగ్ ఆడియోతో లభ్యమవుతుండటం మన ప్రేక్షకులకు ప్లస్ పాయింట్.
దాంపత్య బంధాల కథ 'వివాహ్', యూత్‌ఫుల్ సిరీస్ 'ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్'
నాలుగు వేర్వేరు జంటల జీవితాలు, వారి మధ్య ఉండే ఎమోషనల్ లోతుపాతుల ఆధారంగా తెరకెక్కిన 'వివాహ్' మూవీ సన్ నెక్ట్స్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది. బ్లెస్సన్ ఎల్సా దర్శకత్వం వహించిన ఈ డ్రామాలో ధ్యాన్ శ్రీనివాసన్, నైరా నిహార్ కీలక పాత్రలు పోషించారు.
సినిమా హీరో కావాలనుకునే ఒక కుర్రాడి కలలు, ఇంట్లో ఎదురయ్యే సవాళ్లను ఫన్నీగా చూపించే వెబ్ సిరీస్ 'ప్రిన్స్ ఆఫ్ మోలీవుడ్' జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దైన్ డెవిస్ ప్రధాన పాత్ర పోషించిన ఈ లైట్ హార్టెడ్ సిరీస్ తెలుగు సహా 7 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రముఖ దర్శకుడు నాదిర్షా రూపొందించిన రూరల్ ఫాంటసీ కామెడీ 'మ్యాజిక్ మష్రూమ్స్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ మంచి నవ్వులు పూయిస్తోంది.