OTT Movie Review: చిన్న యాక్సిడెంట్.. పెద్ద అపార్థం.. ఓటీటీలోకి ఈరోజు వచ్చిన మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

OTT Movie Review: ఓటీటీలోకి శుక్రవారం (అక్టోబర్ 16) అడుగుపెట్టిన మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆశా ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓ చిన్న ప్రమాదం, ఆ తర్వాత కలిగిన పెద్ద అపార్థం ఎలా ఇద్దరి మనుషుల జీవితాలను చిన్నాభిన్నం చేసిందో చెప్పిన సినిమా ఇది.

Published on: Oct 16, 2026, 18:05:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Movie Review: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి మరో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ డిజిటల్ స్క్రీన్‌పైకి దూసుకొచ్చింది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఆశా అనే ఈ సినిమా.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (Zee5)లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

OTT Movie Review: చిన్న యాక్సిడెంట్.. పెద్ద అపార్థం.. ఓటీటీలోకి ఈరోజు వచ్చిన మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
OTT Movie Review: చిన్న యాక్సిడెంట్.. పెద్ద అపార్థం.. ఓటీటీలోకి ఈరోజు వచ్చిన మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

లెజెండరీ నటి ఊర్వశి (Urvashi) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను సఫర్ సనల్ డైరెక్ట్ చేశారు. ఒక చిన్న యాక్సిడెంట్, పెద్ద అపార్థం, అనుకోని పరిణామాలు, తన కూతురి కోసం తీర్చుకునే ప్రతీకారం.. ఒక తల్లి జీవితాన్ని ఎంత దూరం తీసుకెళ్లాయనే కోణంలో ఈ సినిమా తెరకెక్కింది.

సినిమా ఆరంభం నుంచే ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తూ, ఊర్వశి నటనతో ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఆశా మూవీ విశేషాలు

మూవీ టైటిల్ : Aasha (ఆశా)

ఓటీటీ : Zee5 (జీ5)

డైరెక్టర్ : Safar Sanal (సఫర్ సనల్)

రన్‌టైమ్ : 2 గంటలు

నటీనటులు : ఊర్వశి, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, విజయ రాఘవన్

జానర్ : సస్పెన్స్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ

ఆశా మూవీ స్టోరీ ఏంటంటే?

ఈ ఆశా సినిమా కథ విషయానికి వస్తే.. మానసిక ఆందోళనతో బాధపడే భర్తను కోల్పోయిన ఆశా (ఊర్వశి) తన ఇద్దరు కూతుళ్లతో కలిసి జీవిస్తుంటుంది. ఒకరోజు రాత్రి ఊహించని రోడ్డు ప్రమాదం కారణంగా ఓ ట్రక్ డ్రైవర్ జీమోన్ (జోజు జార్జ్)తో ఆమెకు వివాదం చెలరేగుతుంది. స్థానికులు, పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పినప్పటికీ, ఆశా మాత్రం పట్టుబట్టి జీమోన్‌పై కేసు పెడుతుంది. కేసు వెనక్కి తీసుకోకపోతే బాగుండదని అతడు వార్నింగ్ ఇచ్చినా వినదు.

ఆ తర్వాత ఆమె రెండవ కూతురు అనఘ (ఐశ్వర్య లక్ష్మి) తల్లితో గొడవ జరిగి రాత్రికి రాత్రి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. కానీ ఆమె ఓ ప్రమాదంలో గాయపడిందని తెలిసి హాస్పిటల్ కు పరుగెత్తుకుంటూ వెళ్తుంది ఆశా. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే ఆ ఆస్పత్రికి తీసుకొచ్చింది అదే జీమోన్ అని తెలుస్తుంది. తన కూతురిపై లైంగిక దాడి జరిగిందని కూడా తెలుస్తుంది. దీంతో షాక్‌కు గురైన ఆశా.. తన కూతురికి జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. జీమోన్‌ను తన ఇంటికి రప్పించి బందీగా ఎలా మార్చింది? ఆ తర్వాత జరిగే ఊహించని పరిణామాలు ఏమిటనేదే ఈ చిత్ర కథాంశం.

ఊర్వశి నటనే హైలైట్

ఈ సినిమాలో ఆశా పాత్రలో నటించిన ఊర్వశి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. మానసికంగా బలహీనంగా కనిపించే ఒక తల్లిగా, ప్రతీకారంతో రగిలిపోయే మహిళగా ఆమె తన హావభావాలతో సినిమాను తన భుజాలపై మోశారు. మాటల్లో తడబాటు, భావోద్వేగాల మధ్య వేగంగా మారే ఆమె వైవిధ్యమైన నటన ప్రేక్షకులను నివ్వెరపరుస్తుంది. అలాగే జీమోన్ పాత్రలో జోజు జార్జ్ తన కళ్లలోని క్రూరత్వంతో, ఆ తర్వాత బందీగా మారిన తర్వాత పడే వేదనతో అద్భుతమైన నటన కనబరిచారు.

తల్లి ప్రేమకు, తనదైన డామినేటివ్ నేచర్‌కు మధ్య నలిగిపోయే కూతురి పాత్రలో ఐశ్వర్య లక్ష్మి చాలా పరిణతితో నటించారు. దర్శకుడు సఫర్ సనల్ సినిమా ప్రారంభం నుంచి సెకండ్ హాఫ్ వరకు ఉత్కంఠను బాగా మైంటైన్ చేసినప్పటికీ, క్లైమాక్స్ మాత్రం కొంత హడావుడిగా, అసంతృప్తిని మిగిలేలా ముగియడం చిన్న మైనస్‌గా చెప్పవచ్చు. అయినప్పటికీ ఊర్వశి అద్భుతమైన నటన కోసం ఈ వీకెండ్‌లో జీ5లో ఈ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More