OTT Thriller: విలక్షణ నటనకు మారుపేరైన బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి తనదైన మార్క్ పాత్రతో ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన హాలీవుడ్ మెడికల్ డ్రామా 'హౌస్' (House)కు భారతీయ రూపంగా తెరకెక్కిన 'డాక్టర్ హసన్' (Dr. Hassan) ఫస్ట్ టీజర్‌ను జియోహాట్‌స్టార్ (JioHotstar) తాజాగా విడుదల చేసింది.

అత్యంత క్లిష్టమైన వైద్య రహస్యాలను ఛేదించే ఒక విచిత్రమైన డాక్టర్ పాత్రలో నవాజుద్దీన్ నటన టీజర్లోనే ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ డిసెంబర్ 11, 2026 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. దియా మీర్జా ఇందులో కీలకపాత్రలో నటించింది.
'హౌస్' వెబ్ సిరీస్‌కు ఇండియన్ టచ్.. కథేంటంటే?
అంతర్జాతీయ స్థాయిలో ఐదు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులు, రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న 'హౌస్' వెబ్ సిరీస్‌లో హ్యూ లారీ పోషించిన 'డాక్టర్ గ్రెగొరీ హౌస్' పాత్రను ఇందులో నవాజుద్దీన్ పోషిస్తున్నారు. ఎన్బీసీ యూనివర్సల్ ఫార్మాట్స్ (NBCUniversal Formats) నుంచి అధికారిక లైసెన్స్ పొందిన బనిజయ్ ఏషియా సంస్థ ఈ సిరీస్‌ను భారతీయ నేటివిటీకి తగ్గట్టుగా నిర్మించింది.
డాక్టర్ హసన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) అరుదైన, ప్రాణాంతక వ్యాధులను గుర్తించడంలో దిట్ట. కానీ తోటి వైద్యులు, రోగులతో అతను ప్రవర్తించే తీరు మాత్రం ఎవరికీ అంతుచిక్కదు. కేవలం ఆసుపత్రి కేసులు మాత్రమే కాకుండా, భారతీయ కుటుంబ సంబంధాలు, చమత్కారమైన సంభాషణలు, వ్యక్తిగత సంఘర్షణల మేళవింపుతో దర్శకుడు రోహన్ సిప్పీ ఈ సిరీస్‌ను తీర్చిదిద్దారు.
నా చిన్ననాటి జ్ఞాపకాలే స్ఫూర్తి: నవాజుద్దీన్ సిద్ధిఖీ
ఈ పాత్ర గురించి నవాజుద్దీన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "నా చిన్నతనంలో మా ఊరిలోని క్లినిక్‌లు, డిస్పెన్సరీల చుట్టూ తిరిగేవాడిని. అక్కడ విచిత్రమైన వ్యక్తులు, పరిస్థితులు కనిపించేవి. 'డాక్టర్ హసన్' కథ చదివినప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అసాధారణ తెలివితేటలు ఉండి, ప్రపంచాన్ని తనదైన కోణంలో చూసే ఇలాంటి సంక్లిష్టమైన పాత్రలో నటించడం ఒక నటుడిగా నాకు ఎంతో తృప్తినిచ్చింది"* అని పేర్కొన్నారు.
డాక్టర్ హసన్ వెబ్ సిరీస్ విశేషాలు
{{/usCountry}}ఈ పాత్ర గురించి నవాజుద్దీన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "నా చిన్నతనంలో మా ఊరిలోని క్లినిక్‌లు, డిస్పెన్సరీల చుట్టూ తిరిగేవాడిని. అక్కడ విచిత్రమైన వ్యక్తులు, పరిస్థితులు కనిపించేవి. 'డాక్టర్ హసన్' కథ చదివినప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అసాధారణ తెలివితేటలు ఉండి, ప్రపంచాన్ని తనదైన కోణంలో చూసే ఇలాంటి సంక్లిష్టమైన పాత్రలో నటించడం ఒక నటుడిగా నాకు ఎంతో తృప్తినిచ్చింది"* అని పేర్కొన్నారు.
డాక్టర్ హసన్ వెబ్ సిరీస్ విశేషాలు
{{/usCountry}}ప్రపంచవ్యాప్తంగా 'హౌస్' వెబ్ సిరీస్‌కు ఇది మూడో అంతర్జాతీయ రీమేక్ కావడం విశేషం. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీతో పాటు ప్రముఖ నటి దియా మీర్జా (Dia Mirza), ఫైజల్ రషీద్, రెహ్మత్ రతన్, జేసన్ థామ్, స్మరణ్ సాను తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
వినయ్ ఛవాల్, కేతన్ పెడ్గావ్కర్ స్క్రిప్ట్ అందించగా, విరాట్ బసోయా సంభాషణలు రాశారు. అమెరికన్ ఒరిజినల్ (2004-2012) తరహాలోనే 'డాక్టర్ హసన్' కూడా భారతీయ ఓటీటీ ప్రేక్షకులకు ఒక సరికొత్త మెడికల్ థ్రిల్లర్ అనుభూతిని అందిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను డిసెంబర్ 11 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో చూడొచ్చు.