OTT Movies: ఈ ఉగాది వీకెండ్ తెలుగు, మలయాళం, కన్నడ, తమిళంలలో చూడాల్సిన టాప్ 6 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే

OTT Movies: ఓటీటీలో ఈ ఉగాది వీకెండ్ చూడటానికి చాలా సినిమాలు, వెబ్ సిరీస్ ఉన్నాయి. అయితే వీటిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలాంటి సౌత్ భాషల్లో అందుబాటులోకి వచ్చిన టాప్ 6 మూవీస్, వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Mar 17, 2026, 14:02:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ వారం సౌత్ ఓటీటీ స్పేస్‌లో తెలుగు రొమాంటిక్ డ్రామా నుండి మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్, తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ, కన్నడ రూరల్ డ్రామా వరకు రకరకాల సినిమాలు పలకరించబోతున్నాయి. ఐశ్వర్య అర్జున్ 'సీత పయనం'లో నటిస్తుంటే, కబీర్ దుహాన్ సింగ్ ‘కాసరగోడ్ ఎంబసీ’ అంటూ వస్తున్నాడు. ఇక దునియా విజయ్ ‘ల్యాండ్‌లార్డ్’కి కూడా ఈ వారమే వస్తోంది. మార్చి మూడో వారంలో జీ5, సన్ నెక్ట్స్, ఈటీవీ విన్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అవుతున్న లేటెస్ట్ సినిమాలపై ఓ లుక్కేయండి.

OTT Movies: ఈ ఉగాది వీకెండ్ తెలుగు, మలయాళం, కన్నడ, తమిళంలలో చూడాల్సిన టాప్ 6 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే
OTT Movies: ఈ ఉగాది వీకెండ్ తెలుగు, మలయాళం, కన్నడ, తమిళంలలో చూడాల్సిన టాప్ 6 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే

సుమతీ శతకం

స్ట్రీమింగ్ డేట్: మార్చి 19

ప్లాట్‌ఫామ్: ఈటీవీ విన్

బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి లీడ్ రోల్‌లో నటించిన ఈ తెలుగు సినిమా ఒక పల్లెటూరి కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. అతను ప్రేమించిన అమ్మాయికి ఊరి దేవత పూనకం వచ్చిందని గ్రామస్తులు నమ్ముతారు. ఈ మూఢనమ్మకాల వల్ల వాళ్ల పెళ్లి ప్లాన్స్ ఎలా ఆగిపోయాయి.. ఆ పాత నమ్మకాలకు, ఈ కుర్రాడి ప్రేమకు మధ్య జరిగిన పోరాటమే ఈ రూరల్ డ్రామా. మార్చి 19న ఉగాది రోజున ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

ఫోర్త్ ఫ్లోర్

స్ట్రీమింగ్ డేట్: మార్చి 20

ప్లాట్‌ఫామ్: సన్ నెక్ట్స్

ఫోర్త్ ఫ్లోర్ ఓ తమిళ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మార్చి 20 నుంచి సన్ నెక్ట్స్ లోకి రానుంది. తన మాజీ ప్రేయసిని తలచుకుంటూ ఓ గెస్ట్ హౌజ్ లో ఉండే హీరోకి ఊహించని కలలు వస్తాయి. అవి అతనితోపాటు ఆమె జీవితాన్ని ఎలా మార్చేశాయన్నదే ఈ మూవీ స్టోరీ.

సీతా పయనం

స్ట్రీమింగ్ డేట్: మార్చి 20

ప్లాట్‌ఫామ్: సన్ నెక్ట్స్

ఇదొక కన్నడ మూవీ. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన సీతని తన తండ్రే పెంచుతాడు. ఆమెకు అస్సలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఒక రోడ్ ట్రిప్‌లో అభిని కలిశాక ఆమె ఆలోచనలు ఎలా మారాయి అనేది ఈ కథ. నిరంజన్ సుధీంద్ర, ఐశ్వర్య అర్జున్ జంటగా నటించిన ఈ రోడ్ రొమాన్స్ డ్రామాను అర్జున్ సర్జా డైరెక్ట్ చేశాడు. వాలెంటైన్స్ డేకి థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి.

కాసరగోడ్ ఎంబసీ

స్ట్రీమింగ్ డేట్: మార్చి 20

ప్లాట్‌ఫామ్: జీ5 ఓటీటీ

ఇదొక మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. నకిలీ పాస్‌పోర్టులు తయారు చేసే ఒక ఇల్లీగల్ రాకెట్‌ను పట్టుకోవడానికి ఒక పోలీస్ టీమ్ చేసే ప్రయత్నమే ఈ కథ. అతీష్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ సిరీస్‌లో 'మార్కో' ఫేమ్ కబీర్ దుహాన్ సింగ్ మాఫియా డాన్‌గా కనిపిస్తున్నాడు. సుధీష్, దీపక్ పరంబోల్ లాంటి స్టార్స్ కూడా ఇందులో ఉన్నారు.

ల్యాండ్‌లార్డ్

స్ట్రీమింగ్ డేట్: మార్చి 19

ప్లాట్‌ఫామ్: జీ5 ఓటీటీ

ఒక క్రూరమైన భూస్వామి అరాచకాలను భరించలేక, రాచయ్య అనే సామాన్య పల్లెటూరి వ్యక్తి ఎదురుతిరిగి ఎలా పోరాడాడు అనేదే ఈ కన్నడ సినిమా కథ. దునియా విజయ్ రాచయ్యగా నటించగా.. రాజ్ బి శెట్టి, రచితా రామ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నిజానికి ఈ సినిమా లాస్ట్ వీక్ రావాల్సి ఉన్నా, వాయిదా పడి ఈ వారం వస్తోంది.

వలవారా

స్ట్రీమింగ్ డేట్: మార్చి 20

ప్లాట్‌ఫామ్: సన్ నెక్ట్స్

'నీలి హక్కి' తర్వాత పిల్లల ఎమోషన్స్ మీద వస్తున్న మరో కన్నడ సినిమా ఇది. సక్లేష్‌పురా గ్రామంలో ఉండే కుందేసి అనే అబ్బాయికి తన తండ్రి అంటే చాలా భయం. ఎందుకంటే తన తండ్రి ఎప్పుడూ తన తమ్ముడికే సపోర్ట్ చేస్తుంటాడు. ఈ 'కమింగ్ ఆఫ్ ఏజ్' సినిమాలో వేదిక్ కౌశల్, అభయ్ ఎస్ నటించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More