OTT Dhamaka: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇప్పుడు పర్సనల్ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌లను దాటి మన లివింగ్ రూమ్‌ల్లోని స్మార్ట్ టీవీలను టార్గెట్ చేస్తున్నాయి. ఆర్మాక్స్ మీడియా లేటెస్ట్ 'ఓటీటీ ఆడియన్స్ రిపోర్ట్ 2026' ప్రకారం ఇండియాలో కనెక్టెడ్ టీవీ (CTV) చూసే వారి సంఖ్య ఏకంగా 60 శాతం పెరిగి 206.9 మిలియన్లకు చేరింది. కుటుంబ సమేతంగా చూసే కంటెంట్ కోసమే సోనీ లివ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో కొత్త గేమ్‌ప్లాన్‌తో ముందుకు వస్తున్నాయి.
రోహిత్ శర్మతో సోనీ లివ్ కొత్త ధమాకా

ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు సెప్టెంబర్ 19 నుంచి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్, సోనీ లివ్‌లో 'ఫ్యామిలీ ఫుల్ హౌస్' అనే కొత్త గేమ్ షోతో టెలివిజన్ హోస్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ ఫ్యామిలీ గేమ్ షో బుల్లితెర ప్రేక్షకులతో పాటు ఓటీటీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుందని ప్లాట్‌ఫామ్ భావిస్తోంది.
ఇప్పటికే సోనీ లివ్‌లో వస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 18' వ్యూస్‌లో 60 శాతం, వాచ్ టైమ్‌లో 40 శాతం భారీ గ్రోత్ సాధించింది. విశేషమేమిటంటే ఈ కేబీసీ వ్యూయర్‌షిప్‌లో దాదాపు 60 శాతం కేవలం ఇంటర్నెట్ ఆధారిత స్మార్ట్ టీవీల నుంచే రావడం ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.
ఫ్యామిలీ కంటెంట్‌పై నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఫోకస్
మరోవైపు నెట్‌ఫ్లిక్స్ సైతం సెప్టెంబర్ 10న 'చుంబక్' అనే టీవీ స్టైల్ సీరియల్ కామెడీని లాంచ్ చేసింది. గతంలో 'కిచిడీ', 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్' వంటి సూపర్ హిట్ ఐకానిక్ షోలు అందించిన హ్యాట్సాఫ్ ప్రొడక్షన్స్ ఈ షోను రూపొందించింది.
అలాగే ప్రైమ్ వీడియో కూడా కొరియన్ డ్రామాలకు భారతీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వచ్చే రెండేళ్లలో 100కు పైగా కే-డ్రామాలను తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్ వర్షన్లలో తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది.
చిన్న నగరాల్లో ఓటీటీ జోరు.. ఆర్మాక్స్ షాకింగ్ గణాంకాలు
{{/usCountry}}అలాగే ప్రైమ్ వీడియో కూడా కొరియన్ డ్రామాలకు భారతీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వచ్చే రెండేళ్లలో 100కు పైగా కే-డ్రామాలను తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్ వర్షన్లలో తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది.
చిన్న నగరాల్లో ఓటీటీ జోరు.. ఆర్మాక్స్ షాకింగ్ గణాంకాలు
{{/usCountry}}ఆర్మాక్స్ మీడియా వ్యవస్థాపకుడు శైలేష్ కపూర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియాలో డిజిటల్ వీడియో ఆడియన్స్ సంఖ్య 664.9 మిలియన్లకు చేరింది. కేవలం యూట్యూబ్, సోషల్ మీడియా వీడియోలు మాత్రమే చూసే వారి సంఖ్యలో పెద్దగా పెరుగుదల లేదు. వారంతా క్రమంగా ఓటీటీ యాప్స్ వైపు షిఫ్ట్ అవుతున్నారు.
ప్రస్తుతం దేశంలో 44 చిన్న నగరాల్లో ఓటీటీ ఆడియన్స్ సంఖ్య మిలియన్ మార్కును దాటిపోయింది. దీంతో మెట్రో నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాల ఆడియన్స్‌కు నచ్చే లోకల్ కంటెంట్‌ను అందించడం ప్లాట్‌ఫారమ్స్‌కు కీలకంగా మారింది.
లివింగ్ రూమ్ అలవాట్లు.. జీ5 బిజినెస్ హెడ్ వ్యాఖ్యలు
జీ5 ఇండియా బిజినెస్ హెడ్ తేజ్‌కరన్ సింగ్ బజాజ్ మాట్లాడుతూ ఓటీటీ నెక్స్ట్ ఫేజ్ పూర్తిగా మారబోతోందని చెప్పారు. మొదటి దశ పర్సనల్ స్క్రీన్‌లపై వ్యక్తిగత ఛాయిస్ గురించి ఉంటే, రాబోయే రోజుల్లో ఒకే ఇంట్లో ఎక్కువ మంది కలిసి చూసే ఎంటర్‌టైన్‌మెంట్ ముఖ్యం కానుంది.
స్మార్ట్ టీవీల వల్ల సుదీర్ఘమైన వాచింగ్ సెషన్స్, ఫ్యామిలీ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ పెరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. అలాగే గత ఏడాదితో పోలిస్తే కే-డ్రామాలు 48 శాతం, యానిమ్ కంటెంట్ 32 శాతం ఆడియన్స్ గ్రోత్ సాధించినట్లు రిపోర్ట్ వెల్లడించింది.