ఓటీటీలోకి ప్రతి వారంలాగే ఈ వారం కూడా చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలకు సంబంధించిన కంటెంట్ ఉంది. వీటిలో రెండు నెలలుగా వేచి చూస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతోపాటు కామెడీ మూవీ ఫంకీ, ఎమోషనల్ డ్రామా నవాబ్ కేఫ్, ఆస్పిరెంట్స్ సీజన్ 3 వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి.
భర్త మహాశయులకు విజ్ఞప్తి - జీ5 ఓటీటీ

సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఎట్టకేలకు ఓటీటీ బాట పట్టింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎంటర్టైనర్ మార్చి 13 నుంచి జీ5 (ZEE5) లో స్ట్రీమింగ్ కానుంది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ ఇందులో హీరోయిన్లుగా నటించారు.
ఫంకీ - నెట్‌ఫ్లిక్స్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కాయదు లోహర్ జంటగా నటించిన కామెడీ డ్రామా 'ఫంకీ'. అనుదీప్ కేవీ మార్కు కామెడీతో వచ్చిన ఈ సినిమా కూడా మార్చి 13న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. థియేటర్లలో దీనికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
ఆస్పిరెంట్స్ సీజన్ 3 - ప్రైమ్ వీడియో
ప్రైమ్ వీడియో సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఆస్పిరెంట్స్ మూడో సీజన్ కూడా ఈవారమే వస్తోంది. యూపీఎస్సీ అభ్యర్థుల జీవితాల నేపథ్యంలో సాగే ఈ పాపులర్ సిరీస్ కొత్త సీజన్ మార్చి 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈసారి కథ ఐఏఎస్ ఆఫీసర్‌గా అభిలాష్ ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ తిరుగుతుంది. ఈ హిందీ సిరీస్ తెలుగులోనూ అందుబాటులో ఉండటం విశేషం.
నవాబ్ కేఫ్ - ఈటీవీ విన్
శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని నటించిన మూవీ ‘నవాబ్ కేఫ్’. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ సినిమా మార్చి 12 నుంచి ఈటీవీ విన్లో సందడి చేయనుంది. ఇదొక మంచి ఎమోనషల్ డ్రామా.
పూకీ / బూకీ - జీ5 ఓటీటీ
{{/usCountry}}శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని నటించిన మూవీ ‘నవాబ్ కేఫ్’. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ సినిమా మార్చి 12 నుంచి ఈటీవీ విన్లో సందడి చేయనుంది. ఇదొక మంచి ఎమోనషల్ డ్రామా.
పూకీ / బూకీ - జీ5 ఓటీటీ
{{/usCountry}}తమిళ రొమాంటిక్ డ్రామా 'పూకీ' మార్చి 13న జీ5లో విడుదల కానుంది. దీని తెలుగు వెర్షన్ 'బూకీ' పేరుతో అదే రోజున స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో లక్ష్మీ మంచు ఓ కీలకపాత్రలో నటించింది.
రిసార్ట్ - జియోహాట్‌స్టార్
విజయ్ కుమార్ రాజేంద్రన్ సృష్టించిన కామెడీ వెబ్ సిరీస్ 'రిసార్ట్'. విహారయాత్రకు వెళ్లే ప్రదేశంలో జరిగే వినోదాత్మక సంఘటనల సమాహారంగా సాగే ఈ వెబ్ సిరీస్ మార్చి 13 నుంచి జియోహాట్‌స్టార్‌లో తెలుగులోనూ లభిస్తుంది.
సంకల్ప్ - అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్
వైవిధ్య నటుడు నానా పటేకర్ తొలిసారిగా ఓటీటీ బాట పట్టాడు. అతడు నటించిన సోషియో-పొలిటికల్ థ్రిల్లర్ 'సంకల్ప్' మార్చి 11 నుంచి అమెజాన్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్ (Amazon MX Player) లో స్ట్రీమింగ్ కానుంది. ప్రకాష్ ఝా దర్శకత్వంలో హిందీలో రూపొందిన ఈ సిరీస్ ప్రస్తుతానికి తెలుగులో రావడం లేదు.
మేడ్ ఇన్ కొరియా - నెట్‌ఫ్లిక్స్
స్టార్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్న వెబ్ మూవీ 'మేడ్ ఇన్ కొరియా'. ఆర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మార్చి 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. విశేషమేమిటంటే ఇది తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రానుంది.
ద తాజ్ స్టోరీ - లయన్స్‌గేట్‌ప్లే
వివాదాస్పద అంశాలతో తెరకెక్కిన హిందీ మూవీ 'ద తాజ్ స్టోరీ'. పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 13న లయన్స్‌గేట్ ప్లేలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
జూటోపియా 2 - జియోహాట్‌స్టార్
హాలీవుడ్ ఆల్ టైమ్ హిట్ యానిమేటెడ్ మూవీ 'జూటోపియా 2' ఇండియన్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. మార్చి 13 నుంచి జియో హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ఇది అందుబాటులోకి వస్తుంది.