OTT Release: ఒకే ఓటీటీలోకి ఒకే రోజు తమిళ క్రైమ్ థ్రిల్లర్, మలయాళ సూపర్ హీరో సినిమాలు.. వీకెండ్ పండగే
OTT Release Movies This Week: ఈవారం ఒకే ఓటీటీలోకి ఒకే రోజు రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తున్నాయి. వీటిలో ఒకటి తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కాగా.. మరొకటి మలయాళ సూపర్ హీరో సినిమా కావడం విశేషం. అవేంటో చూడండి.
OTT Release This Week: ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు సరికొత్త డిజిటల్ వినోదాన్ని పంచడానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్స్ట్' (Sun NXT) సిద్ధమైంది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ అప్‌డేట్స్‌తో డిజిటల్ ఆడియన్స్ లో సన్ నెక్స్ట్ భారీ అంచనాలు పెంచేసింది.

జూన్ 26న (ఈ శుక్రవారం) ఒకే రోజున రెండు విభిన్నమైన జోనర్లకు చెందిన సినిమాలను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. అందులో ఒకటి కిడ్స్ అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తున్న మలయాళ సూపర్ హీరో డ్రామెడీ కాగా.. మరొకటి సీట్ ఎడ్జ్ సస్పెన్స్ క్రియేట్ చేసే తమిళ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం.
రివాల్వర్ రింకో - సరికొత్త సూపర్ హీరో మ్యాజిక్
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న ఒక సరికొత్త వినూత్నమైన మూవీ 'రివాల్వర్ రింకో'. గతంలో వచ్చిన 'మిన్నల్ మురళి' లాంటి కల్ట్ సూపర్ హీరో సినిమా ఫ్లేవర్ తో, ఒక సినిమా లోపల సినిమా, ఫిల్మ్ మేకింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ డ్రామెడీ మూవీని తెరకెక్కించారు.
పిల్లలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసి చూసేలా ఎంతో ఫన్నీగా ఈ సినిమాను రూపొందించారు. "లాక్.. లోడ్.. వాచ్.. మీ కొత్త సూపర్ హీరో మూవీ లోడింగ్ అవుతోంది" అంటూ సన్ నెక్స్ట్ ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసింది. జూన్ 26 నుంచి ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది.
మూండ్రమ్ కణ్ (Moondram Kan)
సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్ కోసం వస్తున్న తమిళ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'మూండ్రమ్ కణ్'. ఇంతకీ హత్య చేసింది ఎవరు? అనే ఒక పవర్‌ఫుల్ క్యాప్షన్ తో ఈ సీజన్ లోనే మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ డ్రామాగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఒక హత్య, నలుగురు అనుమానితులు అంటూ మూవీపై అంచనాలు పెంచేస్తున్నారు. దీనికి ఐఎండీబీలోనూ 7.3 రేటింగ్ ఉంది.
ఒక మిస్టరీ పోలీస్ కేస్ దర్యాప్తు చుట్టూ తిరిగే ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ లో దిలీపన్, తేజు అశ్విని, విధార్త్, త్రిగుణ్ కీలక పాత్రలు పోషించారు. ఒక నిందితుడి అరెస్ట్ చుట్టూ నడిచే పొలిటికల్ అండ్ పోలీస్ డ్రామా ఎలిమెంట్స్ ఈ మూవీలో హైలైట్ గా ఉండబోతున్నట్లు ట్రైలర్ హింట్ ఇస్తోంది. జూన్ 26 నుంచి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎక్స్‌క్లూజివ్‌గా సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానుంది.
వీకెండ్ లో ఇంట్లోనే ఉంటూ మంచి కంటెంట్ చూడాలనుకునే వాళ్లకు ఈ రెండు ఆప్షన్స్ పర్ఫెక్ట్ ఛాయిస్ గా మారబోతున్నాయి. పిల్లల కోసం 'రివాల్వర్ రింకో', సస్పెన్స్ మైండ్ గేమ్స్ ఇష్టపడే వాళ్ల కోసం 'మూండ్రమ్ కణ్' థ్రిల్లర్ మూవీ అందుబాటులోకి రానున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


