...
...
Next Story

Friday OTT Releases: థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి జీ5 వరకు.. ఈ శుక్రవారం ఓటీటీలోకి వస్తున్న టాప్ 9

Friday OTT Releases: ఈ శుక్రవారం అంటే సెప్టెంబర్ 11న ఓటీటీలోకి ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. అయితే వీటిలో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 9 ఏవో ఇక్కడ తెలుసుకోండి. థ్రిల్లర్ నుంచి కామెడీ వరకూ అన్ని జానర్ల కంటెంట్ ఇందులో ఉంది.

Published on: Sep 10, 2026, 15:41:53 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Friday OTT Releases: ఈ లాంగ్ వీకెండ్ థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే చిల్ అవ్వాలనుకునే మూవీ లవర్స్ కోసం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ గ్రాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, జియోహాట్‌స్టార్‌లలో ఈ శుక్రవారం ఏకంగా 7 సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయాయి.

Friday OTT Releases: థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి జీ5 వరకు.. ఈ శుక్రవారం ఓటీటీలోకి వస్తున్న టాప్ 9
Friday OTT Releases: థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి జీ5 వరకు.. ఈ శుక్రవారం ఓటీటీలోకి వస్తున్న టాప్ 9

యాక్షన్, థ్రిల్లర్, డార్క్ కామెడీ, హిస్టారికల్ డ్రామా నుంచి పవర్ ఫుల్ రివేంజ్ స్టోరీల వరకు ప్రతీ జానర్ ప్రేక్షకులనూ అలరించేలా ఈ వారం కంటెంట్ డిజైన్ అయింది. ఈ శుక్రవారం మీ స్క్రీన్లను షేక్ చేయబోతున్న ఆ 7 బిగ్ రిలీజ్‌ల వివరాలు చూద్దాం.

1. ఘమాసాన్ (Ghamasaan) - జీ5 (ZEE5)

బుందేల్‌ఖండ్ దట్టమైన అటవీ ప్రాంతాల నేపధ్యంలో సాగే రా అండ్ రస్టిక్ మ్యాన్‌హంట్ డ్రామా ఇది. బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అర్షద్ వార్సీ ఖూంఖార్ దొంగ 'మహారాజ్' పాత్రలో కనిపించగా, 'స్కామ్ 1992' ఫేమ్ ప్రతీక్ గాంధీ ఎస్టీఎఫ్ ఆఫీసర్ ఆదిత్యగా నటిస్తున్నారు.

చదరంగం లాంటి మైండ్ గేమ్‌తో సాగే ఈ క్యాట్ అండ్ మౌస్ ఛేజింగ్‌లో పొలిటికల్ కరప్షన్, పవర్ పాలిటిక్స్ మెయిన్ పాయింట్‌గా నిలిచాయి. ఇంటెన్స్ యాక్షన్ లవర్స్ ఈ మూవీని అస్సలు మిస్ అవ్వలేరు.

2. ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ (Prince of Mollywood) - జియోహాట్‌స్టార్

మలయాళ చిత్ర పరిశ్రమ నేపథ్యంలో తెరకెక్కిన లైట్ హార్టెడ్ కామెడీ డ్రామా ఇది. సినిమాలో ఎలాగైనా స్టార్‌గా మారాలని కలలు కనే ఫిరోజ్ (డాన్ డేవిస్) అనే యంగ్ కుర్రాడి ప్రయాణమే ఈ సిరీస్ ప్రధాన కథ.

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో సాయుధ పోరాటం చేసిన నలుగురు యువ యోధుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ పీరియాడిక్ డ్రామా రూపొందింది. ప్రముఖ యూట్యూబర్, నటుడు భువన్ బామ్ (రాస్ బిహారీ బోస్), ప్రతిభా రంతా (ప్రతిభా లాహిరి), రోహిత్ సరాఫ్, గుర్ ఫతే పీర్జాదా ప్రధాన పాత్రల్లో నటించారు.

గాంధేయ మార్గానికి భిన్నంగా బెంగాల్, పంజాబ్ ప్రాంతాల్లో బ్రిటిష్ పాలకులపై వీరు సాగించిన వీరోచిత తిరుగుబాటు, ఆయుధ పోరాటాలు యూత్‌కు రోమాంచితమైన అనుభూతిని అందిస్తాయి.

4. గో టీమ్! (Go Team!) - నెట్‌ఫ్లిక్స్

ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఒక చీజ్ తయారీ కంపెనీ ఉద్యోగుల మధ్య సాగే స్పానిష్ డార్క్ కామెడీ ఫిల్మ్ ఇది. కంపెనీ ప్రమోషన్ కోసం టీమ్ బిల్డింగ్ రిట్రీట్‌కు ఒక మారుమూల గ్రామానికి వెళ్లిన సిబ్బందికి, అక్కడ భారీ లేఆఫ్స్ గురించిన వార్త తెలుస్తుంది.

దాంతో ప్రశాంతంగా ఉన్న ట్రిప్ కాస్తా ఆఫీస్ పాలిటిక్స్, కొట్టుకునే స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుత కార్పొరేట్ కల్చర్‌పై సెటైరికల్‌గా సాగే కాన్సెప్ట్ ఇది.

5. స్టోలెన్ హార్ట్‌బీట్స్ (Stolen Heartbeats) - నెట్‌ఫ్లిక్స్

ఒక దారుణమైన దాడి తర్వాత కోమాలోకి వెళ్లిన అనాబెల్ (రామీ హేరేరా) అనే అమ్మాయి చుట్టూ తిరిగే సూపర్‌నేచురల్ మిస్టరీ థ్రిల్లర్. కోమాలో ఉన్న ఆమెకు ఆత్మలతో మాట్లాడే అరుదైన శక్తులున్న కేర్‌టేకర్ రాఫెల్ (జెరోనిమో క్యాంటిల్లో) తోడుగా నిలుస్తాడు.

ఆత్మల సహాయంతో అనాబెల్‌పై దాడి చేసిన క్రిమినల్స్ ఎవరో రాఫెల్ ఎలా కనుక్కున్నాడనేది థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో తెరకెక్కించారు.

6. అలీ బాబా విత్ 40 భూత్ (Ali Baba aur 40 Bhoot) - జియోహాట్‌స్టార్

క్లాసిక్ అలీబాబా 40 దొంగల కథకు విభిన్నమైన సూపర్‌నేచురల్ ట్విస్ట్ ఇస్తూ రూపొందించిన సిరీస్ ఇది. న్యూరోసైకాలజీ ఎక్స్‌పర్ట్ అలీషా 'అలీ' నిగమ్ (ఆషా నేగి) తన మిస్సింగ్ ఫాదర్ కోసం వెతుకుతూ ఒక రహస్య ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది.

పోలీస్ ఆఫీసర్ బాబా (విశాల్ వశిష్ట్)తో కలిసి 40 భయంకరమైన ఆత్మల నడుమ దాగి ఉన్న రహస్యాలను ఛేదించడం ఆకట్టుకుంటుంది. షేన్ నిగమ్, అభయ్ మహాజన్ ముఖ్య పాత్రలు పోషించారు.

7. విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath & Sons) - నెట్‌ఫ్లిక్స్

తమిళ స్టార్ హీరో సూర్య, వైవిధ్యమైన నటి మమితా బైజు కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఆగస్టు 14న బిగ్ స్క్రీన్ పై రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ క్లాసిక్ ఫ్యామిలీ డ్రామా సెప్టెంబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తోంది. వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి హాయిగా ఎంజాయ్ చేసేందుకు ఇది బెస్ట్ ఛాయిస్.

8. పంచనామా వెబ్ సిరీస్ (Panchanama) - జీ5 ఓటీటీ

తెలుగులో వస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పంచనామా. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సీనియర్ నటుడు భరత్ శ్రీనివాసన్ లీడ్ రోల్లో నటించాడు. ముగ్గురు స్నేహితుల హత్య, రెండు చేతులు పోలీసుల కంటపడటం చుట్టూ ఈ సిరీ్ తిరుగుతుంది.

9. వరువు (Varavu) - జీ5

మలయాళ థ్రిల్లర్ మూవీ వరవు కూడా ఈ శుక్రవారమే ఓటీటీలోకి వస్తోంది. జీ5 ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. సొంతూరికి తిరిగొచ్చిన తర్వాత అక్కడి పగలు, ప్రతీకారాల మధ్య చిక్కుకునే హీరో (జోజు జార్జ్) చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks