...
...
Next Story

OTT Releases: ఓటీటీలోకి ఈవారం వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్.. పెద్ది సహా రెండు మలయాళం మూవీస్

OTT Releases: ఓటీటీలోకి ఈవారం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తున్నాయి. వీటిలో రామ్ చరణ్ పెద్ది ఎంతో ఆసక్తి రేపుతుండగా.. రెండు మలయాళం, ఒక హిందీ మూవీ కూడా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

Published on: Jul 6, 2026, 17:01:46 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Releases: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఊర మాస్ క్యారెక్టర్‌తో డిజిటల్ స్క్రీన్స్‌ను షేక్ చేయడానికి నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్నాడు. ఈవారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్నీ సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, సోనీ లివ్ లాంటి దిగ్గజ ఓటీటీ యాప్స్ లోకి ఈ వారం రాబోతున్న కంప్లీట్ లిస్ట్ మీద ఒక లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌లోకి పెద్ది

OTT Releases: ఓటీటీలోకి ఈవారం వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్.. పెద్ది సహా రెండు మలయాళం మూవీస్
OTT Releases: ఓటీటీలోకి ఈవారం వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్.. పెద్ది సహా రెండు మలయాళం మూవీస్

రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ హీరోయిన్ గా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు లాంటి సీనియర్ స్టార్స్ తో తెరకెక్కిన 'పెద్ది' (Peddi) మూవీ జులై 9న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

1990ల నాటి ఏపీ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో.. ఒక సాధారణ చెరకు తోట కూలీ స్పోర్ట్స్ ద్వారా తన కమ్యూనిటీ గౌరవం కోసం ఎలా పోరాడాడు అనేది గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మనుగడ కోసం ఒక మారుమూల గ్రామం చేసే పోరాటం ఇందులో మెయిన్ హైలైట్.

ఈవారం ఓటీటీ రిలీజ్ లిస్ట్ ఇలా

* పెద్ది | నెట్‌ఫ్లిక్స్ | జులై 9

* ఇక్కా | నెట్‌ఫ్లిక్స్| జులై 10

* బాల్టీ | సోనీలివ్ | జులై 10

* పరిమళ్ అండ్ కో | జీ5 | జులై 10

* ఐ యామ్ నాట్ అఫ్రైడ్ | నెట్‌ఫ్లిక్స్ | జులై 8

* ట్రైయింగ్ సీజన్ 5 | ఆపిల్ టీవీ ప్లస్ | జులై 8

* ది వెస్టీస్ | ప్రైమ్ వీడియో | జులై 12

సన్నీ డియోల్ లీగల్ థ్రిల్లర్ 'ఇక్కా'

'గదర్ 2' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ చేసిన ఇంటెన్స్ లీగల్ డ్రామా 'ఇక్కా' (Ikka) జులై 10న నెట్‌ఫ్లిక్స్‌లో ల్యాండ్ అవుతోంది. సన్నీ డియోల్ కు జోడీగా అక్షయ్ ఖన్నా, దియా మీర్జా నటించిన ఈ మూవీలో ఒక మర్డర్ కేసు వెనుక ఉన్న మిస్టరీని సాల్వ్ చేసే లాయర్ అర్జున్ మెహ్రా కథను చూపించారు. తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి, అలాగే ఈ జటిలమైన కేసు గెలవడానికి ఆ లాయర్ ఎంచుకున్న లీగల్, ఇల్లీగల్ దారులు ఆడియన్స్ మైండ్ బ్లాంక్ చేస్తాయి.

సోనీ లివ్ లో కబడ్డీ యాక్షన్ 'బాల్టీ'

మలయాళ నాచురల్ యాక్టర్ షేన్ నిగమ్ నటించిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా 'బాల్టీ' (Balti) జులై 10 నుంచి సోనీ లివ్ లో అందుబాటులోకి వస్తోంది. ఒక కసాయివాడు, ప్యాషనేట్ కబడ్డీ ప్లేయర్ అయిన హీరో.. అప్పులు ఇచ్చి ప్రాణాలు తీసే లోకల్ రౌడీలతో ఎలా పెట్టుకున్నాడనేది ఈ మూవీ స్టోరీ. రియల్ లైఫ్ లో తమ కబడ్డీ స్కిల్స్ వాడి హీరో అండ్ గ్యాంగ్ ఎలా సర్వైవ్ అయ్యారనే పాయింట్ చాలా రస్టిక్ గా ఉంటుంది.

కామెడీతో కడుపుబ్బా నవ్వించే 'పరిమళ్ అండ్ కో'

సీనియర్ యాక్టర్స్ జయరామ్, ఊర్వశి, యోగి బాబు లాంటి భారీ తారాగణంతో వస్తున్న క్రేజీ క్రైమ్ కామెడీ 'పరిమళ్ అండ్ కో' జులై 10న జీ5 లో స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఒక లోకల్ రౌడీ వాళ్ల కూతురిని వేధించి సడెన్ గా హత్యకు గురవుతాడు. ఆ హత్య కేసులో ఈ ఎక్సెంట్రిక్ ఫ్యామిలీ ఎలా ఇరుక్కుంది, అసలు మర్డర్ చేసింది ఎవరు అనేది హిలేరియస్ గా, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.

హాలీవుడ్ అండ్ ఇంగ్లీష్ సిరీస్ లతో ఫుల్ ట్రీట్

ఈ భారీ ప్రాజెక్ట్స్ తో పాటు నెట్‌ఫ్లిక్స్ లో జులై 8న మరో రెండు ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ల్యాండ్ అవుతున్నాయి. 10 ఏళ్ల పిల్లాడి కళ్లతో సొసైటీలోని దారుణమైన నిజాలను, సర్వైవల్ పోరాటాన్ని చూపించే 'ఐ యామ్ నాట్ అఫ్రైడ్' (I am not Afraid) మూవీ ఆడియన్స్ కు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

అలాగే ప్రాణాపాయంలో ఉన్న కొడుకును కాపాడుకోవడానికి, డోనర్ ను వెతికే క్రమంలో ఒక తల్లి చేసే పోరాటం 'నథింగ్ టు లూజ్' (Nothing To Lose) మిమ్మల్ని కంటతడి పెట్టిస్తుంది.

ఇక యాపిల్ టీవీ ప్లస్‌లో ఫ్యామిలీ కామెడీ సిరీస్ 'ట్రయింగ్ సీజన్ 5' జులై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నిక్కీ, జాసన్ ల లైఫ్ లోకి బయలాజికల్ మదర్ క్యాట్ రీ ఎంట్రీ ఇవ్వడంతో స్టార్ట్ అయ్యే కన్ఫ్యూజన్ ఇందులో హైలైట్.

చివరగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 1980ల నాటి హెల్స్ కిచెన్ లో క్రైమ్ గ్యాంగ్స్, ఇటాలియన్ మాఫియా మధ్య జరిగిన ఫైట్ బ్యాక్ డ్రాప్ లో 'ది వెస్టీస్' (The Westies) జులై 12న రెండు ఎపిసోడ్స్ తో లాంచ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks