OTT Horror: ఓటీటీలోకి ఈవారం అనుకోకుండా వస్తున్న తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ త్రికాల. ప్రముఖ నటి శ్రద్ధా దాస్ నటించిన ఈ సినిమా మే 28న థియేటర్లలో రిలీజ్ కాగా.. సుమారు 40 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. సన్ నెక్ట్స్ ఓటీటీ గురువారం (జులై 9) నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది.
ప్రతి క్షణం కొత్త రహస్యం

త్రికాల స్ట్రీమింగ్ విషయాన్ని ఓ చిన్న వీడియో ద్వారా సన్ నెక్ట్స్ ఓటీటీ వెల్లడించింది. “ప్రతి క్షణం ఓ కొత్త రహస్యం వెలుగు చూస్తుంది. త్రికాల కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? త్రికాల: ది స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ మూవీని రేపటి నుంచి సన్ నెక్ట్స్ లో చూడండి” అనే క్యాప్షన్ తో సినిమా డిజిటల్ ప్రీమియర్ విషయాన్ని రివీల్ చేసింది.
ఓ సైకియాట్రిస్ట్ గా తాను చూసిన టిపికల్ కేసు ఇది అని శ్రద్ధా దాస్ చెప్పే డైలాగుతో ఈ వీడియో మొదలైంది. తర్వాత అమ్మావారికి కట్టిన ముడుపుల్లో నుంచి రక్తం రావడం, ఆ కోరికలు కోరిన వాళ్లు చనిపోవడంలాంటివి చూపిస్తారు. ఇదంతా మూవీపై ఉన్న ఆసక్తిని మరింత పెంచుతాయి.
త్రికాల మూవీ స్టోరీ ఏంటంటే?
త్రికాల: ఎ స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ మూవీ మే 28న థియేటర్లలో రిలీజైంది. ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్ధా దాస్ ఓ సైకియాట్రిస్ట్ పాత్రలో నటించింది. ఈ సినిమాకు డైరెక్టర్ మణి తెల్లగూటి దర్శకత్వం వహించారు. హీరో మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని, సాహితి అవాంచ, నంద దొరై, రోబో శంకర్, రౌడీ రోహిణి (జబర్దస్త్) తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఈ సస్పెన్స్ డ్రామా కథ అంతా కుమారి ఖండం అనే పౌరాణిక ప్రదేశం బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ అవుతుంది. ప్రాచీన కాలంలో ఋషులు దాచిపెట్టిన రహస్య గ్రంథాలు, చీకటి శక్తుల చుట్టూ ఈ స్టోరీని డిజైన్ చేశారు. కలియుగంలో మళ్లీ రాక్షస శక్తులు పుట్టుకొచ్చినప్పుడు, దేవుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారం ఆ చీకటి శక్తులను అంతం చేయడానికి హీరో ఎలా పోరాడాడు అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, క్షుద్ర పూజలు లాంటి ఎలిమెంట్స్ తో ఆడియన్స్ కు వెన్నులో వణుకు పుట్టించడం గ్యారెంటీ.
త్రికాల మూవీ హైలైట్స్
{{/usCountry}}ఈ సస్పెన్స్ డ్రామా కథ అంతా కుమారి ఖండం అనే పౌరాణిక ప్రదేశం బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ అవుతుంది. ప్రాచీన కాలంలో ఋషులు దాచిపెట్టిన రహస్య గ్రంథాలు, చీకటి శక్తుల చుట్టూ ఈ స్టోరీని డిజైన్ చేశారు. కలియుగంలో మళ్లీ రాక్షస శక్తులు పుట్టుకొచ్చినప్పుడు, దేవుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారం ఆ చీకటి శక్తులను అంతం చేయడానికి హీరో ఎలా పోరాడాడు అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, క్షుద్ర పూజలు లాంటి ఎలిమెంట్స్ తో ఆడియన్స్ కు వెన్నులో వణుకు పుట్టించడం గ్యారెంటీ.
త్రికాల మూవీ హైలైట్స్
{{/usCountry}}ఈ సినిమాకు ప్రధాన బలం దీని విలక్షణమైన కాన్సెప్ట్. కర్మ సిద్ధాంతాన్ని కేవలం మాటల్లో చెప్పకుండా పాత్రల పునర్జన్మలు, వారి మానసిక సంఘర్షణల ద్వారా దర్శకుడు చూపించిన తీరు అద్భుతంగా ఉంది. వైతరణ్ పాత్రలో నటుడు అజయ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సూర్యకాంతిని చూడలేని ఒక మనిషిలోని భయం, అంతర్మథనాన్ని ఆయన కళ్లలోనే పలికించారు.
ఆయన కోసం డిజైన్ చేసిన మాస్క్‌లు, కాస్ట్యూమ్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ఇక హీరోగా మాస్టర్ మహేంద్రన్ అమాయకత్వం, ప్రేమ, భయం వంటి నవరసాలను చాలా సహజంగా పండించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన నటన హృదయాలను కదిలిస్తుంది.
సైకియాట్రిస్ట్ మాయ పాత్రలో శ్రద్ధా దాస్ గ్లామర్‌కు దూరంగా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో ఒదిగిపోయారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఒక ప్రత్యేకమైన డార్క్ టోన్‌ను తీసుకొచ్చింది. సీనియర్ హీరోయిన్ ఆమని తల్లిగా, భయంతో కూడిన భావోద్వేగాలను తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయి ఉంటే గురువారం (జులై 9) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో చూసేయండి.