...
...
Next Story

OTT Release: ఓటీటీలోకి ఈవారమే రూ.465 కోట్ల బ్లాక్‌బస్టర్.. రెండు ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు.. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

OTT Release: ఈవారం ఓటీటీలోకి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తున్నాయి. అందులో రూ.465 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ కూడా ఉంది. దీంతోపాటు రెండు ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు, ఓ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా ఆసక్తి రేపుతున్నాయి.

Published on: Mar 16, 2026, 10:41:37 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీలోకి ఈవారం అంటే మార్చి 16 నుండి 22 వరకు రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను ఇక్కడ ఇస్తున్నాం. వీటిలో 1971 ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే బోర్డర్ 2 మూవీ ఆసక్తి రేపుతోంది. ఇదే కాకుండా మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్, షోలు ఆకట్టుకోనున్నాయి.

బోర్డర్ 2 (Border 2) - మార్చి 20 (నెట్‌ఫ్లిక్స్)

OTT Release: ఓటీటీలోకి ఈవారమే రూ.465 కోట్ల బ్లాక్‌బస్టర్.. రెండు ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు.. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
OTT Release: ఓటీటీలోకి ఈవారమే రూ.465 కోట్ల బ్లాక్‌బస్టర్.. రెండు ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు.. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

ఈ ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజై సంచలన విజయం సాధించిన బోర్డర్ 2 మూవీ సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. 1971 ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చేసిన సాహసాలను చూపిస్తుంది. లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ కాలర్ (సన్నీ డియోల్) నేతృత్వంలో మహేంద్ర సింగ్ రావత్ (అహాన్ శెట్టి), నిర్మల్ జిత్ సింగ్ సెఖాన్ (దిల్‌జిత్ దోసాంజ్), మేజర్ హోషియార్ సింగ్ దహియా (వరుణ్ ధావన్) చేసిన పోరాటమే ఈ కథ.

సుమతీ శతకం - ఈటీవీ విన్

ప్రముఖ నటుడు అమర్‌దీప్ చౌదరి ప్రధాన పాత్రలో నటించిన 'సుమతీ శతకం' ఒక స్వచ్ఛమైన గ్రామీణ ప్రేమకథా చిత్రం. ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో రూపొందిన సినిమా మార్చి 19 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కృష్ణ, సుమతి మధ్య సాగే ప్రేమకథ ఇది. అయితే గ్రామంలో ఉండే మూఢనమ్మకాల కారణంగా స్థానిక దేవత 'అమ్మవారు' సుమతికి పూనారని గ్రామస్థులు నమ్ముతారు. ఊరి ప్రజలందరూ ఆందోళనలో ఉండగా.. తన పెళ్లిని జరిపించుకోవడానికి కృష్ణ ఏం చేశాడన్నదే ఈ మూవీ స్టోరీ.

జటాధర – మార్చి 20 (జీ5)

2000వ దశకం చివరలో జరిగే క్రైమ్ కథాంశంతో దర్శకుడు అతీష్ ఎం. నాయర్ తెరకెక్కించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'కాసరగోడ్ ఎంబసీ'. ఈ వెబ్ సిరీస్ మార్చి 20 నుండి జీ5 (ZEE5) లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ చెమ్ము, అజి అనే ఇద్దరు కజిన్స్ జీవితాల చుట్టూ తిరుగుతుంది. నకిలీ పాస్‌పోర్టులు, సర్టిఫికెట్లను తయారు చేసే వీళ్ల జీవితాలు ఎలా మారనున్నాయన్నదే ఈ సిరీస్ కథ.

చిరయ్య (Chiraiya) - మార్చి 20 (జియో హాట్‌స్టార్)

ఈ చిరయ్య ఓ హిందీ వెబ్ సిరీస్. సాంప్రదాయ భారతీయ కుటుంబాల్లో 'మారిటల్ రేప్' (వైవాహిక అత్యాచారం) అనే నిషిద్ధ అంశంపై సాగే సామాజిక డ్రామా. తన ఆడపడుచు తన భర్త వల్ల లైంగిక వేధింపులకు గురవుతోందని తెలుసుకున్న కమలేష్ (దివ్య దత్తా).. కుటుంబ గౌరవాన్ని కాపాడాలా లేదా న్యాయం వైపు నిలబడాలా అనే సందిగ్ధాన్ని ఈ వెబ్ సిరీస్ చూపనుంది.

జాజ్ సిటీ – మార్చి 19 (సోనీ లివ్ ఓటీటీ)

దర్శకుడు సౌమిక్ సేన్ తెరకెక్కించిన 'జాజ్ సిటీ' ఒక చారిత్రాత్మక మ్యూజికల్ స్పై థ్రిల్లర్. 1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం నేపథ్యంలో కలకత్తా నగరంలో ఈ కథ సాగుతుంది. మార్చి 19 నుంచి సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు. ఒక దేశం ఏర్పడటంలో భాష, కళలు ఎంతటి శక్తివంతమైన పాత్ర పోషించాయో ఈ మూవీ చూపిస్తుంది.

ల్యాండ్‌లార్డ్ – మార్చి 19 (జీ5 ఓటీటీ)

ఇదో కన్నడ మూవీ. 1980ల నాటి కర్ణాటక గ్రామీణ నేపథ్యంలో సాగే సామాజిక పోరాట సినిమా 'ల్యాండ్‌లార్డ్'. ఇందులో దునియా విజయ్ రాచయ్య అనే పాత్రలో నటించాడు. శతాబ్దాలుగా సాగుతున్న ఫ్యూడల్ వ్యవస్థపై తిరుగుబాటు చేసి, తమ భూమిని, హక్కులను, గౌరవాన్ని ఎలా కాపాడుకున్నారనదే ఈ మూవీ స్టోరీ.

సీతా పయనం – మార్చి 20 (సన్ నెక్ట్స్ ఓటీటీ)

ప్రముఖ నటుడు అర్జున్ సర్జా దర్శకత్వంలో రూపొందిన రోడ్ రొమాంటిక్ డ్రామా 'సీత పయనం'. ఇదో తమిళ మూవీ. ఐశ్వర్య అర్జున్ ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. వైజాగ్ నుండి హైదరాబాద్‌కు తన కెరీర్ వర్క్‌షాప్ కోసం ప్రయాణమయ్యే యువ చెఫ్ సీత కథ ఇది. దారిలో ఆమె అభి (నిరంజన్ సుధీంద్ర) అనే అపరిచిత వ్యక్తికి లిఫ్ట్ ఇస్తుంది. అది ఆమె జీవితాన్ని ఎలా మార్చింది? ఆమెను పెద్ద గండం నుంచి ఎలా గట్టెక్కించింది అన్నదే ఈ మూవీ స్టోరీ.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe