ఓటీటీలోకి ఈ వారం ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి. అయితే ఇందులో 8 సినిమాలు కచ్చితంగా చూడాల్సినవిగా ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్‌గా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఫ్రాంకిన్‌స్టన్ ఓటీటీ

ఆస్కార్ ఐజాక్, జాకబ్ ఎలోర్డి, మియా గోత్, క్రిస్టోఫ్ వాల్ట్జ్ నటించిన సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సినిమా ఫ్రాంకిన్‌స్టన్. ఈ మూవీ నవంబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
బారాముల్లా ఓటీటీ
ఆర్టికల్ 370 తరువాత దర్శకుడు ఆదిత్య జంభాలే తెరకెక్కించిన సినిమా బారాముల్లా. మానవ్ కౌల్, భాషా సుంబ్లీ యాక్ట్ చేసిన హారర్ థ్రిల్లర్ బారాముల్లా నవంబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది.
ఫస్ట్ కాపీ సీజన్ 2 ఓటీటీ
క్రిస్టల్ డిసౌజా, గుల్షన్ గ్రోవర్, సాకిబ్ అయూబ్, ఆషి సింగ్, మీయాంగ్ చాంగ్, ఇనామ్ ఉల్ హక్, రజా మురాద్, నవాబ్ షా నటించిన ఫస్ట్ కాపీ సీజన్ 2 అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో నవంబర్ 5 నుంచి ప్రీమియర్ కానుంది.
మహారాణి సీజన్ 4 ఓటీటీ
హుమా ఖురేషి నటించిన హిందీ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ మహారాణి. ఈ సిరీస్ నుంచి కొత్తగా వస్తున్న సీజన్ 4. అమిత్ సియాల్, శ్వేతా బసు ప్రసాద్, వినీత్ కుమార్, కని కుశ్రుతి, విపిన్ శర్మ, శార్దూల్ భరద్వాజ్, ప్రమోద్ పాఠక్ నటించిన ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి సోనీలివ్ ఓటీటీలో ప్రసారం కానుంది.
తోడే దూర్ తోడే పాస్ ఓటీటీ
పంకజ్ కపూర్, మోనా సింగ్, కునాల్ రాయ్ కపూర్, ఆయేషా కడుస్కర్ యాక్ట్ చేసిన తోడే దూర్ తోడే పాస్ జీ5 ఓటీటీలో నవంబర్ 7 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
ప్లురిబస్ ఓటీటీ
{{/usCountry}}పంకజ్ కపూర్, మోనా సింగ్, కునాల్ రాయ్ కపూర్, ఆయేషా కడుస్కర్ యాక్ట్ చేసిన తోడే దూర్ తోడే పాస్ జీ5 ఓటీటీలో నవంబర్ 7 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
ప్లురిబస్ ఓటీటీ
{{/usCountry}}రియా సీహార్న్, కరోలినా వైడ్రా, కార్లోస్ మాన్యువల్ వెస్గా, మిరియం షోర్, సాంబా షుట్టే తారాగణంతో వచ్చిన ప్లురిబస్ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 26 వరకు ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్‌ను ఓటీటీ రిలీజ్ చేయనున్నారు.
ది హ్యాక్ ఓటీటీ
బ్రిటన్‌లో జరిగిన అతిపెద్ద మీడియా కుంభకోణాల్లో ఒకటైన ట్యాపింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమానే ది హ్యాక్. డేవిడ్ టెన్నాంట్, రాబర్ట్ కార్లైల్, రోజ్ లెస్లీ, డగ్రే స్కాట్, టోబి జోన్స్ నటించి ది హ్యాక్ నవంబర్ 7న లయన్స్ గేట్ ప్లేలో ఓటీటీ రిలీజ్ కానుంది.
యాజ్ యూ స్టుడ్ బై నవంబర్ 7 నెట్‌ఫ్లిక్స్
జియోంగ్ సో-నీ, లీ యు-మి, జాంగ్ సియుంగ్-జో, లీ ము-సాంగ్ నటించిన కొరియన్ థ్రిల్లర్ యాజ్ యూ స్టుడ్ బై. ఈ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 7 నుంచి ఓటీటీ ప్రీమియర్ కానుంది.