...
...
Next Story

OTT Friday Releases: ఓటీటీలో ఫ్రైడే ధమాకా.. అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన ఈ 3 ఓటీటీల్లోని 6 టాప్ సినిమాలు, వెబ్ సిరీస్

OTT Friday Releases: ఓటీటీలోకి ఈ శుక్రవారం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ వస్తున్నాయి. అయితే వీటిలో మూడు ఓటీటీల్లోకి వస్తున్న టాప్ 6 సినిమాలు, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలను మాత్రం మిస్ కాకుండా చూడాల్సిందే.

Published on: Oct 1, 2026, 11:46:17 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Friday Releases: ఈ వీకెండ్ కోసం వెయిట్ చేస్తున్న ఓటీటీ లవర్స్‌కి మైండ్ బ్లాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5 ప్లాట్‌ఫామ్‌లలో ఏకంగా 6 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయిపోయాయి. రొమాంటిక్ కామెడీల నుంచి గూస్‌బంప్స్ తెప్పించే క్రైమ్ థ్రిల్లర్లు, స్పోర్ట్స్ డాక్యుమెంటరీల వరకు ప్రతీ ఒక్కరి టేస్ట్‌కి తగ్గ కంటెంట్ అందుబాటులోకి వస్తోంది.

1. బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit) - జియోహాట్‌స్టార్

OTT Friday Releases: ఓటీటీలో ఫ్రైడే ధమాకా.. అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన ఈ 3 ఓటీటీల్లోని 6 టాప్ సినిమాలు, వెబ్ సిరీస్
OTT Friday Releases: ఓటీటీలో ఫ్రైడే ధమాకా.. అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన ఈ 3 ఓటీటీల్లోని 6 టాప్ సినిమాలు, వెబ్ సిరీస్

'ప్రేమలు' సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన గిరీష్ ఏడీ దర్శకత్వంలో వచ్చిన మలయాళ రొమాంటిక్ కామెడీ ఇది. 13 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న యాష్లే, జస్టిన్ అనే జంట ప్రేమకథ, వారి పెళ్లికి ఇంట్లో వాళ్లు పెట్టే ఆటంకాల చుట్టూ కథ తిరుగుతుంది.

ఐఎండీబీలో 8.3 రేటింగ్ ఉన్న ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 37 నిమిషాలు. వీకెండ్‌లో ప్రశాంతంగా నవ్వుకోవడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

2. అంధ విశ్వాస్ - సావధాన్ ఇండియా స్టోరీస్ (Andh Vishwas) - జియోహాట్‌‌స్టార్

రియల్ లైఫ్ క్రైమ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఇంటెన్స్ సస్పెన్స్ వెబ్ సిరీస్ ఇది. సమాజంలో మూఢనమ్మకాలు పేరుతో కొందరు నేరగాళ్లు అమాయక ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు, ఘోరమైన క్రైమ్స్‌కి ఎలా ఒడిగడుతున్నారనేది ఇందులో కళ్లకట్టినట్లు చూపించారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, రియలిస్టిక్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సిరీస్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

3. హ్యాష్‌ట్యాగ్ లవ్ (#Love) - నెట్‌ఫ్లిక్స్

తమిళంలో రూపొందిన ఈ మోడరన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఒక డేటింగ్ యాప్ ఫౌండర్, ఇన్వెస్టర్ మాథ్యూ మధ్య ప్రేమ, డేటింగ్ అనే కాన్సెప్ట్‌పై వచ్చే విభేదాలు ఈ సిరీస్ మెయిన్ ప్లాట్. వారిద్దరి లవ్-హేట్ రిలేషన్‌షిప్‌ను చాలా ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. నేటి జనరేషన్ యూత్‌కి ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది.

4. డూయింగ్ లైఫ్ (Doing Life) - నెట్‌ఫ్లిక్స్

తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి, విక్రమ్ సింగ్ చౌహాన్ నటిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. నవజ్యోత్ గులాటీ డైరెక్ట్ చేసిన ఈ కథలో లవ్ ప్రపోజల్ రిజెక్షన్ ఎలాంటి పరిణామాలకు దారితీసిందనేది ప్రధానాంశం. మైండ్ గేమ్‌లు, కోర్టురూమ్ డ్రామా ఇష్టపడేవారు ఈ సినిమాను వీకెండ్ వాచ్‌లిస్ట్‌లో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే.

6. షుమాకర్ '94 - ది బర్త్ ఆఫ్ అ లెజెండ్ (Schumacher '94) - నెట్‌ఫ్లిక్స్

ఫార్ములా 1 దిగ్గజం మైఖేల్ షూమాకర్ తన మొదటి ప్రపంచ డ్రైవర్స్ ఛాంపియన్‌‌షిప్ గెలుచుకున్న 1994 ఐకానిక్ సీజన్ ఆధారంగా తీసిన స్పెషల్ డాక్యుమెంటరీ ఇది. షూమాకర్ భార్య కొరిన్నా, ప్రముఖ ఎఫ్1 రేసర్ల ఇంటర్వ్యూలతో క్రీడాభిమానులకు ఇది గూస్‌బంప్స్ తెప్పించే ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో మరిన్ని క్రేజీ ఆప్షన్స్

ఈ ఆరు సినిమాలు, వెబ్ సిరీస్ లే కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం ఇప్పటికే 'డెమోన్ స్లేయర్: ఇన్ఫినిటీ క్యాసిల్', 'ఓ మై డాగ్', 'ద ఫ్రెండ్', 'ద విడోవర్', 'ద ఉమెన్ ఇన్ ద యార్డ్' వంటి క్రేజీ టైటిల్స్ అందుబాటులోకి వచ్చాయి.

రాబోయే రోజుల్లో 'సండే బ్రంచ్ విత్ కామ్యా జాని', 'చుంబక్', 'ఆఫ్టర్ ద క్వేక్' లాంటి ఫన్ షోలు కూడా లైన్లో ఉన్నాయి. కాబట్టి ఈ వీకెండ్‌లో ఓటీటీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks