OTT Releases This Week: వీకెండ్ ఓటీటీ పండగ.. ఏకంగా 16 సినిమాలు, వెబ్ సిరీస్.. తెలుగులో 3 చాలా స్పెషల్
OTT Releases This Week: ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం మామూలుగా ఉండదు. ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్', శ్రీవిష్ణు 'మృత్యుంజయ్' వంటి సినిమాలతో పాటు మొత్తం 16 కొత్త మూవీస్, వెబ్ సిరీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్నాయి.
OTT Releases This Week: ఓటీటీ ప్రియులకు ఈ వారం పండగే అని చెప్పాలి. ఏప్రిల్ మొదటి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, జియోహాట్‌స్టార్ వంటి ప్రధాన ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమయ్యాయి. తెలుగు, హిందీ, తమిళంతో పాటు అంతర్జాతీయ సినిమాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వారం డిజిటల్ వేదికపైకి రానున్న ఆ ఆసక్తికర చిత్రాల వివరాలు మీకోసం.

ఓటీటీలోని 3 స్పెషల్ తెలుగు సినిమాలు
మృత్యుంజయ్
యంగ్ హీరో శ్రీవిష్ణు క్రైమ్ రిపోర్టర్ కావాలనుకునే అడ్వర్టైజ్మెంట్ ఎంప్లాయ్ 'జై' పాత్రలో కనిపించిన మూవీ ఇది. రెండు అనుమానాస్పద మరణాల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే క్రమంలో సాగే ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఏప్రిల్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి వచ్చింది.
సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని
శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ కామెడీలో ఒక నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీ కుటుంబం ఒక హత్య కేసులో ఎలా ఇరుక్కుందనేది ఆసక్తికరంగా చూపించారు. ఇది కూడా ఏప్రిల్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
యూఫోరియా
హైదరాబాద్‌లోని ఒక టాప్ కాలేజీ నేపథ్యంలో సాగే ఈ యూత్ ఫుల్ డ్రామా సోషల్ మీడియా ప్రభావం గురించి చర్చిస్తుంది. సారా అర్జున్, భూమిక చావ్లా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 2 నుంచి ఈటీవీ విన్ లో అందుబాటులో ఉంది.
హిందీ సినిమాలు, వెబ్ సిరీస్
సితారే జమీన్ పర్
ఆమిర్ ఖాన్, జెనీలియా నటించిన ఈ మూవీ ఒక అహంకారి అయిన బాస్కెట్‌బాల్ కోచ్.. దివ్యాంగుల టీమ్‌ను ఎలా విజేతలుగా నిలిపాడనే హృద్యమైన కథతో సాగుతుంది. ఏప్రిల్ 3 నుంచి సోనీ లివ్ (SonyLIV)లో చూడవచ్చు.
హ్యాపీ పటేల్: ఖతర్నాక్ జాసూస్
వీర్ దాస్ దర్శకత్వం వహించి నటించిన ఈ స్పై కామెడీలో గోవాలో కిడ్నాప్ అయిన సైంటిస్ట్‌ను కాపాడే మిషన్ హైలైట్‌గా నిలుస్తుంది. ఇది ఏప్రిల్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
మామ్లా లీగల్ హై: సీజన్ 2
రవి కిషన్ లాయర్ వీడీ త్యాగిగా మళ్ళీ నవ్వించడానికి సిద్ధమయ్యాడు. ఈ కోర్టు రూమ్ డ్రామా ఏప్రిల్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.
వధ్ 2
సంజయ్ మిశ్రా, నీనా గుప్తా నటించిన ఈ సీరియస్ డ్రామా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల నైతిక విలువల చుట్టూ తిరుగుతుంది. ఏప్రిల్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయింది.
మా కా సమ్
మిహిర్ అహుజా, మోనా సింగ్ నటించిన ఈ వెబ్ సిరీస్.. ఒక కొడుకు తన తల్లి ఒంటరితనాన్ని పోగొట్టడానికి ప్రయత్నించే క్రమంలో ఎదురయ్యే భావోద్వేగాలను చూపిస్తుంది. ఏప్రిల్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇతర భాషలు, అంతర్జాతీయ సినిమాలు
తమిళంలో విమల్ నటించిన యాక్షన్ డ్రామా 'వడమ్' (Vadam) ఏప్రిల్ 3న సన్ నెక్స్ట్‌లోకి వచ్చింది. అంతర్జాతీయ విభాగంలో 'ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ 2' (ఏప్రిల్ 5, ప్రైమ్ వీడియో), స్టార్ వార్స్ అభిమానుల కోసం 'మౌల్: షాడో లార్డ్' (ఏప్రిల్ 6, జియో హాట్‌స్టార్) వంటి భారీ ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి.
ఇవే కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో 'గ్యాంగ్స్ ఆఫ్ గలీసియా 2', 'ఏజెంట్ ఫ్రమ్ అబోవ్' వంటి సిరీస్‌లు కూడా ఈ వారం ప్రేక్షకులను పలకరించనున్నాయి. మొత్తానికి ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు వినోదాల విందు ఖాయం. మీ ఫేవరెట్ సినిమాను ఎంచుకుని ఎంజాయ్ చేయండి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. శ్రీవిష్ణు నటించిన 'మృత్యుంజయ్' ఏ ప్లాట్‌ఫామ్‌లో వస్తోంది?
శ్రీవిష్ణు 'మృత్యుంజయ్' చిత్రం ఏప్రిల్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
2. ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' ఎక్కడ చూడవచ్చు?
ఈ చిత్రం ఏప్రిల్ 3 నుంచి సోనీ లివ్ (SonyLIV) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వస్తుంది.
3. ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే తెలుగు సినిమాలు ఏవి?
మృత్యుంజయ్, సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని చిత్రాలు ఏప్రిల్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


