...
...
Next Story

OTT: ఈ వారం ఓటీటీలో సందడే.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ రిలీజ్‌ల‌పై ఓ లుక్కేయండి

OTT: ఈ వారం ఓటీటీలో సందడే సందడి. కొత్త సినిమాలు, అదిరే వెబ్ సిరీస్ లు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఇందులో థ్రిల్లర్లు కూడా ఉన్నాయి. ఈ వారం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ రిలీజ్‌ల‌పై ఓ లుక్కేయండి.

Published on: Apr 6, 2026, 13:49:13 IST
Advertisement

ప్రతి వారంలాగే ఈ ఏప్రిల్ రెండో వారంలో కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు భారీ చిత్రాలు, ఉత్కంఠభరితమైన వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఏప్రిల్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్న ఆ చిత్రాల వివరాలు మీకోసం.

ఓ రోమియో ఓటీటీ

ఈ వారం ఓటీటీ రిలీజ్ లు
ఈ వారం ఓటీటీ రిలీజ్ లు

ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న చిత్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా 'ఓ రోమియో'. ఎస్. హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు.

దావూద్ ఇబ్రహీంను అంతం చేసేందుకు ప్రయత్నించిన సప్నా దీదీ కథ స్ఫూర్తితో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ప్రతీకారం, ప్రేమ, ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఏప్రిల్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నానా పటేకర్, విక్రాంత్ మాస్సే వంటి హేమాహేమీలు ఈ సినిమాలో నటించడం విశేషం.

నెట్‌ఫ్లిక్స్‌లో కంటెంట్

నెట్‌ఫ్లిక్స్ లో ఈ వారం రొమాంటిక్ థ్రిల్లర్స్ నుంచి డాక్యుమెంటరీల వరకు ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాయి.

  • బిగ్ మిస్టేక్స్ (Big Mistakes): ఇద్దరు సిబ్లింగ్స్ అనుకోకుండా క్రైమ్ వరల్డ్‌లో చిక్కుకుంటే జరిగే గందరగోళమే ఈ సిరీస్ కథ. ఇది ఏప్రిల్ 9న రిలీజ్ అవుతుంది.
  • అన్‌టోల్డ్ - చెస్ మేట్స్ (Untold - Chess Mates): 2022లో గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్, హన్స్ నిమాన్ మధ్య జరిగిన చెస్ వివాదంపై తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ ఏప్రిల్ 6న విడుదలవుతుంది.
  • తూ యా మైన్ (Tu Yaa Main): షనాయా కపూర్, ఆదర్శ్ గౌరవ్ నటించిన ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒక స్విమ్మింగ్ పూల్‌లో మొసలితో చిక్కుకుంటే ఏం జరిగిందనే ఆసక్తికర అంశాన్ని చూపించారు. ఇది ఏప్రిల్ 10న వస్తుంది.

ది బాయ్స్ సీజన్ 5

జియోహాట్‌స్టార్‌లో మాల్కమ్ ఇన్ ద మిడిల్ సీక్వెల్ ఏప్రిల్ 10న వస్తోంది. అదే రోజున రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన గ్రామీణ నేపథ్యంలో సాగే 'తాయ్ కిళవి' (Thaai Kizhavi) కూడా సందడి చేయనుంది. ఇక యాపిల్ టీవీ ప్లస్‌లో కియానూ రీవ్స్, కామెరూన్ డియాజ్ నటించిన డార్క్ కామెడీ మూవీ 'అవుట్‌కమ్' (Outcome) ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది.

వీటితో పాటు రియాలిటీ షో 'టెంప్టేషన్ ఐలాండ్ సీజన్ 10' (నెట్‌ఫ్లిక్స్ - ఏప్రిల్ 10), కల్ట్ ప్రాఫెట్ శామ్యూల్ బేట్‌మాన్ పై రూపొందించిన డాక్యుమెంటరీ 'ట్రస్ట్ మీ' (నెట్‌ఫ్లిక్స్ - ఏప్రిల్ 8) వంటివి కూడా ఈ వారం క్యూలో ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks