ఈవారం ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ధర్మేంద్ర చివరి సినిమా, మలయాళం థ్రిల్లర్
ఓటీటీలోకి ఈవారం ఎంతో అద్భుతమైన కంటెంట్ రాబోతోంది. తెలుగు సహా మలయాళం, తమిళం, హిందీ భాషలకు చెందిన థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలు, సిరీస్ ఏంటి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
ఓటీటీ ప్రేక్షకులకు ఈవారం పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఈవారం ప్రతి భాషలో, ప్రతి జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతున్నాయి. తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ హనీ, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్‌రావు కనబడుట లేదు, ధర్మేంద్ర చివరి మూవీ ఇక్కిస్, మలయాళం థ్రిల్లర్ వెబ్ సిరీస్ రోస్లిన్ లాంటివి వస్తున్నాయి.

హనీ - సన్ నెక్ట్స్
నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ 'హనీ' ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం అంటే ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సన్ నెక్స్ట్ (Sun NXT) వెల్లడించింది. ఇందులో దివ్యా పిళ్లై, దివి వాద్యా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తమిళ వెర్షన్ కూడా అదే రోజున అదే ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది.
డాటరాఫ్ ప్రసాదరావు: కనబడుటలేదు - జీ5 ఓటీటీ
ఇది జీ5 (ZEE5) అందిస్తున్న సరికొత్త తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఫిబ్రవరి 27నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. రాజీవ్ కనకాల, ఉదయ భాను, వసంతిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. పోలూరు కృష్ణ ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహించాడు. కనిపించకుండా పోయిన కూతురిని వెతికే తండ్రి చుట్టూ తిరిగే కథ ఇది.
శ్రీ చిదంబరం గారు - ఈటీవీ విన్
తెలుగు ఎమోషనల్ డ్రామా శ్రీ చిదంబరం గారు మూవీ కూడా గురువారం అంటే ఫిబ్రవరి 26 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. నిజానికి గత వారమే రావాల్సి ఉన్నా.. వారం రోజులు వాయిదా పడింది. మెల్ల కన్నును కవర్ చేసుకోవడానికి నల్ల కళ్లద్దాలతో మేనేజ్ చేసే యువకుడి కథ ఇది. వినయ్ రత్నం డైరెక్ట్ చేశాడు.
సీక్రెట్ స్టోరీస్: రోస్లిన్ - జియోహాట్‌స్టార్
ఇది జియోహాట్‌స్టార్‌లో రాబోతున్న మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దృశ్యం ఫేమ్ జీతు జోసెఫ్ ఈ సిరీస్‌కు షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. సుమేష్ నందకుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మీనా, వినీత్ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 27 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. తెలుగు సహా మొత్తం ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ది బ్లఫ్ - అమెజాన్ ప్రైమ్ వీడియో
ప్రియాంకా చోప్రా, కార్ల్ అర్బన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఏ-రేటెడ్' ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ 'ది బ్లఫ్'. ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రీమియర్ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. ఈ యాక్షన్ స్పెక్టాకిల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. వారణాసితో ఇండియన్ సినిమాకు తిరిగి వస్తున్న ప్రియాంకా చోప్రా.. ఈ ది బ్లఫ్ తో అంతకంటే ముందే తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించబోతోంది.
ఇక్కిస్ - అమెజాన్ ప్రైమ్ వీడియో
బాలీవుడ్ వెటరన్ నటుడు ధర్మేంద్ర నటించిన చివరి సినిమా 'ఇక్కిస్'. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఫిబ్రవరి 26 నుంచి దీనిని ఎలాంటి రెంటల్ ఛార్జీలు లేకుండానే ఉచితంగా చూడొచ్చు. పరమ వీర చక్ర అవార్డు గ్రహీత అరుణ్ ఖేతర్‌పాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ వార్ బయోపిక్‌కు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు.
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ - జియోహాట్‌స్టార్
పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వంలో లియోనార్డో డికాప్రియో నటించిన బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'. ఈ మూవీ ఫిబ్రవరి 26 నుంచి జియోహాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ కానుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా ప్రస్తుతం పలు విభాగాల్లో ఆస్కార్ రేసులో ఉంది.
అక్యూజ్డ్ - నెట్‌ఫ్లిక్స్
కొంకణా సేన్ శర్మ, ప్రతిభా రాంటా, మషూర్ అమ్రోహి కలయికలో వస్తున్న మూవీ 'అక్యూజ్డ్'. అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ను ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇది నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 27న ప్రీమియర్ కానుంది.
తడయం - జీ5 ఓటీటీ
నటుడు, దర్శకుడు సముద్రఖని 'తడయం' అనే తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. నవీన్‌కుమార్ పళనివేల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఫిబ్రవరి 27న జీ5 (ZEE5) లో ప్రీమియర్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


