టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు థియేటర్లలో కంటే ఓటీటీ వేదికలపైనే ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు.. స్టార్లు లేకపోయినా ప్రేక్షకులు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఇదే కోవలో మరో ఇంట్రెస్టింగ్ కోర్టు రూమ్ డ్రామా 'వంచన' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. మరి ఆ వివరాలేంటో చూడండి.
వంచన ఓటీటీ స్ట్రీమింగ్

తెలుగులో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ కోర్టు రూమ్ థ్రిల్లర్ వంచన. ఈ సినిమా నవంబర్ 8, 2024న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు సుమారు ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా సరైన ప్రమోషన్లు లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.
అయితే తాజాగా ఈ మూవీ డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ (Sun NXT) ప్లాట్‌ఫామ్ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, మార్చి 3, 2026 నుంచి 'వంచన' మూవీ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానుంది. ఐఎండీబీలో ఈ సినిమాకు 7.5 రేటింగ్ ఉంది.
వంచన మూవీ స్టోరీ ఏంటంటే?
ఒక చర్చి ఫాదర్ దారుణ హత్యకు గురవడంతో ఈ వంచన మూవీ కథ ప్రారంభమవుతుంది. ఆ హత్య కేసులో అనుమానితుడిగా అతని డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే ఆ డ్రైవర్ నిర్దోషి అని నమ్మిన యువ క్రిమినల్ లాయర్ కృష్ణ.. ఈ కేసును వాదించేందుకు సిద్ధమవుతాడు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో లాయర్ కృష్ణకు ఎదురైన సవాళ్లు ఏంటి? అసలైన హంతకుడు ఎవరు? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సాగుతుంది.
వంచన సినిమా విశేషాలు
ఈ వంచన సినిమాకు ఉమా మహేష్ దర్శకత్వం వహించడమే కాకుండా, ప్రధాన పాత్రలోనూ నటించాడు. నటుడిగా అక్కడక్కడా తడబడినప్పటికీ, దర్శకుడిగా స్క్రీన్ ప్లే విషయంలో తన ప్రతిభను చాటుకున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కోర్టు రూమ్ సీన్లు.. లాయర్, జడ్జి మధ్య జరిగే వాదోపవాదాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తక్కువ బడ్జెట్లో నిర్మించినప్పటికీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమాకు బలాన్నిచ్చాయి.
{{/usCountry}}ఈ వంచన సినిమాకు ఉమా మహేష్ దర్శకత్వం వహించడమే కాకుండా, ప్రధాన పాత్రలోనూ నటించాడు. నటుడిగా అక్కడక్కడా తడబడినప్పటికీ, దర్శకుడిగా స్క్రీన్ ప్లే విషయంలో తన ప్రతిభను చాటుకున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కోర్టు రూమ్ సీన్లు.. లాయర్, జడ్జి మధ్య జరిగే వాదోపవాదాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తక్కువ బడ్జెట్లో నిర్మించినప్పటికీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమాకు బలాన్నిచ్చాయి.
{{/usCountry}}ఇటీవల కాలంలో థియేటర్లలో పెద్దగా ఆడని 'శ్రీ చిదంబరం గారు', రోషన్ కనకాల 'మౌగ్లీ' వంటి సినిమాలు ఓటీటీలో మంచి వ్యూస్ సాధించాయి. అదే బాటలో 'వంచన' కూడా డిజిటల్ ఆడియన్స్‌ను మెప్పిస్తుందో లేదో చూడాలి. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఓటీటీలో మంచి సక్సెస్ అందుకునే అవకాశం ఉంది.