OTT Releases This Week: థియేటర్లతో సమానంగా ప్రస్తుతం ఓటీటీ (OTT) ల్లో వచ్చే సిరీస్‌లకు, ఒరిజినల్ కంటెంట్‌కు ఆడియన్స్ విపరీతమైన క్రేజ్ చూపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో వైవిధ్యమైన కథాంశాలతో వస్తున్న వెబ్ సిరీస్‌లను వీక్షించడానికి ప్రతి వారం డిజిటల్ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ వారం డిజిటల్ స్క్రీన్‌లపై సందడి చేయడానికి విభిన్న జానర్లలో కొన్ని భారీ వెబ్ సిరీస్‌లు లైన్ కట్టాయి.
1. సూపర్ సుబ్బు (Super Subbu) - నెట్‌ఫ్లిక్స్ (జూలై 2)

టాలీవుడ్ యంగ్ అండ్ వర్సటైల్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా జూలై 2న విడుదల చేస్తున్నారు. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ తీసుకొస్తున్న ఫస్ట్ తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ ఇది. సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో స్టోరీ సాగనుందని తెలిసింది.
"ఒక అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయబద్ధమైన గ్రామం.. అక్కడ అతనికి ఎదురైన అసాధ్యమైన, వింతైన ఉద్యోగం" అనే ఫన్నీ లైన్‌తో ఈ సిరీస్ రాబోతోంది. ఇది కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
2. ఇసాకపట్నం (Isakapatnam) - అమెజాన్ ప్రైమ్ వీడియో (జూలై 2)
అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) నుంచి వస్తున్న పక్కా రా అండ్ రస్టిక్ తెలుగు ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ఇసుకపట్నం’. ప్రముఖ నటుడు సముద్రఖని, ఐశ్వర్య రాజేష్, నరేష్ అగస్త్య, సునీల్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు.
తమడా మీడియా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సిరీస్ కథాంశం 1990ల నాటి వైజాగ్/ఇసాకపట్నం పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఇది పాన్-ఇండియా వైడ్‌గా స్ట్రీమింగ్ కానుంది.
3. గుర్తుకొస్తున్నాయి (Gurthukosthunnayi) - ఈటీవీ విన్ (జూలై 3)
{{/usCountry}}తమడా మీడియా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సిరీస్ కథాంశం 1990ల నాటి వైజాగ్/ఇసాకపట్నం పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఇది పాన్-ఇండియా వైడ్‌గా స్ట్రీమింగ్ కానుంది.
3. గుర్తుకొస్తున్నాయి (Gurthukosthunnayi) - ఈటీవీ విన్ (జూలై 3)
{{/usCountry}}సరికొత్త ఒరిజినల్ తెలుగు కంటెంట్‌తో హోమ్ బౌండ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న ‘ఈటీవీ విన్’ (ETV Win) యాప్‌లో జూలై 3 నుంచి ‘గుర్తుకొస్తున్నాయి’ అనే ఎమోషనల్ సిరీస్ ప్రీమియర్ కానుంది. విరాజ్ అశ్విన్, యశాశ్రీ రావు (డెబ్యూ), రోహిణి హట్టంగడి, గోపరాజు రమణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను వినోద్ గాలి తెరకెక్కించారు.
90ల నాటి జ్ఞాపకాలు, నోస్టాల్జియా, మిడిల్ క్లాస్ ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్ కలబోసిన ప్యూర్ తెలుగు డ్రామా ఇది. దీని మొదటి ఎపిసోడ్‌ను ఉచితంగా వీక్షించే అవకాశాన్ని మేకర్స్ కల్పించారు.
4. వీరభద్రుని రహస్యం (Veerabhadruni Rahasyam) - జీ5 (జూలై 3)
జీ5 (ZEE5) ప్లాట్‌ఫారమ్‌లో జూలై 3 నుంచి ఒక భారీ మైథో-మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. అదే ‘వీరభద్రుని రహస్యం’. 90ల కాలంలో సంచలనం సృష్టించిన కల్ట్ క్లాసిక్ సిరీస్ ‘మర్మదేశం’ మేకర్స్ ప్రపంచం నుంచి ఈ సిరీస్ వస్తోంది.
ప్రాచీన నమ్మకాలు, రహస్య యుద్ధాలు, మిస్టరీ అంశాల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఏకంగా 60 ఎపిసోడ్‌ల భారీ లాంగ్-ఫార్మాట్‌తో రూపొందింది. అయితే ఇది ఒకేసారి కాకుండా ‘వీక్లీ సిరీస్’ రూపంలో ప్రతి వారం కొన్ని ఎపిసోడ్‌ల చొప్పున డిజిటల్ ఆడియన్స్‌ను థ్రిల్ చేయబోతోంది.