Web Series: నెవ‌ర్ బిఫోర్‌.. ఈ వారం ఓటీటీలోకి ఏకంగా టాప్ 6 వెబ్ సిరీస్‌లు.. కామెడీ టూ క్రైమ్ థ్రిల్ల‌ర్‌.. మ‌స్ట్ వాచ్‌!

Web Series: ఈ వారం నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5 వంటి అగ్రశ్రేణి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సరికొత్త వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. థ్రిల్లర్, రొమాన్స్, క్రైమ్, కొరియన్ డ్రామా.. ఇలా భిన్నమైన జానర్లలో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్న ఆ టాప్ సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.

Published on: Oct 27, 2026, 13:52:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Web Series: హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చే కంటెంట్ తో వస్తున్న వెబ్ సిరీస్ 'ఢిండోరా' (Dhindora). ఈ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ అక్టోబర్ 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే కథాంశంతో ఈ సిరీస్ రాబోతోంది.

నెవ‌ర్ బిఫోర్‌.. ఈ వారం ఓటీటీలోకి ఏకంగా టాప్ 6 వెబ్ సిరీస్‌లు.. కామెడీ టూ క్రైమ్ థ్రిల్ల‌ర్‌.. మ‌స్ట్ వాచ్‌!
నెవ‌ర్ బిఫోర్‌.. ఈ వారం ఓటీటీలోకి ఏకంగా టాప్ 6 వెబ్ సిరీస్‌లు.. కామెడీ టూ క్రైమ్ థ్రిల్ల‌ర్‌.. మ‌స్ట్ వాచ్‌!

బలరావ్: బ్లడ్ ఐలాండ్

డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇంటర్నేషనల్ కంటెంట్ ఇష్టపడే వారి కోసం నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తున్న సిరీస్ 'బలరావ్ : బ్లడ్ ఐలాండ్' (Balaraw : Blood Island). ఇదొక ఫిలిపినో యాక్షన్, సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్. ఇది ఇంగ్లీష్ లో కూడా అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 29న స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ప్రేక్షకులకు ఓ సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వనుంది.

లవ్ ఆల్వేస్

ప్రేమ కథలను ఇష్టపడే వారికి జియోహాట్‌స్టార్ (JioHotstar) ఒక మంచి కానుకను అందిస్తోంది. 'లవ్ ఆల్వేస్' (Love Always) అనే బ్యూటిఫుల్ రొమాంటిక్ సిరీస్ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సిరీస్.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో గౌరీ జి కిషన్, రంజాన్ మహ్మద్, జయప్రకాష్, జయసుధ తదితరులు నటించారు.

రుద్రవనం పీఎస్

ముఖ్యంగా తెలుగు ఓటీటీ ప్రేక్షకుల కోసం జీ5 (Zee5) అక్టోబర్ 30న 'రుద్రవనం పీఎస్' (Rudravanam PS) అనే సిరీస్ ను తీసుకువస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినట్లు కనిపిస్తున్న ఈ సిరీస్ టైటిల్ చూస్తుంటేనే ఇదొక సస్పెన్స్ లేదా క్రైమ్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. వీకెండ్ లో ఓ మంచి అచ్చమైన తెలుగు సిరీస్ చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

అక్క

కీర్తి సురేష్ ఓటీటీ డెబ్యూ చేస్తున్న సిరీస్ ఇది. భారీ అంచనాలతో తెరకెక్కిన పవర్‌ఫుల్ వెబ్ సిరీస్ 'అక్క' (AKKA) అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. బలమైన కథ, అద్భుతమైన నటనతో ఈ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేయనుందని టాక్.

డెడ్-ఎండ్ జాబ్

ఇండియాలో కొరియన్ డ్రామాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి కే-డ్రామా ఫ్యాన్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ 'డెడ్-ఎండ్ జాబ్' (Dead-End Job) సిరీస్ ను అక్టోబర్ 30న రిలీజ్ చేస్తోంది. కొరియన్ తో పాటు మన తెలుగు, తమిళ, హిందీ భాషల్లోకి కూడా డబ్ చేసి ఈ సిరీస్ ను రిలీజ్ చేస్తుండటం విశేషం.

మొత్తానికి ఈ వారం ఓటీటీలో కంటెంట్ జాతర జరగనుంది. మరి మీకిష్టమైన జానర్ ని ఎంచుకుని, వాచ్ లిస్ట్ లో పెట్టుకుని బింజ్ వాచ్ చేసేయండి!

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More