OTT: అమ్మకానికి సిద్ధమైన ఓటీటీ యాప్- 2,100 కోట్ల రేసులో లెటర్‌బాక్స్‌డి- ఇక నిజాయితీ లేని రివ్యూలు, రేటింగ్‌లు చూడాలా?
Letterboxd App For Sale Netflix: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు విపరీతంగా వాడే పాపులర్ మూవీ రివ్యూ ఓటీటీ యాప్ 'లెటర్‌బాక్స్‌డి' అమ్మకానికి సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్, సోనీ పిక్చర్స్ వంటి దిగ్గజ సంస్థలు ఈ యాప్‌ను దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఓనర్ మారితే వచ్చే సమస్యలపై చర్చ మొదలైంది.
Letterboxd App For Sale Netflix Sony Liv: ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర అభిమానులు, సినీ విమర్శకులు ఎంతో ఇష్టపడే సోషల్ నెట్‌వర్కింగ్ ఓటీటీ యాప్ 'లెటర్‌బాక్స్‌డి' (Letterboxd) త్వరలోనే కొత్త యజమాని చేతికి వెళ్లనుంది. దాదాపు 250 మిలియన్ డాలర్ల (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 2,100 కోట్లు) భారీ విలువతో ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను విక్రయించేందుకు యాప్ యజమానులు సన్నాహాలు చేస్తున్నారు.

రేసులో హెవీవెయిట్స్.. నెట్‌ఫ్లిక్స్, సోనీ పోటీ
ఈ డీల్ కోసం ప్రముఖ లయన్ ట్రీ (LionTree) మర్చంట్ బ్యాంకింగ్ సంస్థ చర్చలు జరుపుతోంది. ఈ డిజిటల్ రివ్యూ ప్లాట్‌ఫామ్‌ను దక్కించుకునేందుకు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix), హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్, పారామౌంట్ స్కైడాన్స్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ (TPG) పోటీ పడుతున్నాయి.
వీరితో పాటు ప్రసిద్ధ సోషల్ మీడియా సైట్ 'రెడ్డిట్' సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్ కూడా ఈ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే, "నేను చిన్నగా తుమ్మినా సరే ఎవరో ఒకరు దాని గురించి పెద్ద వార్తగా మాట్లాడేస్తున్నారు లాల్" అని ఈ కొనుగోలు వార్తలపై అలెక్సిస్ ఒహానియన్ సరదాగా స్పందించారు.
ఏంటీ 'లెటర్‌బాక్స్‌డి'? ఎందుకింత క్రేజ్?
2011లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ వేదికగా మాథ్యూ బుకానన్, కార్ల్ వాన్ రాండో ఈ యాప్‌ను ప్రారంభించారు. యూజర్లు తాము చూసిన సినిమాలను రికార్డు చేయడానికి, రివ్యూలు రాయడానికి, మిత్రులతో 'వాచ్‌లిస్ట్‌లు' పంచుకోవడానికి ఇది ఒక ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లా పనిచేస్తుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దీనికి 2.6 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ముఖ్యంగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువత ఈ ఓటీటీ యాప్‌ను విపరీతంగా వాడుతున్నారు. హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు మార్టిన్ స్కోర్సేస్, ప్రముఖ నటి ఆయో ఎడెబిరి, పాప్ స్టార్ చార్లీ ఎక్స్ సీఎక్స్ వంటి సెలబ్రిటీలు కూడా తమ రివ్యూలను ఈ ప్లాట్‌ఫామ్‌పై క్రమం తప్పకుండా షేర్ చేస్తూ ఉంటారు.
మూడేళ్లలో 5 రెట్ల మార్కెట్ విలువ
దీనివల్ల సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ యాప్‌కు విపరీతమైన ఆదరణ పెరిగింది. కెనడాకు చెందిన 'టైని' (Tiny) హోల్డింగ్ కంపెనీ 2023లో దాదాపు 50 నుంచి 60 మిలియన్ డాలర్ల విలువ వద్ద లెటర్‌బాక్స్‌డిలో 60 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. మిగిలిన 40 శాతం వాటా మూల వ్యవస్థాపకుల వద్దే ఉంది. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే దీని మార్కెట్ విలువ ఐదు రెట్లు పెరగడం గమనార్హం.
అయితే, ఏదైనా బడా హాలీవుడ్ స్టూడియో లేదా నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రొడక్షన్ కంపెనీ ఈ యాప్‌ను దక్కించుకుంటే 'కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్' (స్వార్థ ప్రయోజనాల ఘర్షణ) తలెత్తుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి.
కొత్త యజమాని వస్తే సమస్యలేంటి?
తమ సొంత సినిమాలకు ఎక్కువ రేటింగ్స్ వచ్చేలా లేదా ప్రత్యర్థి కంపెనీల సినిమాలను తక్కువ చేసి చూపేలా యాప్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందని సినిమా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
గతంలో ప్రముఖ మూవీ రేటింగ్ సైట్ 'రాటన్ టొమాటోస్'ను ఎన్‌బీసీ యూనివర్సల్ కొనుగోలు చేసినప్పుడు, 'ఐఎమ్‌డీబీ' (IMDb)ని అమెజాన్ చేజిక్కించుకున్నప్పుడు కూడా ఇటువంటి విమర్శలే వచ్చాయి. అంటే, కొత్త యజమాని వస్తే నిజాయితీ లేని రివ్యూలు, రేటింగ్‌లను చూడాల్సి వస్తుందని విశ్లేకులు అంచనా వేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


