OTT Review: ఓటీటీ రివ్యూ- ఊరిలో పండుగ, ఇంటి ముందే శవం, చిన్నారి కిడ్నాప్- మైండ్ బ్లాక్ చేసే క్రైమ్ థ్రిల్లర్-7.7 రేటింగ్

Kuttram Purindhavan OTT Review In Telugu: ఒక హత్య, చిన్నారి కిడ్నాప్ చుట్టూ తిరిగే ఉత్కంఠభరిత మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కుట్రం పురిందవన్. పశుపతి, విధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కి 7.7 రేటింగ్ ఉంది. అలాంటి ఈ సిరీస్ ఎలా ఉంటుందో నేటి కుట్రం పురిందవన్ ఓటీటీ రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Jul 23, 2026, 12:10:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kuttram Purindhavan OTT Review In Telugu: సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు లేదా సిరీస్‌లు అనగానే "ఈ హత్య ఎవరు చేశారు?" అనే పాయింట్ చుట్టూనే కథ సాగుతుంది. అయితే నేరం ఎవరు చేశారనే దానికంటే.. ఆ నేరం వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఆ తప్పు వల్ల కలిగే నేరభావన (Guilt) మనిషి జీవితాన్ని, ఆలోచనలను ఎలా నరకంగా మారుస్తుందనే కొత్త కోణాన్ని ఆవిష్కరించింది ‘కుట్రం పురిందవన్: ది గిల్టీ వన్’ (Kuttram Purindhavan: The Guilty One).

ఓటీటీ రివ్యూ- ఊరిలో పండుగ, ఇంటి ముందే శవం, చిన్నారి కిడ్నాప్- మైండ్ బ్లాక్ చేసే క్రైమ్ థ్రిల్లర్-7.7 రేటింగ్
ఓటీటీ రివ్యూ- ఊరిలో పండుగ, ఇంటి ముందే శవం, చిన్నారి కిడ్నాప్- మైండ్ బ్లాక్ చేసే క్రైమ్ థ్రిల్లర్-7.7 రేటింగ్

థ్రిల్లర్ లవర్స్‌ను ఆకట్టుకుంటూ

ప్రస్తుతం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఓటీటీ సిరీస్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దర్శకుడు సెల్వమణి మునియప్పన్ తెరకెక్కించిన ఈ 7 ఎపిసోడ్ల కథనం మొదటి నిమిషం నుంచే వీక్షకులను కథలో మమేకం చేస్తుంది. ఒక హత్య, చిన్నారి కిడ్నాప్ అంశాల చుట్టూ సాగే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. కుట్రం పురిందవన్ ఓటీటీ రివ్యూలోకి వెళితే..

ఒక్కొక్కరి చీకటి రహస్యాలు

ఓ వైపు గ్రామంలో పండుగ ఉత్సాహంగా సాగుతుండగా, మరోవైపు ఒక వ్యక్తి తన ఇంటి ముందే శవమై కనిపిస్తాడు. అదే సమయంలో అతని చిన్నారి కూతురు వింతగా మాయమవుతుంది. అక్కడి నుంచి మొదలైన పోలీస్ విచారణలో గ్రామంలోని ఒక్కొక్కరి రహస్యాలు, అబద్ధాలు, స్వార్థ ప్రయోజనాలు, వారిలోని చీకటి కోణాలు బయటపడతాయి. మనుషులు ఆవేశంలో లేదా మంచి ఉద్దేశంతో చేసే చిన్న తప్పులు వారిని ఎలా ఊబిలోకి నెడతాయో ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు.

పశుపతి నటన.. సిరీస్‌కే ప్రధాన బలం

తెలుగు ప్రేక్షకులకు 'సర్పాట్ట పరంబర', 'మావీరన్' చిత్రాలతో సుపరిచితమైన విలక్షణ నటుడు పశుపతి ఇందులో భాస్కరన్ పాత్రలో జీవించారు. తన కళ్లతో, ముఖంలో ఒలికించిన భావోద్వేగాలతో ఒక తండ్రి పడే తపనను, నేరభావనతో అనుభవించే నరకాన్ని అద్భుతంగా పండించారు.

ఇక పోలీస్ ఆఫీసర్‌గా నటించిన విధార్థ్ తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేశారు. ఒక సాధారణ మనిషి ఎదుర్కొనే గందరగోళాన్ని, వృత్తిధర్మానికి మధ్య నలిగిపోయే తీరును ఆయన సహజంగా ఆవిష్కరించారు.

ఉత్కంఠ రేపే కథనం.. అద్భుతమైన సంగీతం

కేవలం మర్డర్ మిస్టరీగానే కాకుండా మానసిక సంఘర్షణ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఎస్.ఎన్. ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సిరీస్‌లోని డార్క్, సస్పెన్స్ మూడ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. దర్శకుడు సెల్వమణి కథనాన్ని ఎక్కడా అనవసరపు వేగంతో కాకుండా, ప్రతి సన్నివేశానికి తగిన ప్రాధాన్యం ఇస్తూ నెమ్మదిగా ఉత్కంఠ పెంచేలా తీర్చిదిద్దారు.

ఐఎమ్‌డీబీ రేటింగ్

ఇలా ఆకట్టుకునే సీన్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కలగలపిన ఈ కుట్రం పురిందవన్ సిరీస్‌కు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.7 రేటింగ్ వచ్చింది. ఇంతటి క్రేజ్ ఉన్న కుట్రం పురిందవన్ ఓటీటీలో అదరగొడుతోంది.

కుట్రం పురిందవన్ ఓటీటీ స్ట్రీమింగ్

ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ సోనీ లివ్‌లో కుట్రం పురిందవన్ ది గిల్టీ వన్ ఓటీటీ రిలీజ్ అయింది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ వంటి నాలుగు భాషల్లో సోనీ లివ్‌లో కుట్రం పురిందవన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. నిలకడగా సాగుతూ చివరి వరకు ఆసక్తి రేకెత్తించే థ్రిల్లర్లను కోరుకునే వారికి కుట్రం పురిందవన్ ఒక గొప్ప థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More