...
...
Next Story

OTT Telugu: ఓటీటీలోకి వచ్చేస్తున్న భూమిక, సారా అర్జున్ మూవీ.. ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ఇక్కడ చూడండి

OTT Telugu: ఓటీటీలోకి భూమిక, సారా అర్జున్ కలిసి నటించిన యుఫోరియా మూవీ వచ్చేస్తుంది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ సినిమా చూడొచ్చు.

Published on: Mar 30, 2026, 15:13:55 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Telugu: స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ చాలా గ్యాప్ తర్వాత తీసిన లేటెస్ట్ సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా యుఫోరియా. ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో సీనియర్ నటి భూమిక చావ్లా, రీసెంట్‌గా ధురంధర్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సారా అర్జున్, విఘ్నేష్, గౌతమ్ మీనన్ లాంటి టాలెంటెడ్ క్యాస్ట్ నటించారు. శాకుంతలం లాంటి పీరియాడిక్ డిజాస్టర్ తర్వాత గుణశేఖర్ విజువల్ ఎఫెక్ట్స్ పక్కనపెట్టి, సమాజంలో జరుగుతున్న ఒక పచ్చి నిజాన్ని ఈ సినిమా ద్వారా మన కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది.

యుఫోరియా ఓటీటీ రిలీజ్ డేట్

OTT Telugu: ఓటీటీలోకి వచ్చేస్తున్న భూమిక, సారా అర్జున్ మూవీ.. ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ఇక్కడ చూడండి
OTT Telugu: ఓటీటీలోకి వచ్చేస్తున్న భూమిక, సారా అర్జున్ మూవీ.. ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ఇక్కడ చూడండి

యుఫోరియా మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఈటీవీ విన్ ఓటీటీ సోమవారం (మార్చి 30) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “ఫ్రెండ్‌షిప్. లవ్. బ్రేకప్స్. లైఫ్. యుఫోరియాలో ప్రతి దశ భిన్నమైనది. ఏప్రిల్ 2 నుంచి ఈటీవీ విన్ లో డిజిటల్ ప్రీమియర్” అనే క్యాప్షన్ తో ఓ ట్వీట్ చేసింది.

ఆ తర్వాత కాసేపటికే.. “ఓ తల్లి, ఓ టీచర్, ఓ బాధాకరమైన నిజం.. యుఫోరియా ఎ విన్ డిజిటల్ ప్రీమియర్ ఏప్రిల్ 2న” అనే క్యాప్షన్ తో మరో ట్వీట్ చేసింది.

'యుఫోరియా' కథ ఏంటంటే..

ఈ సినిమా స్టోరీ హైదరాబాద్‌లో 2022లో జరిగిన ఒక రియల్ లైఫ్ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కింది. చైత్ర అనే 17 ఏళ్ల అమ్మాయి క్యారెక్టర్‌లో సారా అర్జున్ అద్భుతంగా నటించింది. ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యంతో ఉండే ఆ అమ్మాయి ఒక పార్టీకి వెళ్లినప్పుడు, పెద్ద కుటుంబాలకు చెందిన ఐదుగురు మైనర్ కుర్రాళ్ల చేతిలో దారుణంగా అఘాయిత్యానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి, ఆమె ఫ్యామిలీ పడే నరకం ఒక వైపు అయితే.. తప్పు చేసిన ఆ మైనర్ల కుటుంబాలు ఫేస్ చేసే పరిణామాలు మరోవైపు చాలా డీటెయిల్డ్‌గా చూపిస్తారు.

ఈ సినిమాకు ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఐఎండీబీలో మాత్రం 8.2 రేటింగ్ నమోదైంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా, గ్రిప్పింగా సాగినా.. సెకండాఫ్ లోనే కాస్త కథ పక్కదారి పట్టినట్లు కూడా కొందరు తమ రివ్యూల్లో చెప్పారు. అయితే ఈ సినిమాలో భూమిక, సారా అర్జున్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ యుఫోరియా సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. రిలీజ్ రోజు నుంచే కలెక్షన్లు చాలా డల్‌గా ఉన్నాయి. మొదటి రోజు ఇండియాలో కేవలం రూ.25 లక్షల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించిన ఈ సినిమా, ఫుల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.1.87 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి కమర్షియల్‌గా చాలా నిరాశపరిచింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe