OTT Telugu: ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు.. కామెడీ రొమాంటిక్ టు థ్రిల్లర్.. ఓ లుక్కేయండి
OTT Telugu: ఓటీటీ లవర్స్ అలర్ట్. ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు చాలానే వచ్చాయి. వీటిలో తెలుగు మూవీస్ కూడా ఉన్నాయి. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన తెలుగు చిత్రాలపై ఓ లుక్కేయండి.
ఈ వారం ఓటీటీలో కొత్త తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో డిఫరెంట్ జోనర్ల మూవీస్ ఉన్నాయి. రొమాంటిక్, కామెడీ, థ్రిల్లర్ తదితర జోనర్లలోని తెలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు చిత్రాలపై ఓ లుక్కేయండి.

ఓం శాంతి శాంతి శాంతి:
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన తెలుగు కామెడీ ఫ్యామిలీ మూవీ ‘ఓం శాంతి శాంతి శాంతి:’ ఓటీటీలో అదరగొడుతోంది. మలయాళం సూపర్ హిట్ మూవీ 'జయ జయ జయ జయ హే' చిత్రానికి తెలుగు రీమేక్ గా ఓం శాంతి శాంతి శాంతి: తెరకెక్కింది. భార్యపై కోపాన్ని చూపించే భర్తగా తరుణ్ భాస్కర్ నటించాడు. కానీ ఒక్కసారి భార్య ఎదురు తిరిగితే ఎలా ఉంటుందనేది ఫన్నీగా చూపించారు. ఈ మూవీ మార్చి 4 నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
చరిత కామాక్షి
తెలుగు లవ్ రొమాంటిక్ మూవీ ‘చరిత కామాక్షి’. కొత్తగా పెళ్లైన జంట మధ్య ఉండే ముద్దు ముచ్చట్లు, రొమాన్స్, లవ్ చుట్టూ సాగే సినిమా ఇది. అయితే మధ్యలో వచ్చే ఓ ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ సినిమాలో అభయ్ నవీన్, దివ్య శ్రీపాద హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చరిత కామాక్షి మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. మార్చి 5న ఈటీవీ విన్ లో ఈ చరిత కామాక్సి సినిమా రిలీజైంది.
అనగనగా ఆస్ట్రేలియాలో
ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ‘అనగనగా ఆస్ట్రేలియాలో’. సస్పెన్స్ తో కూడిన ఈ మూవీకి ఓటీటీలో మంచి క్రేజ్ లభిస్తోంది. పూర్తిగా ఆస్ట్రేలియాలోనే తీసిన ఈ తెలుగు సినిమాలో జ్యోతినాథ్ గౌడ్, శాన్య, చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమా ఆహా వీడియోలో ఉంది.
అన్నగారు వస్తారు
తమిళ హీరో కార్తి లేటెస్ట్ మూవీ అన్నగారు వస్తారు. తమిళంలో వా వాతియార్ పేరుతో వచ్చిన మూవీని తెలుగులో అన్నగారు వస్తారు పేరుతో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కార్తి పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. పొంగల్ 2026 కు రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.
ఈఎంఐ
ఇవాళ (మార్చి 8) ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా ‘ఈఎంఐ’. ఇది ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అభినవ్ మణికంఠ, నేహా పఠాన్ హీరో హీరోయిన్లుగా నటించారు. కారు ఈఎంఐ కట్టలేక పిల్లలు వద్దనుకునే భార్యాభర్తల కథతో ఈఎంఐ మూవీ తెరకెక్కింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


