OTT Telugu: హారర్ థ్రిల్లర్ టు కామెడీ ఎంటర్ టైనర్.. ఈ వారం ఓటీటీలోని స్పెషల్ తెలుగు సినిమాలు.. వీకెండ్ మస్ట్ వాచ్ లిస్ట్
OTT Telugu: ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. వీటిలో కొన్ని మూవీస్ క్రేజీగా ఉన్నాయి. ఈ స్పెషల్ సినిమాలు వీకెండ్ వాచ్ కు బెస్ట్. మరి వీటిపై ఓ లుక్కేయండి.
ఓటీటీలో తెలుగు సినిమాలు అదరగొడుతున్నాయి. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన వాటిల్లో ఈ ఫిల్మ్స్ స్పెషల్ గా ఉన్నాయి. ఇందులో హారర్ థ్రిల్లర్ టు కామెడీ ఎంటర్ టైనర్ వరకు డిఫరెంట్ జోనర్లలో సినిమాలున్నాయి. ఈ వీకెండ్ కు వీటిపై ఓ లుక్కేయండి.

అమరావతికి ఆహ్వానం ఓటీటీ
ఓటీటీలో తెలుగు హారర్ థ్రిల్లర్ ‘అమరావతికి ఆహ్వానం’ సినిమా అదరగొడుతోంది. ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో శివ, ఎస్తేర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత తదితరులు నటించారు. దెయ్యాలను కెమెరాతో షూట్ చేద్దామని అమరావతి గ్రామానికి వెళ్లిన ఓ కుటుంబానికి ఏం జరిగిందన్నదే అమరావతికి ఆహ్వానం మూవీ స్టోరీ.
విష్ణు విన్యాసం ఓటీటీ
వరుస సినిమాలతో జోరుమీదున్న శ్రీ విష్ణు నుంచి వచ్చిన మరో మూవీ ‘విష్ణు విన్యాసం’. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ విష్ణు విన్యాసం తెరకెక్కింది. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అయిదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విష్ణు విన్యాసం ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమాలో శ్రీ విష్ణుకు జోడీగా నయన్ సారిక నటించింది. తను ప్రేమించిన అమ్మాయి జాతకంలో దోషం ఉంటే ఆ హీరో ఏం చేశాడనే దాని చుట్టూ విష్ణు విన్యాసం మూవీ తిరుగుతుంది.
సుమతీ శతకం
బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా నటించిన మూవీ ‘సుమతీ శతకం’. ఈ సినిమాలో శైలి చౌదరి హీరోయిన్. ఈ లవ్ స్టోరీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ కుర్రాడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు.
కానీ కిరాణా కొట్టు నడిపే అతనికి ఎవరూ పిల్లను ఇవ్వరు. అలాంటి అతను ఒకసారి అంగన్వాడీ టీచర్ గా వచ్చిన హీరోయిన్ చూసి లవ్ చేస్తాడు. మరి వీళ్ల లవ్ స్టోరీకి ఎలాంటి ఎండింగ్ దక్కిందన్నది సుమతీ శతకం మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
సీతా పయనం
సీనియర్ యాక్షన్ హీరో అర్జున్ సర్జా కూతరు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా చేసిన మూవీ ‘సీతా పయనం’. ఇది తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అయింది. దీనికి అర్జునే డైరెక్టర్. ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో ఉంది.
ఓ రోడ్డు ప్రయాణంలో మలుపు తిరిగే హీరోయిన్ కథనే సీతా పయనం. పెళ్లి అంటే ఇంట్రెస్ట్ ఉండని హీరోయిన్ అనుకోకుండా హీరోతో కలిసి జర్నీ చేయాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది సీతా పయనం సినిమాల చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


