...
...
Next Story

OTT Today Thrillers: ఓటీటీలోకి ఈరోజు వచ్చిన ఈ 6 థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ మిస్ కాకుండా చూడండి

OTT Today Thrillers: ఓటీటీలోకి ఈరోజు అంటే శుక్రవారం (అక్టోబర్ 23) ఆరు థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఈ థ్రిల్లింగ్ కంటెంట్ చూడొచ్చు.

Published on: Oct 23, 2026, 05:41:39 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Today Thrillers: థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఓటీటీలోకి ఈ ఒక్క రోజే ఆరు క్రేజీ మూవీస్, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో మలయాళ కామెడీ థ్రిల్లర్, హిందీ క్రైమ్ థ్రిల్లర్ నుంచి కన్నడ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వరకు ఉన్నాయి. మరి వీటిని ఎక్కడ, ఎలా చూడాలో తెలుసుకోండి.

1. 'ధూమకేతు' (Dhoomakethu) - టైమ్-లూప్ కామెడీ థ్రిల్లర్

OTT Today Thrillers: ఓటీటీలోకి ఈరోజు వచ్చిన ఈ 6 థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ మిస్ కాకుండా చూడండి
OTT Today Thrillers: ఓటీటీలోకి ఈరోజు వచ్చిన ఈ 6 థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ మిస్ కాకుండా చూడండి

ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (తెలుగు డబ్బింగ్ కూడా)

విడుదల తేదీ: అక్టోబర్ 23

ఇదో మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీ. సజిన్ గోపు, నిఖిలా విమల్ జంటగా నటించిన ఈ టైమ్-లూప్ కామెడీ థ్రిల్లర్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి తెలుగులోనూ వస్తోంది. తన పెళ్లి రోజే దారుణంగా హత్యకు గురయ్యే కుట్టన్ అనే వ్యక్తి.. మళ్లీ మళ్లీ అదే రోజుకు తిరిగి వస్తుంటాడు. పెళ్లి జరిగినా శోభనం మాత్రం జరగదు. తను బతకడానికి, తన భార్యను కాపాడుకోవడానికి అతడు చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తూనే థ్రిల్ పంచుతుంది.

2. 'అయ్యన మానే' - సీజన్ 2 (Ayyana Mane Season 2) - మిస్టరీ థ్రిల్లర్

ప్లాట్‌ఫామ్: జీ5 (Zee5)

విడుదల తేదీ: అక్టోబర్ 23

ఇదో కన్నడ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇప్పటికే తొలి సీజన్ సూపర్ హిట్ కాగా.. రెండో సీజన్ వచ్చింది. తొలి సీజన్ లో అత్తే విలన్ గా మారి చివరికి చనిపోగా.. ఆ అత్త ఆత్మ చెప్పే రహస్యాలను ఛేదించే కోడలి కథతో ఇది సాగుతుంది.

3. 'చార్ యార్' (Chaar Yaar) - క్రైమ్ థ్రిల్లర్

విడుదల తేదీ: అక్టోబర్ 23

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇదొక మంచి చాయిస్. నలుగురు మిడిల్ క్లాస్ స్నేహితులు (జై, టోనీ, సాహిల్, సమీర్) జీవితంలో త్వరగా స్థిరపడాలనే ఆశతో చేసే ఒకే ఒక్క తప్పు, వారిని నేర ప్రపంచంలోకి నెట్టివేస్తుంది. ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్లు, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలే ఈ సినిమా కథాంశం.

4. 'గజబ్ రాత్' (Gajab Raat) - సస్పెన్స్ థ్రిల్లర్

ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

విడుదల తేదీ: అక్టోబర్ 23

విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఒక రాత్రి వేళ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి తన స్వార్థం లేదా బాధ్యత మధ్య ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ ఒక్క నిర్ణయం వల్ల ఆ రాత్రి ఎలాంటి సంచలనాలు జరిగాయనేది మైండ్ బ్లోయింగ్ స్క్రీన్‌ప్లేతో చూపించారు. ఇందులో నుస్రత్ భరుచా, దివ్యా దత్తా, సాకిబ్ సలీమ్ కూడా నటించారు.

5. 'సర్వైవింగ్ హరికేన్ ఓటిస్' (Surviving Hurricane Otis) - సర్వైవల్ థ్రిల్లర్

ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

విడుదల తేదీ: అక్టోబర్ 23

2023లో మెక్సికోను ముంచెత్తిన భయంకరమైన 'కేటగిరీ-5' ఓటిస్ తుఫాను ఆధారంగా తెరకెక్కిన ప్రకృతి విపత్తు చిత్రం ఇది. ఊహించని రీతిలో వచ్చిన హరికేన్ మధ్య ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేసిన పోరాటాన్ని ఈ సర్వైవల్ థ్రిల్లర్ లో కళ్లకు కట్టినట్లు చూపించారు.

6. 'సట్టముమ్ నీధియుమ్' - సీజన్ 2 (Sattamum Needhiyum Season 2) - లీగల్ థ్రిల్లర్

ప్లాట్‌ఫామ్: జీ5 (Zee5)

విడుదల తేదీ: అక్టోబర్ 23

కోర్ట్‌రూమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారి కోసం తమిళ వెబ్ సిరీస్ 'సట్టముమ్ నీధియుమ్' రెండో సీజన్ రాబోతోంది. న్యాయవాది సుందరమూర్తి అవినీతికి వ్యతిరేకంగా, ఒక నిజాన్ని బయటపెట్టడానికి ఏ విధంగా పోరాడాడనేది ఇందులో ఉత్కంఠభరితంగా ఉంటుంది. తొలి సీజన్ కు మంచి రివ్యూలు రావడంతో రెండో సీజన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks