OTT Top 10: ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు అసలైన విందు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix), ప్రైమ్ వీడియో (Prime Video), జియో హాట్‌స్టార్ (JioHotstar), సోనీ లివ్ (SonyLIV) వంటి దిగ్గజ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఏకంగా 10 క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. హై-వోల్టేజ్ యాక్షన్, సీటు అంచున కూర్చోబెట్టే సస్పెన్స్ థ్రిల్లర్స్ నుంచి గుండెలను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాల వరకు ప్రతీ ఒక్కరి ఛాయిస్‌కు తగ్గ కంటెంట్ అందుబాటులో ఉంది.
ప్రైమ్ వీడియోలో నవ్వులు, క్రేజీ రొమాన్స్
1. దుపహియా సీజన్ 2 (Dupahiya Season 2)

మొదటి సీజన్ మంచి విజయం సాధించిన తర్వాత ప్రైమ్ వీడియోలోకి వచ్చిన అవుట్ అండ్ అవుట్ విలేజ్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. ధడక్‌పూర్ గ్రామంలో పేపర్ లీక్, మొబైల్ టవర్ ఏర్పాటు చుట్టూ జరిగే గందరగోళం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. ప్రశాంతంగా నవ్వుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ వీకెండ్ షో.
2. డోంట్ బి షై (Don't Be Shy)
బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్, షహీన్ భట్ సంయుక్తంగా నిర్మించిన ఈ రోమ్‌కామ్ మూవీ లవ్, బ్రేకప్, ఫ్రెండ్‌షిప్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. లైఫ్‌ను చాలా పక్కాగా ప్లాన్ చేసుకునే షామిలీ అనే అమ్మాయి జీవితంలో బ్రేకప్ వల్ల ఎలాంటి మలుపులు తిరిగాయనేది ఈ చిత్రంలో చూడవచ్చు.
జియో హాట్‌స్టార్‌లో మైండ్ బెండింగ్ థ్రిల్లర్స్
3. హుంకార్: ది రోర్ (Hunkar: The Roar)
అనీత్ పడ్డా, ఫాతిమా సనా షేక్, జీషాన్ అయ్యూబ్, రఘుబీర్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇంటెన్స్ కోర్ట్‌రూమ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఒక పవర్‌ఫుల్ బాబాపై వచ్చిన రేప్ ఆరోపణలు, దాని వెనుక ఉన్న రాజకీయాలు, న్యాయపోరాటం చుట్టూ కథ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది.
4. ది ఇండియా స్టోరీ (The India Story)
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్న మూవీ ఇది. ఇది ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. పురుగుల మందుల వల్ల వచ్చిన క్యాన్సర్‌తో కూతురిని కోల్పోయిన ఒక తండ్రి, పెద్ద కెమికల్ కార్పొరేట్ కంపెనీలపై కోర్టులో చేసే వీరోచిత పోరాటమే ఈ సినిమా ముఖ్యాంశం. కాజల్ ఇందులో లాయర్ గా నటించింది.
నెట్‌ఫ్లిక్స్‌లో 5 వెరైటీ ఎంటర్టైనర్స్
5. చుంబక్ (Chumbak)
{{/usCountry}}తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్న మూవీ ఇది. ఇది ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. పురుగుల మందుల వల్ల వచ్చిన క్యాన్సర్‌తో కూతురిని కోల్పోయిన ఒక తండ్రి, పెద్ద కెమికల్ కార్పొరేట్ కంపెనీలపై కోర్టులో చేసే వీరోచిత పోరాటమే ఈ సినిమా ముఖ్యాంశం. కాజల్ ఇందులో లాయర్ గా నటించింది.
నెట్‌ఫ్లిక్స్‌లో 5 వెరైటీ ఎంటర్టైనర్స్
5. చుంబక్ (Chumbak)
{{/usCountry}}ఏకంగా 16 ఎపిసోడ్లతో వచ్చిన ఈ కామెడీ సిరీస్‌లో నీనా గుప్తా, అర్జున్ బిజ్లానీ, సుమీత్ వ్యాస్ వంటి నటులు అలరించారు. ఒకే సొసైటీలో ఉండే విచిత్రమైన పొరుగువారి మధ్య జరిగే సరదా సంఘటనలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
6. ఓ మై డాగ్ (Oh My Dog)
ఒక చిన్న పిల్లాడికి, వీధి కుక్కకు మధ్య ఏర్పడే విడదీయరాని అనుబంధం నేపథ్యంలో వచ్చిన హృదయానికి హత్తుకునే ఫ్యామిలీ డ్రామా ఇది. పిల్లలతో కలిసి చూడటానికి ఇది బెస్ట్ ఆప్షన్.
7. #లవ్ (#Love)
అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఇది. ఈ తమిళ సిరీస్ తెలుగులోనూ అందుబాటులో ఉంది. డేటింగ్ యాప్స్ మధ్య వార్ కాస్తా ఇద్దరి మధ్య ప్రేమలా ఎలా మారిందన్నది ఇందులో చూడొచ్చు.
8. ది జెంటిల్‌మెన్ (The Gentlemen)
ఐఎండీబీలో 8.1 రేటింగ్‌తో దూసుకుపోతున్న బ్రిటీష్ యాక్షన్ కామెడీ సిరీస్. క్రైమ్, డార్క్ కామెడీ ఇష్టపడే వారికి ఈ రెండు సీజన్లు విపరీతంగా నచ్చుతాయి.
9. షక్: ట్రస్ట్ నో వన్ (Shak: Trust No One)
హాస్పిటల్ నుంచి కిడ్నాప్ అయిన తన బిడ్డ కోసం ఒక తల్లి చేసే అన్వేషణ, దాని వెనుక బయటపడే దారుణమైన నిజాల చుట్టూ సాగే గ్రిప్పింగ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇది.
సోనీ లివ్‌లో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా
10. క్యోంకి పాపా కెహతే హై (Kyunki Papa Kehte Hain)
అకస్మాత్తుగా తల్లిదండ్రులను కోల్పోయిన ఐదుగురు అన్నాచెల్లెళ్లు సమాజంలో నిలదొక్కుకోవడానికి పడే తపన, వారి మధ్య ఉండే ప్రేమానురాగాల ఆధారంగా తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ సిరీస్ ఇది.