Top 11 Web Series: టాప్ 11 వెబ్ సిరీస్.. పదేళ్లలో ప్రతి ఏటా అత్యధిక ఐఎండీబీ రేటింగ్ సిరీస్ ఇవే.. థ్రిల్లర్ల హవా

Top 10 Web Series: ఓటీటీ యుగంలో ఇండియన్ ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టిన ఐఎండీబీ (IMDb) టాప్ 11 ఇండియన్ వెబ్ సిరీస్‌ల జాబితా విడుదలైంది. గత పదేళ్ల కాలంలో (2016 నుంచి 2026 వరకు) ప్రతి ఏటా అత్యధిక ఆదరణ పొంది, రికార్డు రేటింగ్‌లు సాధించిన నంబర్ 1 వెబ్ సిరీస్‌ల వివరాలను ఐఎండీబీ ప్రకటించింది.

Published on: Oct 28, 2026, 14:09:40 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Top 10 Web Series: గత పదేళ్ల కాలంలో ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. బిగ్ స్క్రీన్ థియేటర్ల కంటే ఓటీటీ (OTT) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వచ్చే సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్స్, డ్రామాలు, రియలిస్టిక్ కథాంశాలకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. నాణ్యమైన కంటెంట్‌తో మిలియన్ల మంది ఆడియెన్స్ ను ఆకట్టుకున్న ఇండియన్ వెబ్ సిరీస్‌లకు అంతర్జాతీయ వేదిక అయిన ఐఎండీబీ ప్రత్యేక గుర్తింపునిచ్చింది.

Top 10 Web Series: టాప్ 10 వెబ్ సిరీస్.. పదేళ్లలో ప్రతి ఏటా అత్యధిక ఐఎండీబీ రేటింగ్ సిరీస్ ఇవే.. థ్రిల్లర్ల హవా
Top 10 Web Series: టాప్ 10 వెబ్ సిరీస్.. పదేళ్లలో ప్రతి ఏటా అత్యధిక ఐఎండీబీ రేటింగ్ సిరీస్ ఇవే.. థ్రిల్లర్ల హవా

తాజాగా 2016 సంవత్సరం నుంచి 2026 వరకు గత 10 ఏళ్లలో ప్రతి ఏడాది అత్యధిక ప్రజాదరణ పొందిన 'టాప్ 11 ఇండియన్ వెబ్ సిరీస్‌ల' (Top 11 Most Popular Indian Web Series) అధికారిక జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది. ఆ'స్కామ్ 1992', 'సేక్రెడ్ గేమ్స్', 'ఫర్జీ' నుంచి 2026 లేటెస్ట్ హిట్ వరకు ఏ సిరీస్ ఏ ఓటీటీ వేదికగా అందుబాటులో ఉందో ఇక్కడ పూర్తి వివరంగా తెలుసుకుందాం.

1. 2016: టీవీఎఫ్ పిచర్స్ (TVF Pitchers) — IMDb రేటింగ్: 9.0

కార్పొరేట్ ఉద్యోగాల విసుగు నుంచి బయటపడి, సొంతంగా స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలనుకునే నలుగురు మిత్రుల కథే 'టీవీఎఫ్ పిచర్స్'. స్నేహం, కలలు, వ్యాపార సవాళ్ల కలబోతగా వచ్చిన ఈ యూత్‌ఫుల్ సిరీస్ ఓటీటీ విప్లవానికి నాంది పలికింది. ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.

2. 2017: ఇన్‌సైడ్ ఎడ్జ్ (Inside Edge) — IMDb రేటింగ్: 7.9

క్రికెట్ ప్రపంచంలోని వెలుగుల వెనుక ఉన్న చీకటి కోణాలు, బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, రాజకీయం, పవర్‌గేమ్‌లను కళ్లకు కట్టినట్లు చూపించిన పవర్‌ఫుల్ సిరీస్ 'ఇన్‌సైడ్ ఎడ్జ్'. దీనిని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడొచ్చు.

3. 2018: సేక్రెడ్ గేమ్స్ (Sacred Games Season 1) — IMDb రేటింగ్: 8.5

నవాజుద్దీన్ సిద్ధిఖీ (గణేష్ గైతోండే), సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో ముంబై అండర్‌వరల్డ్, క్రైమ్ అండ్ మిస్టరీ నేపథ్యంలో వచ్చిన 'సేక్రెడ్ గేమ్స్' భారతీయ ఓటీటీ చరిత్రలోనే అతిపెద్ద సంచలనం సృష్టించింది. చాలా బోల్డ్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ను నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

4. 2019: సేక్రెడ్ గేమ్స్ 2 (Sacred Games Season 2) — IMDb రేటింగ్: 7.9

'సేక్రెడ్ గేమ్స్' మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ తర్వాత వచ్చిన సీక్వెల్ ఇది. పాత మిస్టరీలకు సమాధానాలు చెబుతూ కొత్త పాత్రల ఎంట్రీతో కథను ముగించారు. ఇది కూడా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.

5. 2020: స్క్యామ్ 1992 - ది హర్షద్ మెహతా స్టోరీ (Scam 1992) — IMDb రేటింగ్: 9.2

దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కించిన ఈ బయోపిక్ క్రైమ్ వెబ్ సిరీస్ స్టాక్ మార్కెట్ సంచలనం హర్షద్ మెహతా జీవితం ఆధారంగా రూపొందింది. ప్రతీక్ గాంధీ నటన, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఈ సిరీస్ ఐఎండీబీలో ఆల్-టైమ్ రికార్డు రేటింగ్ 9.2 దక్కించుకుంది. సోనీ లివ్ (SonyLIV)లో అందుబాటులో ఉంది.

6. 2021: ఆస్పిరెంట్స్ (Aspirants) — IMDb రేటింగ్: 9.1

ఢిల్లీలో యూపీఎస్సీ (UPSC) సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యే నలుగురు మిత్రుల కష్టాలు, వారి జీవితాల్లోని ఎమోషన్స్, స్ట్రగుల్స్‌ను అత్యంత సహజంగా ఆవిష్కరించిన సిరీస్ ఇది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది.

7. 2022: క్రిమినల్ జస్టిస్ (Criminal Justice) — IMDb రేటింగ్: 7.8

పంకజ్ త్రిపాఠి అడ్వకేట్ మాధవ్ మిశ్రాగా నటించిన ఈ కోర్ట్‌రూమ్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ మంచి ప్రేక్షక ఆదరణ పొందింది. ఆ తర్వాత మరో రెండు సీజన్లు కూడా వచ్చాయి. జియోహాట్‌స్టార్ (JioHotstar)లో చూడొచ్చు.

8. 2023: ఫర్జీ (Farzi) — IMDb రేటింగ్: 8.3

షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన డూప్లికేట్ కరెన్సీ (ఫేక్ నోట్లు) క్రైమ్ థ్రిల్లర్ 'ఫర్జీ'. ఇది గ్లోబల్ వైడ్‌గా భారీ వ్యూయర్ షిప్ సాధించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది.

9. 2024: మిర్జాపూర్ సీజన్ 3 (Mirzapur Season 3) — IMDb రేటింగ్: 6.4

పూర్వాంచల్ అధికారం కోసం గుడ్డూ పండిట్, కాలీన్ భయ్యా నడుమ సాగిన రక్తపాతం, రాజకీయాల ఆధారంగా వచ్చిన మిర్జాపూర్ 3వ భాగం. ఇది కూడా ప్రైమ్ వీడియోలోనే అందుబాటులో ఉంది.

10. 2025: ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (The Bads of Bollywood) — IMDb రేటింగ్: 7.5

కింగ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో బాలీవుడ్ ఇన్సైడ్ పాలిటిక్స్, స్టార్డమ్ వెనుక ఉన్న అసలు రహస్యాల నేపథ్యంలో వచ్చి సంచలనం సృష్టించిన సిరీస్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.

11. 2026: ప్రీతమ్ అండ్ పెడ్రో (Pritam & Pedro) — IMDb రేటింగ్: 7.7

ఇక ఈ ఏడాది అంటే 2026 సంవత్సరంలో విడుదలైన సరికొత్త కామెడీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ 'ప్రీతమ్ అండ్ పెడ్రో'. వినూత్నమైన మేకింగ్‌తో ఓటీటీ వీక్షకులను అలరిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ క్రియేటర్ గా ఉన్న ఈ సిరీస్ ను జియోహాట్‌స్టార్ (JioHotstar)లో చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More